Nizamabad MP

యువతకు భవిష్యత్‌పై భరోసా కల్పిస్తాం..

-స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటు
-తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత
-సంప్రదించాల్సిన నెంబర్ 0870-2554333

Kalvakuntla Kavitha launched Telangana Jagruthi Skill development programme centre in Warangal (4)
యువత భవిష్యత్‌పై భరోసా కల్పిస్తూ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హన్మకొండ ఎన్జీవోస్‌కాలనీ రోడ్‌లోని శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆమె బుధవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. నేటి యువతలో ఉద్యోగాల స్కిల్స్‌లో కేవలం ఒక శాతం మాత్రమే అర్హులుగా నిలుస్తున్నారని, బంగారు తెలంగాణ సాధనలో భాగంగా యువతలో నైపుణ్యం కల్పించడం కోసం జాగృతి ఆధ్వర్యంలో స్కిల్స్ డెవలప్‌మెంట్ కేంద్రాలను నెలకొల్పినట్లు ఆమె వెల్లడించారు. విద్యార్థులకు సరియైన స్కిల్స్ లేకపోవడం వల్ల ఉద్యోగావకాశాలు లభించటం లేదన్నారు.

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు కవిత ప్రకటించారు. ఈ సెంటర్ల ద్వారా లక్షలాది మంది యువతకు కొత్త జీవితాలను ప్రసాదించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ సెంటర్‌లలో కంప్యూటర్, టెక్స్‌టైల్స్, రిటైల్ మార్కెటింగ్, ఎలక్ట్రానిక్స్, మీడియా డెవలప్‌మెంట్, టూరిజం, హాస్పిటాలిటీ తదితర కోర్సులలో యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ఇందు కోసం 0870-2554333 నెంబర్‌లో యువత సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ పద్మ, ఎమ్యెల్యే వినయ్‌భాస్కర్, ఎంపీ సీతారాంనాయక్, జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్, దాస్యం విజయభాస్కర్, తిరుపతిరావు, జిల్లా కన్వీనర్ కోరబోయిన విజయ్‌కుమార్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు, అర్బన్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్, స్కిల్ డెవలప్‌మెంట్ సీఈవో ప్రశాంత్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్లు సుజిత్, ప్రకాశ్‌రావు, జాగృతి నాయకులు శ్రీకాంత్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

జాగృతి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ కవిత
హన్మకొండ ఎన్జీవోస్‌కాలనీ రోడ్ శ్రీనగర్‌కాలనీలో జాగృతి జిల్లా కార్యాలయాన్ని బుధవారం ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ కోరబోయిన విజయ్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయభాస్కర్ ఆధ్వర్యంలో కవితకు ఘన స్వాగతం పలికా రు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.


Connect with us

Latest Updates