Nizamabad MP

వింబుల్డన్ మహిళల డబుల్స్ విజేత సానియాని సన్మానించిన ఎంపీ కవిత

హైదరాబాద్ లో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య నిర్వహించిన “ఫ్యూచర్ స్టార్స్ మాస్టర్ క్లాస్ ” అనే కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్న  సానియా మీర్జాని కవిత గారు ఘనంగా సన్మానించారు.

Kalvakuntla Kavitha with Sania Mirzaఈ కార్యక్రమంలో కవితగారు మాట్లాడుతూ సానియా మహిళల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి భారత మహిళగా నిలవడంతో పాటు మన దేశం తరపున నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లో విజేతగా నిలిచిన మహిళగానూ రికార్డు సృష్టించిందన్నారు. సానియా తన విజయంతో యువత కలలు కనడమే కాదు నిరంతర శ్రమ, పట్టుదలతో కన్న కలలను నిజం చేసుకోవచ్చని తెలిపి యువతకు ఆదర్శం ప్రాయంగా నిలిచారని కొనియాడారు.


Connect with us

Latest Updates