Nizamabad MP

వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

వికలాంగుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కవిత వికలాంగుల పరిరక్షణ సమితి, వికలాంగుల జాగృతి సభ్యులకు తెలిపారు.

mp-kalvakuntla-kavitha-meeting-with-physically-hanicapped-members

ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖ లా వికలాంగుల శాఖని కూడ స్వతంత్రముగా ఉంచాలని, నూతన వికలాంగుల హక్కుల చట్టం అమలు చేయాలని మూడు శాతము ఉద్యోగాలు, మూడు శాతము బడ్జెట్ కేటాయించాలని ఆమెను కోరారు. తెలంగాణలో అన్ని సంక్షేమ పథకాల్లో వికలాంగులకు నూతన చట్టం ప్రకారం అయిదు శాతము అమలు చేయాలని, వికలాంగుల సెన్సారి పార్క్ ని ముఖ్యమంత్రి జన్మదినమున ముఖ్యమంత్రి గారిచే ప్రారంభము చేయాలని పరిరక్షణ సమితి, వికలాంగుల జాగృతి ప్రతినిదులు గంగారామ్, శ్రీనివాసులు, అంజనా రెడ్డి వికలాంగుల రాష్ట్ర నాయకులు పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కవితని కోరారు. పార్లమెంట్ లో వికలాంగుల బిల్లు అమోదంలో పూర్తి మద్దతు తెలిపినందుకు కవిత గారిని సంఘాల ప్రతినిధులు ప్రశంసించారు. ఈ సమావేశంలో టీఎంజీవో గౌరవ అధ్యక్షులు దేవిప్రసాద్ తో పాటు వివిధ వికలాంగుల సంఘాల ప్రతినిధులు సుధాకర్, బాబూజాన్, పరుశురాం, కిరణ్ ,జగన్ శ్రీమతి ఆస్మా, రాజాలక్ష్మి, సుబద్ర తదితరులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates