Nizamabad MP

విద్యుత్ కార్మికులపై ప్రత్యేకశ్రద్ధ

రాష్ర్టానికి నిరంతర విద్యుత్ అందిస్తున్న విద్యుత్ కార్మికుల శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ కవిత అన్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియలో అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

తెలంగాణ ఇండ్లలో విద్యుత్ కార్మికులు వెలుగులు నింపితే, సీఎం కేసీఆర్ ఆ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. విద్యుత్ కార్మికుల శ్రేయస్సుకు కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యమిస్తారని తెలిపారు. అందుకే 23 వేలమంది కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తూ సీఎం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. క్రమబద్ధీకరణలో అన్ని క్యాడర్‌ల ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పారు. రవీంద్రభారతిలో సోమవారం టీఆర్‌వీకేఎస్ ఆధ్వర్యంలో 2017 డైరీ, క్యాలెండర్‌ను ఎంపీ కవిత, విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఎంపీ కవిత మాట్లాడుతూ 23వేల ఉద్యోగాల రెగ్యులరైజేషన్‌కు దేవుడు వరమిచ్చాడని, ఇప్పుడు విద్యుత్ సంఘాలు పూజారుల్లాగా అందరికీ న్యాయం చేయాల్సి ఉందని అన్నారు. ఇందులో టీఆర్‌వీకేఎస్ పెద్ద పాత్ర తీసుకోవాలని కోరారు.

MP Kalvakuntla Kavitha participated in Diary launch of Telangana Electricity Employees (2)
ఏపీ తొండి చేసినా..
ఆంధ్రప్రదేశ్ విడిపోయిన వారంలోపే ఖమ్మం జిల్లా మండలాలను ఆంధ్రలో కలుపడంతో సీలేరునుంచి 450 మెగావాట్ల విద్యుత్ కోల్పోయామని, అదే సమయంలో కృష్ణపట్నం నుంచి రావాల్సిన 800 మెగా వాట్ల కరెంట్‌లో ఏపీ తొండి చేసి కరెంటు ఆపిందన్నారు. ఆ సందర్భంగా కనీసం ఒక్క సంఘం కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా స్పందించకపోతే జెండాలు, రంగులతో ప్రయోజనం ఏమిటని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలన్నారు. ఈ క్రమంలో ఒక శక్తిగా వచ్చిన టీఆర్‌వీకేఎస్ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలబడుతుందన్నారు.

సమస్యలు తప్పించేందుకే ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం..
ఛత్తీస్‌గఢ్ ఒప్పందం మీద మాట్లాడేవాళ్లు ఆనాటి నేపథ్యాన్ని చూడాలని కవిత అన్నారు. రాష్ట్రం తీవ్ర కరెంటు కొరత ఎదుర్కుంటున్న సమయంలో ఉత్తర, దక్షిణ దేశాల మధ్య గ్రిడ్ అనుసంధానం లేనందున సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపి వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందం చేసుకున్నారన్నారు. డిస్కంలు నష్టాల్లో ఉన్నాయని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉదయ్ స్కీంలో చేరి దాదాపు రూ. 8900కోట్ల అప్పులను భరించేందుకు చర్యలు తీసుకుందన్నారు. సీఎం కేసీఆర్ గుణం ఎట్లన్నదంంటే చెరువులో ఉన్న చేప పిల్ల ఆయనకే కావాలి. చెలుకలల్ల ఉన్న గొర్రె పిల్ల ఆయనకే కావాలి. అడవిలో ఉండే కోతి పిల్ల రంది అయనకే.. అందుకే చెట్లు పెంచుతాం.. కోతులను కాపాడుదాం.. అంటారు. అని చెప్పారు.


Connect with us

Latest Updates