Nizamabad MP

టోఫెల్ లేకుండానే షికాగోలో చదువుకోవచ్చు

నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ, అమెరికాలోని షికాగో స్టేట్ యూనివర్సిటీల మధ్య విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర బదిలీపై అంగీకారం కుదిరింది. తెలంగాణ యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ పార్థసారధి, షికాగో యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట డేవిడ్‌కానిస్‌లు అవగాహన ఒప్పందంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో సంతకాలు చేశారు. నిజామాబాద్ ఎంపీ కవిత చొరవతోనే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు డేవిడ్ చెప్పారు. ఈ ఒప్పందం ప్రకారం ఇకపై జీఆర్‌ఈ, టోఫెల్ లేకుండానే షికాగో యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి అవకాశం లభిస్తుంది. ఏడాదికి 75 వేల మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు.

Kalvakuntla kavitha
-తెలంగాణ, షికాగో స్టేట్ యూనివర్సిటీల మధ్య ఒప్పందం
-విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర బదిలీ
-యేడాదికి 75 వేల మంది విద్యార్థులకు అవకాశం
ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో విద్యార్థుల బదిలీకి ఒప్పందం కుదిరింది. భవిష్యత్‌లో ఫార్మా, నర్సింగ్, కెమికల్ టెక్నాలజీ తదితర రంగాల్లోకూడా విద్యార్థుల బదిలీకి అవకాశం ఉంటుంది. తెలంగాణలోని గ్రామీణ విద్యార్థులకు ఇకపై విదేశాల్లో విద్యను అభ్యసించడానికి సులభంగా అవకాశం వస్తుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డీ శ్రీనివాస్, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ లింబాద్రి, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజారాం తదితరులు పాల్గొన్నారు. షికాగో యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి రోహన్ అటెలె, నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ ప్రెసిడెంట్ రవి ఆచంట పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు.


Connect with us

Latest Updates