Nizamabad MP

త్వ‌ర‌లోనే విక‌లాంగుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం

ఎంపి క‌విత నేతృత్వంలో మంత్రి తుమ్మ‌ల‌ను క‌లిసిన విక‌లాంగ సంఘాల ప్ర‌తినిధులు

త్వ‌ర‌లోనే విక‌లాంగుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు విక‌లాగ సంఘాల ప్ర‌తినిధుల‌కు హామీనిచ్చారు. బుధ‌వారం నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత నేతృత్వంలో విక‌లాంగ సంఘాల ప్ర‌తినిధులు సెక్ర‌టేరియెట్‌లో మంత్రి తుమ్మ‌ల‌ను క‌లిశారు. స్పందించిన మంత్రి విక‌లాంగ శాఖ ఉన్న‌తాధికారులు, విక‌లాంగ సంఘాల నాయ‌కుల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. స‌మావేశానికి డిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధి స‌ముద్రాల వేణుగోపాలాచారి కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా విక‌లాంగులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌తినిధులు మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు. తెలంగాణ జాగృతి కార్య‌ద‌ర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ విక‌లాంగుల కోసం ప్ర‌త్యేక శాఖ‌ను ఏర్పాటు చేయాల‌ని, బ్యాక్‌లాగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని, ప్ర‌మోష‌న్ల‌లో రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేయాల‌ని కోరారు. స్పందించిన మంత్రి తుమ్మ‌ల మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి కేసిఆర్ అంద‌రికీ మేలు చేస్తున్నార‌ని, మీకు కూడా మేలు జ‌రుగుతుంద‌న్నారు. డీమెర్జ‌ర్‌తో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌న్నారు. బ్యాక్‌లాగ్ పోస్టుల భ‌ర్తీపై విక‌లాంగుల శాఖ డైరెక్ట‌ర్ శైల‌జ మాట్లాడుతూ 431 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చామ‌ని,207 పోస్టుల‌ను భ‌ర్తీ చేశామ‌ని తెలిపారు. మిగ‌తా 217 పోస్టుల‌ను త్వ‌ర‌లోనే భ‌ర్తీ చేస్తామ‌న్నారు. ప్ర‌మోష‌న్ల రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని జిఎడికి పంపామ‌ని తెలిపారు.

Kalvakuntla-Kavitha-met-Minister-Tummala-Nageshwar-Rao

చట్టం అమ‌లుతోనే న్యాయం
విక‌లాంగుల హ‌క్కుల చ‌ట్టం అమ‌లుతోనే విక‌లాంగ స‌మాజానికి న్యాయం జ‌రుగుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత కోరారు. చ‌ట్టం అమ‌లు అవుతున్న తీరును ప‌ర్య‌వేక్షించ‌డం కూడా ముఖ్య‌మేన‌న్నారు. విక‌లాంగుల‌ను వివాహం చేసుకున్న ఇత‌రుల‌కు ఇచ్చే ప్రోత్సాహ‌క డ‌బ్బులు స‌కాలంలో అందేలా చూడాల‌న్నారు. క‌ళ్యాణ ల‌క్ష్మి, డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు, పెన్ష‌న్లు వంటి అన్ని ప‌థ‌కాలు విక‌లాంగుల‌కూ అందేలా చూడాల‌ని మంత్రి తుమ్మ‌ల‌ను కోరారు ఎంపి క‌విత‌. స్పందించిన మంత్రి తుమ్మ‌ల విక‌లాంగ శాఖ అధికారుల‌ను అక్క‌డికక్క‌డే ఆదేశించారు. క‌లెక్ట‌ర్ల‌కు స్వ‌యంగా తెలియ‌జేయాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా ఎంపి క‌విత మంత్రి తుమ్మ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

బ్రెయిలీ లిపి బుక్ ఆవిష్క‌ర‌ణ‌
అంధుల కోసం విక‌లాంగుల హ‌క్కుల చ‌ట్టంను ప్ర‌త్యేకంగా తెలంగాణ ప్ర‌భుత్వం బ్రెయిలీ లిపిలో తీసుకువ‌చ్చింది. ఈ పుస్త‌కాన్ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు, ఎంపి క‌విత ఆవిష్క‌రించారు. అనంత‌రం తెలంగాణ జాగృతి వెబ్‌సైట్‌లో పొందుప‌ర‌చిన విక‌లాంగుల హ‌క్కుల చ‌ట్టం తెలుగు అనువాదం లింక్‌ను ల్యాప్‌టాప్ ద్వారా క్లిక్ చేసి ప్రారంభించారు మంత్రి తుమ్మ‌ల‌. ఈ స‌మావేశంలో విక‌లాంగుల శాఖ డైరెక్ట‌ర్ శైల‌జ‌, కార్య‌ద‌ర్శి జ‌గ‌దీశ్ పాల్గొన్నారు.


Connect with us

Latest Updates