Nizamabad MP

తెలుగు వారి సామాజిక బాధ్య‌త స్పూర్తిదాయ‌కం

ఆటా సిల్వ‌ర్ జూబ్లీ ఉత్స‌వాల్లో ఎంపి క‌విత‌
అమెరికాలో ఉంటున్న తెలుగు వారి సామాజిక స్పృహ‌, బాధ్య‌త స్పూర్తిదాయ‌క‌మ‌న్నారు నిజామాబాద్ ఎంపి. శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. అమెరికా చికాగోలో జ‌రుగుతున్న అమెరికా తెలుగు సంఘం(అటా) సిల్వ‌ర్ జూబ్లీ ఉత్స‌వాల‌కు ఆమె హాజ‌ర‌య్యారు.ఆటా మ‌హిళా విభాగం ప్ర‌తినిధులు బ‌తుక‌మ్మ‌లు, బోనాల‌తో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… ఆటా ఉత్స‌వ క‌మిటీ ఆహ్వానం మేర‌కు రెండు రాష్ట్రాల నుంచి హాజరైన సినీ, రాజ‌కీయ ఇత‌ర ప్ర‌ముఖులు, విద్యావేత్త‌లు, వ్యాపార వేత్త‌లను అభినందించారు.

Kalvakuntla-Kavitha-in-Aata-silver-Jubilee-celebrations-in-US క‌మ్యూనికేష‌న్ రంగంలో సాంకేతిక ప‌రిజ్ఞానం అంతగా అభివృద్ధి చెంద‌ని రోజుల్లో 30 ఏళ్ల కింద‌ట ఇండియా నుంచి అమెరికాకు రావాల‌న్నా…ఉద్యోగాల కోసం ఇక్క‌డికి వ‌చ్చే వారికి ఏద‌న్నా క‌మ్యూనికేట్ చేయాల‌న్నా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడా ప‌రిస్థితి లేదు. ఆటా, తానా …తెలుగు వారి కోసం రెండు సంఘాలుగా ఏర్ప‌డి…సామాజిక, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ…మ‌న‌మంతా ఒక్క‌టే అని చాటి చెప్తున్న నిర్వాహ‌కుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాన‌న్నారు క‌విత‌. ఒక ఆర్గ‌నైజేష‌న్ ప‌నిచేయాలంటే సోష‌ల్ క‌మిట్‌మెంట్ చాలా ముఖ్య‌మ‌న్నారు. ఇండియ‌న్ క‌ల్చ‌ర్‌ నుంచి వచ్చి…అమెరిక‌న్ క‌ల్చ‌ర్‌లో పెరుగుతున్న పిల్ల‌ల‌కు మ‌న నేటివిటీ గొప్ప‌ద‌నాన్ని తెలియ‌జెప్పాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంద‌న్నారు. అమెరికాలో పుట్టిన పిల్ల‌లతో పాటు ఇండియాలో పుట్టి,, ఇక్క‌డ పెరుగుతున్న పిల్ల‌ల‌కు తెలుగు నేటివిటీ మ‌ర్చిపోకుండా ఉండ‌డం చాలా ఆనందించ‌ద‌గిన విష‌య‌మ‌న్నారు. తెలుగు సినిమాలు అమెరిక‌లోని పిల్ల‌లకు తెలుగు భాష‌ను గొప్ప‌ద‌నాన్ని తెలియ‌జేస్తున్నాయ‌ని, తెలుగు నేటివిటీని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపిస్తున్నాయ‌న్నారు. ఆటా, తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ క‌లిసి ప‌నిచేయాల‌ని కోరారు క‌విత‌. .
ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో ఉగ్ర‌వాదులు దాడులు జ‌రిపిన వార్త తెలియ‌గానే ..మ‌న వాళ్ల‌కేమీ కాలేదు క‌దా….అని మొద‌టగా ఎంక్వ‌యిరీ చేసింది ముఖ్య‌మంత్రి కేసిఆర్ గారేన‌ని తెలిపారు ఎంపి క‌విత‌. ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టును క‌ట్టిన వాళ్లు మ‌నోళ్లే…మ‌నోళ్లు ఎక్కువ‌మంది అక్క‌డ ప‌నిచేస్తున్న‌రు అని సిఎం అన్నార‌న్నారు. ప్ర‌పంచంలో మ‌న తెలుగు వాళ్లు ఎక్క‌డున్నా..ఆ కన్‌స‌ర్న్‌ ఉంటుంది సిఎం కేసిఆర్ గారికి అని వివ‌రించారు. రాష్ట్రాలుగా విడిపోదాం..ప‌రిపాల‌నా ప‌రంగా విడిపోదాం కాని ప్ర‌జ‌లుగా క‌లిసి ఉందామ‌ని పిలుపునిచ్చారు క‌విత‌. అమెరికాలో ఉంటున్న తెలుగు వారంద‌రికీ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌కారం ఉంటుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సిఎం క‌డియం శ్రీహ‌రి, ఎంపీలు జితేంద‌ర్ రెడ్డి,మ‌ల్లారెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి, నిజామాబాద్ అర్భ‌న్‌, రూర‌ల్ ఎమ్మెల్యేలు బిగాల గ‌ణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగ‌ర్ రావు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates