Nizamabad MP

తెలంగాణకు అవతల మరో తెలంగాణ బహరైన్ – ఎంపీ కల్వకుంట్ల కవిత

* బహరైన్ లో తెలంగాణ భారీ బహిరంగ సభ, హాజరైన 6 వేల పైచిలుకు తెలంగాణ బిడ్డలు.
* లేబర్ క్యాంపులో కార్మికులతో కలిసి సహపంక్తి బోజనం

తెలంగాణకు అవతల మరో తెలంగాణ బహరైన్ అన్నారు నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతి బహరైన్ శాఖ మరియు తెలంగాణ సాంస్కృతిక సంఘం బహరైన్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బహరైన్ లోని ఇండియన్ స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకు ఆరు వేల పైచిలుకు ప్రవాస తెలంగాణీయులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎంపీ శ్రీమతి కవిత గల్ఫ్ కష్టాలు లేని తెలంగాణ రాష్ట్రం కోసమే మా ప్రయత్నం అన్నారు. గల్ఫ్ లోని ఒక్కో దేశం లో ఒక్కో రకం సమస్యలు ఉన్నప్పటికీ స్థూలంగా గల్ఫ్ కష్టాలన్ని తీవ్రమైనవే అన్నారు. బహరైన్ లో ఇంత పెద్ద ఎత్తున హాజరైన తెలంగాణ బిడ్దలతో రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.

ఉదయం బహరైన్ లోని తెలంగాణ జాగృతి నాయకులు సీహెచ్ హరిప్రసాద్ స్వగృహంలో అల్పాహారానికి హాజరైన కవిత ఈ సారి బతుకమ్మ ఏర్పాట్లను అక్కడి తెలంగాణ సంఘాల నాయకులతో సమీక్షించారు.

మద్యాహ్నం శ్రీమతి కవిత లేబర్ క్యాంపుల్లో ఉన్న తెలంగాణ వారిని కలిసారు. గల్ఫ్ లో ఉన్నందుకు తెలంగాణ లోని తమ ఊర్లల్లో రేషన్ కార్డుల నుండి తమ పేర్లను తొలగిస్తున్నారని, తొలగించకుండా ఉంచేలా కృషి చేయాలని కోరారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెస్తానని శ్రీమతి కవిత వారికి హామీ ఇచ్చారు. అనంతరం గల్ఫ్ వలస కార్మికులతో కలిసి లేబర్ క్యాంపులో సహపంక్తి బోజనాలు చేసారు. తొలిసారిగా ఒక నాయకురాలు తమ క్యాంపులో తమతో కలిసి సహపంక్తి బోజనం చేసిందని కార్మికులు హర్షం వ్యక్తం చేసారు.

ఈ కార్యక్రమాల్లో సీహెచ్ హరిప్రసాద్, సామా రాజారెడ్డి, పీ శ్రీనివాస్, వెంకటస్వామి, దాసరి మురలి ఇతర కార్యవర్గ సభ్యులు పాల్ఘొన్నారు.


Connect with us

Latest Updates