Nizamabad MP

తెలంగాణ బిడ్డలను చూస్తే గర్వంగా ఉంది

-మేరీలాండ్‌లో బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ కవిత
-రైతు దత్తత కార్యక్రమానికి మేరీలాండ్ జాగృతి సభ్యుల విరాళం

Kalvakuntla Kavitha launched the Bathukamma poster organise by Mariland Telangana association
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ నెల 17న మేరీలాండ్‌లో జరగనున్న మేరీలాండ్ బంగారు బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి సంస్థ చేపట్టిన రైతు దత్తత కార్యక్రమానికి మేరీలాండ్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు వెయ్యి డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణ జాగృతి చేపట్టే కార్యక్రమాల్లో తాము పాలు పంచుకుంటామన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డలందరూ ఎక్కడ ఉన్నా.. సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుతున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. మేరీలాండ్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సంస్థ ఉత్తర అమెరికా శాఖ ప్రధాన కార్యదర్శి సుమంత్, సత్యపాల్, మేరీలాండ్ తెలంగాణ కమ్యూనిటీ సభ్యులు రమణ, ప్రవీణ్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates