Nizamabad MP

స‌ముచిత స్థానం క‌ల్పిస్తేనే పురుషుల‌కు గౌర‌వం

తెలంగాణ జాగృతి మ‌హిళా దినోత్స‌వంలో ఎంపి క‌విత‌
మ‌హిళ‌ల‌కు స‌ముచిత స్థానం కల్పిస్తేనే పురుషుల ప‌ట్ల స‌మాజంలో గౌర‌వం పెరుగుతుంద‌న్నారు నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. బుధ‌వారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలోని సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ జాగృతి అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించింది.

Kalvakuntla-Kavitha-addressed-in-Telangana-Jagruthi-International-Womens-day-celebrations

 

ఈ సంద‌ర్భంగా సైబ‌ర్ నేరాలు-బాలిక‌లు- మ‌హిళ‌ల భ‌ద్ర‌త -మ‌హిళా సాధికార‌త అంశాల‌పై అవ‌గాహ‌న ికార్యక్రమాన్ని నిర్వ‌హించారు. సిసిఎస్‌ అడిష‌ప‌ల్ డిసిపి జె. రంజ‌న్ ర‌త‌న్ కుమార్‌, షి టీమ్స్ ఏసిపి క‌విత సైబ‌ర్ నేరాలు,మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యురాలు పరుచూరి జ‌మున‌, హ్యూమ‌న్ రైట్స్ అడ్వొక‌సి లాయ‌ర్ మ‌హె జాబీన్‌, డిజిట‌ల్ ఫోరెన్సిక్ సైన్స్ సిఇఓ డాక్ట‌ర్ జాకీ, యాక్ష‌న్ ఎయిడ్ ప్రోగ్రామ్స్ ఆఫీస‌ర్ డి. క‌ల్ప‌న‌, డాక్ట‌ర్ వ‌న్నెల భాస్క‌ర్‌, దీప్తిరెడ్డి ఆయా రంగాల్లో మ‌హిళ‌లు ఎదుర్కొనే స‌మ‌స్య‌ల‌ను వివ‌రిస్తూ…వాటిని ఎదుర్కోవ‌డం ఎలాగే తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపి క‌విత మాట్లాడుతూ అవ‌కాశాలు క‌ల్పించ‌మ‌ని మ‌హిళ‌లు అడ‌గ‌డం లేద‌ని, పురుషుల ప‌క్క‌న స‌ముచిత స్థానం క‌ల్పిస్తే చాలున‌న్నారు. మ‌హిళ‌ల జీవితాల్లో చీక‌ట్లు పోయి….వెలుగులు రావాలంటే మ‌హిళాశ‌క్తిని సంఘ‌టితంగా చాటాల‌న్నారు. వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని అందిపుచ్చుకో్వాల‌ని, ఇత‌రుల‌కు మార్గ‌ద‌ర్శ‌కులుగా మారాల‌ని మ‌హిళాలోకానికి పిలుపునిచ్చారు. న‌న్ను చూసి రాజ‌కీయాల్లోకి రావ‌ద్ద‌ని మ‌హిళ‌లు అనుకునే ప‌రిస్థితి రావ‌ద్ద‌ని తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రోజునే అనుకున్నాన‌ని చెప్తూ….మ‌హిళ‌ల కో్సం, నియోజ‌కవ‌ర్గ ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం తాను క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని చెప్పారు. ప‌దిమందికి స్పూర్తిదాయ‌కంగా నిలిచినప్పుడే ప‌ద‌వుల్లో ఉన్న‌వారికి గౌర‌వమ‌ని ఉద్భోధించారు. భూదేవి అంత ఓర్పు క‌లిగిన మ‌హిళ‌లు సాటి మ‌హిళ‌ల అభ్యున్న‌తికి పాటుప‌డాల‌ని క‌విత కోరారు. తెలంగాణ జాగృతిని స్థాపించి తెలంగాణ స‌మాజాన్ని జాగృతం చేస్తున్న‌ట్లు తెలిపారు. తెలంగాణ జాగృతి స్కిల్స్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ల‌ను తెలంగాణ‌లోని 17 పార్ల‌మెంటు నియోజ‌కవ‌ర్గాల్లో ఏర్పాటు చేసిన‌ట్లు క‌విత చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు 6వేల మంది నిరుద్యోగుల‌కు శిక్ష‌ణ ఇచ్చామ‌ని, వారిలో 3వేల మంది మ‌హిళ‌లున్నార‌న్నారు. జాగృతి క‌మిటీల్లో 30 శాతం మంది మ‌హిళ‌లుండేలా ప్లీన‌రిలో నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, అమ‌లు చేస్తున్న‌ట్లు క‌విత వివ‌రించారు. ప‌లు రంగాల్లో ప్ర‌తిభావంతులు, స‌మాజానికి సేవ చేసిన వారు, మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలుస్తున్న మ‌హిళ‌ల‌ను స‌న్మానించారు క‌విత‌. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ జాగృతి మ‌హిళా విభాగం క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ చెన్న‌మ‌నేని ప్ర‌భావ‌తి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు మంచాల వ‌ర‌ల‌క్ష్మి, గ్రంథాల‌య సంస్థ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ ఎ. శ్రీధ‌ర్‌, స్థానిక కార్పోరేట‌ర్ ముఠాప‌ద్మ‌, తెలంగాణ జాగృతి జోన‌ల్ క‌న్వీన‌ర్లు ర‌జిత‌, ల‌త‌, శైల‌జ‌, సుచిత్ర‌, స‌విత పాల్గొన్నారు.


Connect with us

Latest Updates