Nizamabad MP

రైతుల‌కు అండ‌గా నిల‌వాలి

మార్కెట్ క‌మిటీల పాల‌క‌వ‌ర్గాల ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో ఎంపి క‌విత‌
రైతుల‌కు అండ‌గా నిల‌వాల‌ని నిజామాబాద్ ఎంపి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల కవిత పిలుపునిచ్చారు.
సోమ‌వారం క‌రీంన‌గ‌ర్ జిల్లా మెట్‌ప‌ల్లి, మ‌ల్లాపూర్, ఇబ్ర‌హీం ప‌ట్నం మార్కెట్ క‌మిటీల పాల‌క వ‌ర్గాల ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా మంత్రి హ‌రీశ్‌రావు, అతిథిగా నిజామాబాద్ ఎంపి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా క‌విత మాట్లాడుతూ మార్కెట్ క‌మిటీల కొత్త పాల‌క వ‌ర్గాలు బాధ్య‌త‌తో రైతుల‌కు సేవ‌లందించాల‌ని కోరారు. మార్కెట్‌కు వ‌చ్చే ప్ర‌తి పంట ఉత్ప‌త్తికి గిట్టుబాటు ధ‌ర వ‌చ్చే విధంగా చూడ‌డ‌మే కాకుండా మంచి ధ‌ర వ‌చ్చేంత వ‌ర‌కూ రైతు త‌మ స‌రుకుల‌ను నిల్వ చేసుకునే స‌దుపాయాల‌నూ క‌ల్పించాల‌న్నారు. ఏమ‌యినా స‌మ‌స్య‌లుంటే స్థానిక‌ ఎమ్మెల్యే విద్యాసాగ‌ర్ రావు దృష్టికి తీసుకురావాల‌ని సూచించారు. పాల‌క వ‌ర్గాల‌కు అండ‌గా మేముంటామ‌ని భ‌రోసా ఇచ్చారు ఎంపి క‌విత‌.
నిజామాబాద్ పార్ల‌మెంటు ప‌రిధిలోని ప‌సుపు, చెర‌కు రైతులు స‌మ‌స్య‌ల్లో ఉన్నార‌ని చెప్పారు. రేండేళ్లుగా ప‌సుపు మ‌ద్ధ‌తు ధ‌ర కోసం కేంద్రంతో కొట్లాడుతున్నామ‌ని క‌విత తెలిపారు. ప్ర‌త్యేక ప‌సుపు బోర్డు ఏర్పాటుకు మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్న‌ట్లు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే కొంద‌రు రైతుల‌ను డిల్లీకి తీసుకువ‌స్తే…ఈ పార్ల‌మెంటు సెష‌న్లోనే కేంద్రంను క‌లుద్దామ‌న్నారు.

Kalvakuntla Kavitha visit to Korutla Constituency (25-04-16) (3)

చెరుకు రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని ఎంపి క‌విత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చెర‌కు రైతుల‌ను ఆదుకునేందుకు ముఖ్య‌మంత్రి రెండు క‌మిటీల‌ను కూడా వేశార‌ని గుర్తు చేశారు. చెర‌కు ఫ్యాక్ట‌రీ ఆంద్రా యాజ‌మాన్యం అడ్డ‌గోలుగా డ‌బ్బులు అడుగుతోందని, వారడిగినన్ని కోట్ల రూపాయ‌ల‌ను ఇవ్వ‌లేమ‌న్నారు. చెర‌కు రైతుల‌ను కేసిఆర్ గారు ఆల‌స్యంగా అయినా మంచి నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని, ఆలోపు రైతులు ఓపిక ప‌ట్టాల‌ని కోరారు. రైతుల‌ను డైరెక్ట్ గా మేలు చేసిన ముఖ్య‌మంత్రి కేసిఆర్ ఒక్క‌రేన‌న్నారు. పోయిన సీజ‌న్లో ప్ర‌భుత్వ‌మే చ‌క్కెర‌ను కొనుగోలు చేసి…రైతుల‌కు డ‌బ్బులు ఇచ్చింద‌ని తెలిపారు. రైతుల‌ను కాపాడుకుందాం…ష్యాక్ట‌రీల ఉద్యోగుల‌ను కూడా కాపాడుకుందామ‌ని పిలుపునిచ్చారు ఎంపి క‌విత‌. మార్కెట్ క‌మిటీల ప్రమాణోత్స‌వానికి వ‌చ్చిన మంత్రి హ‌రీశ్ రావుకు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
అంద‌రికీ న్యాయం
పార్టీకి కార్య‌క‌ర్త‌లే ప‌ట్టుకొమ్మ‌ల‌ని, వారిని కాపాడుకుంటూ…పార్టీని కాపాడుకుందామ‌ని పిలుపునిచ్చారు నిజామాబాద్ ఎంపి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. కాస్త ముందూ…వెన‌కా గుర్తింపు ల‌భిస్తుంద‌ని, ప‌ద‌వులు ద‌క్క‌ని వారు నిరాశ‌ప‌డ‌కూడ‌ద‌న్నారు. మెట్ ప‌ల్లిలో మార్కెట్ క‌మిటీ ఛైర్మ‌న్ ప‌ద‌విని సురేశ్ కు ఇవ్వ‌డం ప‌ట్ల సిఎం కేసిఆర్ సంతో్షం వ్య‌క్తం చేశార‌ని తెలిపారు. ఆయ‌న‌తో పాటు నారాయ‌ణ రెడ్డి పేరునూ సిఎం మార్కెట్ క‌మిటీల‌పై జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్బంగా నాతో పాటు మంత్రి హ‌రీశ్ రావుతో చెప్పార‌ని తెలిపారు. ఇన్నాళ్లూ సురేశ్ ను ఎంపి సుమ‌న్ తండ్రి అనే వార‌ని, ఇప్పుడు సురేశ్ కొడుకు ఎంపి అని పిలుస్తార‌ని హ‌ర్ష‌ద్వానాల మ‌ధ్య అన్నారు. ఆడ‌వాళ్ల‌కు అవ‌కాశం ఇస్తే..ఎంత దూర‌మైనా పోత‌ర‌న్నారు. క‌రీంన‌గ‌ర్ తో మ‌హిళ‌ల‌కూ ప‌ద‌వుల పంప‌కం ప్రారంభం అయింద‌ని, త్వ‌ర‌లో తెలంగాణ అంత‌టా అవ‌కాశాలు వ‌స్తాయ‌ని తెలిపారు ఎంపి క‌విత‌. ఈ స‌మావేశంలో పెద్ద‌ప‌ల్లి ఎంపి బాల్క సుమ‌న్, ఎమ్మెల్యే విద్యాసాగ‌ర్ రావు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates