Nizamabad MP

రైతుల ఆలయాలు.. మార్కెట్ యార్డులు

-మార్కెట్ కమిటీ పాలకవర్గాల్లో రిజర్వేషన్ల అమలు ఘనత కేసీఆర్‌దే
-మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చింది మన రాష్ట్రంలోనే
-నిజామాబాద్ ఎంపీ కవిత

kalvakuntla-kavitha-visit-to-jagtial-constituency-23-09-16-11

ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు విక్రయించుకొనే మార్కెట్ యార్డులే రైతులకు దేవాలయాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల పట్టణంలో శుక్రవారం వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతోపాటు, మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ గతంలో మార్కెట్ కమిటీల పాలకవర్గాల్లో రిజర్వేషన్లు లేవని, ఉన్నతవర్గాలకు మాత్రమే పాలకవర్గంలో అవకాశాలు కల్పిస్తూ వచ్చారని అన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలతోపాటు, మహిళలకు మార్కెట్ కమిటీల్లో సముచితస్థానం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావించారన్నారు. దేశంలోనే మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం మనదన్నారు.

దేశంలో 29 రాష్ర్టాలు ఉండగా మైనారిటీ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ కోసం లాఠీదెబ్బలు తిని, రక్తం చిందించిన శీలం ప్రవీణ్‌ను గుర్తించి ఆయన భార్యకు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బాధ్యతలు సీఎం కేసీఆర్ అప్పగించారన్నారు. మార్కెట్ యార్డుల్లో సకల సదుపాయాల కోసం ఆరడుగుల బుల్లెట్‌లాంటి మంత్రి హరీశ్‌రావు అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆయన నేతృత్వంలో మార్కెట్‌యార్డులను ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు.


Connect with us

Latest Updates