Nizamabad MP

పుర్రె గుర్తు సైజ్ త‌గ్గిచేందుకు కృషి చేయండి

కేంద్ర మంత్రి ద‌త్తాత్రేయ‌ను కోరిన ఎంపి క‌విత‌
బీడి క‌ట్ట‌ల‌పై పుర్రె సైజ్ త‌గ్గించేందుకు కృషి చేయాల‌ని కేంద్ర కార్మిక శాఖ మంత్రిని కోరారు నిజామాబాద్ ఎం.పి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివారం హైద‌రాబాద్‌లోని దిల్‌కుషా గెస్ట్‌హౌజ్‌లో ద‌త్తాత్రేయ‌ను ఆమె క‌లిశారు. ఈ నెల 1వ తేదీ నుంచి బీడీ క‌ట్ట‌ల‌పై 85 శాతం పుర్రె బొమ్మ ఉండాలన్న నిబంధ‌న అమ‌లులోకి వ‌చ్చింద‌ని, దీన్ని నిలుప‌ద‌ల చేయించేలా కేంద్ర ప్ర‌భుత్వంపై ఓత్తిడి తీసుకురావాల‌ని క‌విత ద‌త్తాత్రేయ‌ను కోరారు. అలాగే 2014అక్టోబ‌ర్ 15న అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన 727(ఇ) జీఓనుంచి బీడి ప‌రిశ్ర‌మ‌కు వ‌ర్తింప‌చేయ‌కుండా చూడాల‌న్నారు. దేశ వ్యాప్తంగా 80 ల‌క్ష‌ల మంది బీడి ప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డి జీవిస్తున్నార‌ని, తెలంగాణ‌లో దాదాపు ఏడు ల‌క్ష‌ల మంది బీడి ప‌రిశ్ర‌మ‌లో ఉన్నార‌ని క‌విత వివ‌రించారు. బీడి ప‌రిశ్ర‌మ‌లో ఎక్కువ శాతం మ‌హిళ‌లు ప‌నిచేస్తున్నార‌ని, ఇంటివ‌ద్ద చిన్న పిల్ల‌ల‌ను వ‌దిలి వేరే ప‌నిచేయ‌లేక…..మ‌హిళ‌లు బీడీలు చుడుతూ జీవితాల‌ను నెట్టుకొస్తున్నార‌న్నార‌ని వివ‌రించారు.

Kalvakuntla-Kavitha-met-Union-Ministe-Bandaru-Dattatreya
మార్చి 15న స‌బార్డినేట్‌ లెజిస్లేష‌న్ క‌మిటీ పార్ల‌మెంటుకు త‌మ రిపోర్టును స‌మ‌ర్పించింద‌ని, సిగ‌రెట్‌, ఇత‌ర పొగాకు ఉత్ప‌త్తుల ప్యాకింగ్ మ‌రియు లేబులింగ్ స‌వ‌ర‌ణ రూల్స్ లో పేర్కొన్న ప‌లు అంశాల‌ను క‌విత ద‌త్రాత్రేయ దృష్టికి తీసుకువ‌చ్చారు.
1) క‌మిటీ స‌వ‌ర‌ణ రూల్స్‌ను య‌ధాత‌థంగా ఆమోదించిన ప‌క్షంలో బీడీ ప‌రిశ్ర‌మ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కం అవుతుంద‌ని బీడీ కార్మికులు, సంఘాలు క‌మిటీకి త‌మ అభిప్రాయాన్ని తెలిపారు. ఈ విష‌యం క‌మిటీ రిపోర్టులో 66వ పేజీలో ఉంది.
2) బీడీ క‌ట్ట‌పై 85 శాతం ఆరోగ్య‌ప‌ర‌మైన హెచ్చ‌రిక‌ను ముద్రించే పక్షంలో ఇత‌ర చ‌ట్టాల‌ను అతిక్ర‌మించిన‌ట్లు అవుతుంది. బీడిక‌ట్ట‌పై త‌యారీదారు పేరు, సంస్థ పేరు, అడ్ర‌స్ వంటి వివ‌రాల‌ను ముద్రించే స్థ‌లం స‌రిపోదు. ఇది కొత్త స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతుంది. (ఈ విష‌యం క‌మిటీ రిపోర్టులో 66వ పేజీలో ఉంది.)
3) నిబంధ‌న‌ల‌ను మార్చేట‌ప్పుడు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ బీడి ప‌రిశ్ర‌మ వాద‌నను విని ఉండాల్సింది. ఇప్పుడు ఉన్న‌ప‌ళంగా నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తే…బీడి ప‌రిశ్ర‌మ మూత‌ప‌డుతుంది. ఈ రంగంపై ఆధార‌ప‌డిన ల‌క్ష‌లాది కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతాయి…(ఈ విష‌యాన్ని క‌మిటీ రిపోర్టులోని 67వ పేజీలో పేర్కొన‌బ‌డి ఉంది.)
4) బీడి క‌ట్ట‌పై 85 శాతం పుర్రె బొమ్మ‌ను ముద్రించ‌డం ఆచ‌ర‌ణ సాధ్యం కాద‌ని, ఒక వేళ ముద్రిస్తే…ల‌క్ష‌లాది మంది కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున ప‌డ‌తాయ‌ని సాక్షాత్తూకేంద్ర కార్మిక మ‌రియు ఉపాధి క‌ల్ప‌నా శాఖ కార్య‌ద‌ర్శి క‌మిటీకి త‌న అభిప్రాయాన్ని చెప్పారు. (ఈ విష‌యం 67వ పేజీలో పేర్కొన‌బ‌డి ఉంది.)
బీడి క‌ట్ట‌పై 85 శాతం పుర్రె బొమ్మ‌ను ముద్రించ‌డం వ‌ల్ల కార్మికుల ఉపాధి కోల్పోతార‌ని, ఫ‌లితంగా ఉత్ప‌న్న‌మ‌య్యే సామాజి, ఆర్థికప‌ర‌మైన అంశాలు స‌మాజంపై చూపే ప్ర‌భావాన్ని కూడా ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని క‌మిటీ త‌న రిపోర్టులో 67వ పేజీలో స్ప‌ష్టం చేసింది. అని ద‌త్తాత్రేయ‌కు వివ‌రించారు క‌విత‌.
ఈ సంద‌ర్భంగా అంత‌ర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ ఓ) చెప్పిన విష‌యాన్ని కూడా క‌విత ఉటంకించారు. పొగాకు వినియోగం పెరుగుతోంది అన్న ప్ర‌క‌ట‌న బీడీ ప‌రిశ్ర‌మ‌పై ఓత్తిడి పెంచుతుంది. బీడి వినియోగాన్ని త‌గ్గించాల‌న్నా…ప‌రిశ్ర‌మ‌ను నిషేధించాల‌న్నా…ముందుగా ఆ రంగంపై ఆధార‌ప‌డి జీవిస్తున్న కార్మికుల జీవ‌నోపాధి గురించి ఆలోచించాలి. వారికి ప్ర‌త్యామ్నాయ ఉపాధి చూప‌డంలో విఫ‌ల‌మ‌యితే…అనేక సామాజిక స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తుంది. అలాగే కార్మికుల ప‌నిహ‌క్కును కాలరసినట్టు కూడా అవుతుంది..అని ఐఎల్ఓ హెచ్చ‌రించింద‌ని క‌విత తెలిపారు.
ప్ర‌ధానితో మాట్లాడ‌తా…ద‌త్తాత్రేయ‌
ల‌క్ష‌లాది మంది జీవ‌నోపాధికి సంబంధించిన పుర్రెగుర్తు సైజు త‌గ్గింపు విషయ‌మై ప్ర‌ధానితో మాట్లాడ‌తాన‌ని కేంద్ర కార్మిక మంత్రి బండారు ద‌త్తాత్రేయ హామీనిచ్చారు. అలాగే ఆరోగ్య‌మంత్రితో కూడా మాట్లాడ‌తాన‌ని, క‌విత‌ను కూడా త‌న వెంట తీసుకెళ్తాన‌ని ద‌త్తాత్రేయ మీడియాకు చెప్పారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ రాజేశ్వ‌ర్ రావు, టిఆర్ఎస్ కార్మిక విభాగం అధ్య‌క్షుడు రూప్‌సింగ్‌, తెల‌గాణ జాగృతి రైతు విభాగం క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ ఎ. శ్రీధ‌ర్‌లు పాల్గొన్నారు.

విష‌యం ఉంటే అసెంబ్లీలో భ‌ట్టి మాట్లాడేవారు – ఎంపి క‌విత‌
అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టుల‌పై ముఖ్య‌మంత్రి కేసిఆర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌పై టిపిసిసి నేత భ‌ట్టి విక్ర‌మార్క‌చేసిన విమ‌ర్శలో ప‌స లేద‌ని నిజామాబాద్ ఎంపి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. సిఎం ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ను దేశ‌మంతా బాగుంద‌ని, విజ‌న్ ఉన్న నాయ‌కుడ‌ని కేసిఆర్ ను అంటుంటే…భ‌ట్టి చేసిన విమ‌ర్శ‌ల‌ను ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నార‌న్నారు. ఆయ‌న మాట‌ల్లో నిజం ఉంటే అసెంబ్లీకి హాజ‌ర‌య్యే వారు…అసెంబ్లీకి డుమ్మాకొట్టి ప‌లాయ‌నం చిత్త‌గించారు. 60 ఏళ్ల అన్యాయాల‌ను సిఎం కేసిఆర్ గారు ఎండ‌గ‌డుతార‌నే అసెంబ్లీకి డుమ్మా కొట్టారు…అని ఎద్దేవా చేశారు. భ‌ట్టి విక్ర‌మార్క చెప్పే మాట‌ల్లో వాస్త‌వం ఉంటే రిటైర్డ్ ఇంజ‌నీర్ల ఫోరం స‌భ్యుల‌తో స్ట‌డీ చేసి…సిఎం దృష్టికి తీసుకెళ్తామ‌న్నారు. ప్ర‌జాస్వామ్యం అంటేనే క‌ల‌సి చ‌ర్చించి…నిర్ణ‌యాలు తీసుకోవ‌డం..పాల‌క‌, ప్ర‌తిప‌క్షాలు క‌లిసి చేసే నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తాయ‌ని వివ‌రించారు ఎంపి క‌విత‌. చర్చిందేకు అసెంబ్లీని మించిన వేదిక ఉండ‌ద‌న్నారు. సిఎం కేసిఆర్ గారు త‌న ప్ర‌జెంటేష‌న్‌కు ముందు అన్ని పార్టీల స‌భ్యుల‌నూ మాట్లాడాల‌ని, ప్ర‌తి అంశంపైనా చ‌ర్చించాల‌ని కోరిన విస‌యాన్ని సిఎంను విమ‌ర్శించేవారు గుర్తుకు చేసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.


Connect with us

Latest Updates