Nizamabad MP

ప్రతిపక్షాల విమర్శలే ఆశీర్వాదాలు..

- నిజామాబాద్ ఎంపీ కవిత
కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు… పనిచేసే వారినే విమర్శిస్తారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. పని చేయనివారిని ఎవరూ పట్టించుకోరని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు తమకు ఆశీర్వాదాలు అవుతాయని ఆమె స్పష్టం చేశారు. గత పాలకులు పట్టించుకోక పోవడంతోనే అశించిన అభివృద్ధి జరగలేదన్నారు.

Kalvakuntla-Kavitha

అందుకే పూర్తి నమ్మకం ఉన్న కేసీఆర్ సారథ్యంలోని టీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టారని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందిస్తోందని కొనియాడారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన ప్రజల ముంగిటికి రానుందని, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజల ముగింటికే చేరుతాయని తెలిపారు. సమస్యలు త్వరగా పరిష్కారానికి నోచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందన్నారు.

అధికారుల సంఖ్య పెరుగుతుందని, పనిభారం తగ్గుతుందని, ఫలితంగా పనులు పెండింగ్‌లో ఉండవని ఎంపీ కవిత వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమలు రాష్ట్రంలో అమలువుతున్నట్లు చెప్పారు. ఆర్మూర్ అభివృద్ధికి ఇంకా ఎంతో చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ యోగితా రాణా, జేసీ రవీందర్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates