Nizamabad MP

ప్రాణహిత- చేవెళ్ల డిజైన్ మార్పుతో ఏడాది పొడవునా నీటి సరఫరా

-నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టీకరణ
ఏడాది పొడవునా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో సాగు, తాగు నీరు అందించేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేస్తున్నామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సోమవారం నిజామాబాద్ ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వం కేవలం తాత్కాలిక బ్యాక్‌వాటర్‌పైనే ఆధారపడి డిజైన్ రూపొందించి ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద నిర్మించతలపెట్టిందన్నారు. కాళేశ్వరం వద్ద నిర్మిస్తేనే ప్రాజెక్ట్ ద్వారా వచ్చే నీటిని నిరంతరం సరాఫరా చేయగలమన్నారు. ప్రాజెక్టులు, వాటర్‌గ్రిడ్ పథకాల ద్వారా అందే ప్రయోజనాలను ప్రజలు రెండున్నర, మూడేండ్లలో చూడబోతారన్నారు.

Kalvakuntla Kavitha press meet001

తెలంగాణలో ప్రాజెక్టులపై ఆనాటి నీటి పారుదలశాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డికే అవగాహన లేదని విమర్శించారు. జిల్లాలో మూడు ప్యాకేజీలకు అనుమతి తెచ్చామని చెప్పిన సుదర్శన్‌రెడ్డి, సిరికొండకు ప్యాకేజీ ఇప్పటి వరకు ఎందుకు ప్రారంభం కాలేదో వివరించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఇప్పటివరకు 1973 నాటి మాస్టర్‌ప్లాన్ అమల్లో ఉందని, అందుకే నాలుగు నెలలుగా కృషి చేసి కొత్త మాస్టర్‌ప్లాన్ తయారు చేశామన్నారు. అర్హులుగా ఉండి పింఛన్ రాని బీడీ కార్మికులు ఇప్పటికైనా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, హన్మంత్ షిండే, వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి పాల్గొన్నారు.


Connect with us

Latest Updates