Nizamabad MP

పసుపు రైతులను ఆదుకోండి

-కేంద్ర వ్యవసాయ మంత్రికి ఎంపీ కవిత విజ్ఞప్తి
-తగిన మద్దతు ధర కల్పించండి
-పసుపు బోర్డును ఏర్పాటు చేయండి
-నిజామాబాద్ రైతు ప్రతినిధి బృందంతో మంత్రిని కలుసుకున్న కవిత

Kalvakuntla-Kavitha-met-Union-agriculture-Minister

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో నలుగురు ఎమ్మెల్యేలు, ఒక నియోజకవర్గ ఇన్‌చార్జితో పాటు 50 మందికిపైగా పసుపు రైతులు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు.

పసుపు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా పసుపు పంటకు మద్దతు ధరను పెంచడం, పసుపు పరిశోధనను వేగవంతం చేయడం, పసుపు సేద్యంపై ప్రత్యేక బోర్డును నెలకొల్పడం తదితర అంశాలను మంత్రికి వివరించారు. అన్ని అంశాలకు సానుకూలంగా స్పందించిన మంత్రి అక్కడికక్కడే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పసుపు మద్దతు ధర నిర్ణయంపై క్షేత్రస్థాయి పర్యటన కోసం ఒక బృందాన్ని పంపడానికి ఆదేశాలు జారీ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుపై గురువారం ఉదయం సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పసుపు రైతుల అభివృద్ధికి అన్ని విధాలా సాయపడతానని మంత్రి హామీ ఇచ్చారు.

ఎంపీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి (బాల్కొండ ఎమ్మెల్యే), నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జగిత్యాల టీఆర్‌ఎస్ ఇంచార్జి డాక్టర్ సంజయ్‌కుమార్‌తోపాటు వివిధ గ్రామాలకు చెందిన యాభై మందికిపైగా రైతులు వ్యవసాయ మంత్రితో భేటీ అయ్యారు.

అనంతరం పసుపు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మంత్రికి ఎంపీ కవిత వివరించారు. పసుపు పంటకు బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. పసుపు మద్దతుధర నిర్ణయం కోసం క్షేత్రస్థాయిలో పరిశీలనకు అధికారుల బృందాన్ని పంపనున్నట్టు మంత్రి రాధామోహన్‌సింగ్ తెలిపారు. పసుపు పంటకు బోర్డును ఏర్పాటు చేయడంపై స్పష్టమైన విధానాన్ని తీసుకుంటామని మీడియాకు వివరించారు. హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జగిత్యాలలో క్యాంపస్ ఉన్నదని, అక్కడ పసుపు విత్తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని హామీ ఇచ్చారు.


Connect with us

Latest Updates