Nizamabad MP

ప‌సుపు రైతుల‌కు అండ‌గా ఉంటాం

నిజామాబాద్ జిల్లాలో త్వ‌ర‌లో ప‌తంజ‌లి కార్య‌క‌లాపాలు
ప‌సుపుతో పాటు తెనె ప‌ట్టు, మొక్క‌జొన్న‌, ట‌మోట ప్రాసెసింగ్‌తో రైతుల‌కు ల‌బ్ది
త్వ‌ర‌లో దేశంలోనే తెలంగాణ అగ్ర‌గామి కాబోతోంది
ప‌తంజ‌లి ఆయుర్వేదిక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ బాల‌కృష్ణ‌

kalvakuntla-kavitha-and-acharya-balakrishna-visits-turmeric-fields-in-nizambad-district-16-11-16

ఆయుర్వేద‌,హెర్బ‌ల్‌, మెడిసిన‌ల్ ప్లాంట్ల సాగుకు తెలంగాణ అనుకూలంగా ఉంద‌న్నారు ప‌తంజ‌లి ఆయుర్వేదిక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌ ఆచార్య బాల‌కృష్ణ‌. ప‌సుపు సాగులో నిజామాబాద్ జిల్లా దేశంలోనే ప్ర‌థ‌మ స్థానంలో ఉంద‌న్న ఆయ‌న నిజామామాద్ జిల్లాలోని ప‌సుపు రైతుల‌కు మ‌ద్ధ‌తుగా నిలిచేందుకు ప‌తంజ‌లి త‌న కార్య‌క‌లాపాల‌ను త్వ‌ర‌లోనే ప్రారంభిస్తుంద‌ని చెప్పారు. సోమ‌వారం ఆయ‌న నిజామాబాద్ చేరుకుని ఎంపి క‌వితతో భేటీ అయ్యారు. నిజామాబాద్ అర్భ‌న్‌, రూర‌ల్ ఎమ్మెల్యేలు బిగాల గ‌ణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశ‌న్న‌గారి జీవ‌న్ రెడ్డి, ఎమ్మెల్సీ భూప‌తి రెడ్డిల‌తో క‌లిసి ప‌సుపు పంట గురించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎంపి క‌విత నిజామాబాద్‌లో ప‌సుపు బోర్డు ఏర్పాటు కోసం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో పాటు సంబంధిత ఇద్ద‌రు మంత్రుల‌ను క‌లిసి విన్న‌వించిన‌ట్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో న‌ల్ల రేగ‌డి, ఎర్ర‌నేల‌లు ప‌సుపు సాగుకు అనుకూలంగా ఉన్నాయ‌ని, రైతులు మొక్క‌జొన్న ప‌సుపు, సోయా పంట‌ల మార్పుతో అధిక దిగుబ‌డుల‌ను సాధిస్తున్నార‌ని బాల‌కృష్ణ‌కు వివ‌రించారు. తెలంగాణ ప్ర‌భుత్వం టిఎస్ ఐపాస్ ద్వారా ప‌క్షం రోజుల్లోనే ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తులు ఇస్తున్న‌ద‌ని, ఈ విధానం ప్ర‌పంచ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్త‌ల మ‌న్న‌న‌లు పొందింద‌న్నారు. ప్ర‌భుత్వ భూమి ల‌భ్య‌త కూడా బాగా ఉంద‌న్నారు.ఆర్మూర్‌లో 420 ఎక‌రాల భూమిలో ఫుడ్ ఫ్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాప‌న కూడా జ‌రిగింద‌ని బాల‌కృష్ణ‌కు గుర్తు చేశారు క‌విత‌. అలాగే బాల్కొండ‌లో 42 ఎక‌రాలు స్పైస్ పార్క్ ఏర్పాటుకు ప్ర‌భుత్వం 30 కోట్ల‌ను వ్య‌యం చేస్తున్న‌ద‌ని చెప్పారు.

క్షేత్ర‌స్థాయిలో అధ్యయ‌నం చేస్తున్నాం
నిజామాబాద్ జిల్లాలోని ప‌సుపు రైతుల‌కు అండ‌గా ప‌తంజ‌లి ఉంటుంద‌న్నారు ప‌తంజ‌లి ఆయుర్వేదిక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌ ఆచార్య బాల‌కృష్ణ‌. ఎంపి క‌విత‌, ఎమ్మెల్యేలు గ‌ణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, జీవ‌న్ భూప‌తి రెడ్డి, మేయ‌ర్ ఆకుల సుజాత, భార‌త్ స్వాభిమాన్ ప్రాంత అధ్య‌క్షుడు శ్రీధ‌ర్ రావు, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ డిప్యూటీ డైరెక్ట‌ర్ ఖ‌లీల్‌, ఇంఛార్జి క‌లెక్ట‌ర్ ర‌వీంద‌ర్ రెడ్డితో క‌లిసి బాల‌కృష్ణ మీడియాతో మాట్లాడారు.
బ‌హెన్ (సోద‌రి) క‌విత బాబారాందేవ్‌ను క‌లిసి ప‌సుపు రైతుల కోసం ప‌తంజ‌లి యూనిట్‌ను ఏర్పాటు చేయాల‌ని కోరార‌న్నారు. బాబా ఆదేశం మేర‌కు క్షేత్ర స్థాయి అధ్య‌య‌నం కోస‌మే తాను నిజామాబాద్ జిల్లాకు వ‌చ్చాన‌న్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్య‌మాన్ని తపస్సులా కొన‌సాగించి రాష్ట్రాన్ని సాధించుకున్నార‌న్నారు. ఉద్య‌మ‌నాయ‌కుడు కేసిఆర్ ముఖ్య‌మంత్రి అయ్యార‌న్నారు. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌ల కోసం ఉద్య‌మించి రాష్ట్రం సాధించుకున్నార‌ని, వారి ఆశ‌ల‌ను, ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డం అంత‌ ఈజీ కాద‌న్నారు.

ల‌క్కంప‌ల్లి సెజ్ ప‌నుల ప‌రిశీల‌న‌
ఆర్మూర్ నియోజ‌క వ‌ర్గంలోని నందిపేట్ మండ‌లం ల‌క్కంప‌ల్లి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ (ఎస్ ఇ జ‌డ్‌)ను సంద‌ర్శించారు బాల‌కృష్ణ‌. అక్క‌డ జ‌రుగుతున్న ప‌నుల‌ను అడిగి తెలుసుకున్నారు. అక్క‌డ రైతుల‌ను వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ త‌ర్వాత ప‌తంజ‌లి ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయ‌డానికి తాము సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించారు. అక్క‌డి నుంచి నేరుగా నూత్‌ప‌ల్లి గ్రామంలో సాగ‌తున్న ప‌సుపు పంట‌ల‌ను ప‌రిశీలించారు. రైతుల‌తో మాట్లాడారు. పంట దిగుబ‌డి, యాజ‌మాన్య ప‌ద్ధ‌తుల‌ను అడిగి తెలుసుకున్నారు. సాంప్ర‌దాయ‌కంగా పంట సాగు క‌న్నా…పారిశ్రామిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా తయారైతే లాభ‌సాటిగా ఉంటుంద‌న్నారు బాల‌కృష్జ‌. ప‌సుపు రైతుల కోసం తాను చేస్తున్న కృషిని రైతుల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేసిన ఎంపి క‌విత‌కు రైతులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. మీరు పార్ల‌మెంటు వేదిక‌గా మా గురించి మాట్లాడారు..అది చాల‌మ్మా… అంటూ ఆనందం వ్య‌క్తం చేశారు.

బాల్కొండ‌లో….
బాల్కొండ నియోజ‌కవ‌ర్గం వేల్పూర్‌లో స్పైస్ పార్క్ స్థ‌లాన్ని ప‌రిశీలించారు బాల‌కృష్ణ‌. మిష‌న్ భ‌గీరథ ఛైర్మ‌న్ వేముల ప్ర‌శాంత్ రెడ్డి పార్క్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను వివ‌రించారు. అనంత‌రం బాల‌కృష్ణ మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌తి నిమిషం ప్ర‌జ‌ల కోసం శ్ర‌మిస్తున్నార‌ని ప్ర‌శంసించారు. అలాగే యోగా గురు రాందేవ్ బాబా కూడా స‌మాజం అభ్యున్న‌తి కోసం క‌ష్ట‌ప‌డుతున్నార‌న్నారు. వీరుద్ధ‌రూ క‌లిస్తే…అద్భుతాలు జ‌రుగుతాయ‌న్నారు. త‌న‌కు భార్యాపిల్ల‌లు లేర‌ని, స‌మాజ‌మే నా కుటంబ‌మ‌న్నారు. అనంత‌రం ప‌సుపు వ్యాక్యూంలో క్లీన్ చేసే ప‌ద్ధ‌తిని ప‌రిశీలించారు.

శుద్ధి చేసిన ప‌సుపును పౌడ‌ర్ త‌యారు చేయ‌డం, ఆయుర్వేదిక్ ఔష‌ధంగా వాడ‌డం, హెర్బ‌ల్ ప్రోడ‌క్ట్‌, మ‌ల్టిప‌ర్ప‌స్‌గా ఎలా వాడాలి అనేదానిపై అధ్య‌య‌నం చేస్తున్నామ‌ని ప‌తంజ‌లి ఆయుర్వేదిక్ లిమిటెడ్ ఎండి ఆచార్య బాల‌కృష్ణ తెలిపారు. నిజామాబాద్ ప‌సుపు పంట‌కు అనుకూలంగా ఉన్న నేప‌థ్యంలో ర‌వాణా సౌక‌ర్యం కూడా అందుబాటులో ఉండ‌డం ఇక్క‌డ ప్లాంట్ నెల‌కొల్పడానికి ప్ల‌స్ అవుతుంద‌ని విశ్లేషించారు. ప‌సుపుతో పాటు తేనె త‌యారీని కూడ చేప‌ట్టేలా ప‌సుపు రైతుల‌ను ప్రోత్స‌హించ‌డం వ‌ల్ల ప‌సుపు రైతుల‌కు ప‌సుపు సాగు లాభ‌సాటిగా మార్చ‌వ‌చ్చ‌ని బాల‌కృష్ణ సూచించారు. అలాగే మొక్క‌జొన్న‌, ఫైనాపిల్‌, మోసాంబి లాంటి పంట‌ల‌తో పాటు ట‌మోటా వంటి కూర‌గాయల సాగును కూడా ప్రొత్స‌హించ‌డం వ‌ల్ల రైతుల‌కు మేలు చేయ‌వ‌చ్చ‌న్నారు. త‌న ప‌రీశీల‌న అభిప్రాయాల‌ను బాబా రాందేవ్‌తో కూడా పంచుకుని ఒక నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఎంపి క‌విత‌కు హామీనిచ్చారు బాల‌కృష్ణ ప‌లు మార్లు బ‌హెన్ క‌విత మీ ఎం.పి కావ‌డం మీ అదృష్ఠం అని ప‌సుపు రైతులతో అన్నారాయ‌న‌. ఆమెతో క‌లిసి ప‌నిచేస్తామ‌న్నారు.


Connect with us

Latest Updates