Nizamabad MP

పసుపు మద్దతు ధర కోసం కేంద్రంపై ఒత్తిడి

- వరంగల్‌కు పసుపు బోర్డు తెస్తాం
- మన పల్లె-మన ఎంపీలో ఎంపీ కవిత
పసుపు పంటకు మద్దతు ధర కోసం వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. మన పల్లె-మన ఎంపీ కార్యక్రమంలో భాగంగా రెండోరోజైన మంగళవారం కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని లక్ష్మీపూర్, సారంగాపూర్ మండలం పెంబట్లలో ప్రజలతో ఆమె సమావేశమయ్యారు.

Kalvakuntla Kavitha visit to jagtial constituencyఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పసుపును పండించకపోవడంతో మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం ఆలస్యం చేస్తున్నదన్నారు. పసుపు పంటకు మద్దతు ధర విషయమై ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసి విన్నవించానన్నారు. వరంగల్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. మద్దతు ధరపై ఇప్పటికే తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర సీఎంలతో చర్చిస్తున్నామన్నారు. ఆయా రాష్ర్టాల సీఎంలతో కలిసి కేంద్రాన్ని కలిసి మద్దతు ధర సాధిస్తామన్నారు. ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చి తీరుతామన్నారు. పసుపు పంటకు బిందు సేద్యంలో తొంభైశాతం సబ్సిడీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రైతులు కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటు విషయాన్ని ప్రస్తావిస్తున్నారని, ప్రభుత్వం తరుఫున ఏర్పాటు చేయడం ఇబ్బందికరంగా ఉందన్నారు. కార్యక్రమాల్లో చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్ పాల్గొన్నారు.


Connect with us

Latest Updates