Nizamabad MP

పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు ఇవ్వండి

పసుపు కనీస మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు కోరుతూ కేరళ ముఖ్యమంత్రి శ్రీ ఊమెన్ చాందిని కలిసిన నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు.
పసుపు రైతుల సంక్షేమం కోసం పసుపు బోర్డును జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని, పసుపు మద్దతు ధరను కేంద్రం నిర్ణయించేలా ప్రధానిపై ఒత్తిడి తేవాలని కేరళ ముఖ్యమంత్రిని శ్రీ ఊమెన్ చాందిని నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు కోరారు. ఇవ్వాల తిరువనంతపురంలోని సీయెం కార్యాలయంలో శ్రీ ఊమెన్ చాంధీని కలిసిన శ్రీమతి కల్వకుంట్ల కవితతో పాటు కలిసిన వారిలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్దన్, కోరుట్ల ఎమ్మెల్యే శ్రీ విద్యాసాగర్ రావు, బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, జగిత్యాల టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి డా. సంజయ్ కుమార్ లు ఉన్నారు.

Kalvakuntla-Kavitha-met-Kerala-CM-Oomen-Chandy
కేరళ ముఖ్యమంత్రి శ్రీ ఊమెన్ చాందీ గారికి సమర్పించిన లేఖలోని అంశాలు:
పసుపురైతులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడం వలన అనేక కష్టాలు పడుతున్నారు. ఈ పంటకు ప్రభుత్వ మద్దతు ధర కూడా లేకపోవడం వల్ల దళారీలు లాభపడుతున్నారు. దీనికి పసుపు బోర్డు మాత్రమె పరిష్కారం. పసుపు రైతుల సమస్యల పరిష్కారం కోసం, పసుపు బోర్డు ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవలసి ఉన్నది.
పసుపును ప్రధానంగా ఆహారంలో, మందుల్లో, సౌందర్య సాధనాల్లో, హెయిర్ డై, వస్త్ర పరిశ్రమలొ వాడుతున్నారు. విదేశాలకు అధికంగా ఎగుమతి అవుతున్న ఈ పంటకు మన దేశంలో కనీస మద్దతు ధర లేదు. పసుపు రైతులకు ఉన్న ఇతర సమస్యల సాధన కోసం కూడ జాతీయ స్థాయిలో బోర్డు అవసరం. పసుపు ప్రస్తుతం స్పైస్ బోర్డులో భాగంగా ఉంది. ఇది పసుపుతో పాటు దాదాపు ఇతర 54 పంటలను పర్యవేక్షిస్తుంది. అలా కాకుండా ఇప్పటికే ఉన్న పొగాకు, కాఫీ బోర్డుల వలేనే ఒక ప్రత్యేక బోర్డు పసుపు పంటకు ఉండడం అవసరం. దీనివల్ల రైతుల సమస్యల సాధన, ఎగుమతులకు వెసులుబాటు, కనీస మద్దతు ధర, విదేశాల నుండి సాంకేతిక సహకారం పొందడం వంటివి సాధ్యమవుతాయి. నూతన పరిశోధనలకు ప్రోత్సాహం ఉంటుంది. పసుపులో నూతన మేలు రకాల వంగడాల తయారీకి కూడా ఇది ఉపయోగపడుతుంది.
పసుపు బోర్డు ఏర్పాటు వల్ల ప్రయోజనాలు:
1) బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతుల కోసం బోర్డు అవసరం, ప్రపంచ స్థాయి డిమఆండ్ మేరకు ఇక్కడ ఉత్పత్తిని పెంచడానికి కూడా బోర్డు అవసరం.
2) ఎగుమతులను పెంచడం తద్వారా విదేశి మారక ద్రవ్య నిల్వల పెంపుకు కూడా ఇది సహకరిస్తుంది.
3) ఆయుర్వేదానికి ఆదరణ పెరుగుతున్నందున ఆయుర్వేదిక్ మందుల్లో వాడే పసుపు కు కూడా డిమాండ్ పెరుగుతుంది.
4) కేశాలకు రంగు వేయడానికి వాడే హెయిర్ డై ల్లో కూడా పసుపు విరివిగా వాడుతున్నారు. వస్త్ర పరిశ్రమలో వాడే రంగుల వినియోగాన్ని ప్రోత్సహించవచ్చు .
5) మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండించే వివిధ రకాల పసుపు ఉత్పత్తిని భౌగోళిక వారసత్వ పంటగా గుర్తించడానికి ప్రపంచ వాణిజ్య సంస్త (WTO) వద్ద ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. వారసత్వ పంట గా గుర్తింపు పొండడం తద్వారా అంతర్జాతీయ వ్యాపార ప్రయోజనాల్ని పొందడం.

మద్దతు ధర అవసరం:
పసుపుకు కనిస మద్దతు ధర కూడా అవసరం అది దక్కడం లేదు. పసుపు రైతులు బయట మార్కెట్లొ ఉన్న ధర కన్నా 3 నుండి 5 రెట్ల తక్కువ ధరకు అమ్ముతున్నరు. ఇది బాదాకరమైన విషయం. దాంతో పాటు ధరల హెచ్చు తగ్గులు రైతుల్ని తీవ్రంగా బాదిస్తున్నాయి. ప్రస్తుతం దేశం లో దాదాపు 25 పంటలకు మద్దతు ధర ఉన్నది. అదే విధంగా ముఖ్యమైన వాణిజ్యపంటగా ఉన్న పసుపు పంటకు కూడా మద్దతు ధరను కేంద్రం ప్రకటించవలసి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా National Agricultural Cooperative Marketing Federation of India Ltd (NAFED) ద్వారా రైతుల నుండి ప్రత్యక్షంగా పసుపును కొనుగోలు చేయాలి.

ఈ సందర్భంగా 2014-15 సం.లో కేరళ ప్రభుత్వం పసుపు రైతులకు హెక్టారుకు రూ.లు 12,500 లను ఆర్థిక సహాయంగా అందించడంతో కేరళలోని ఎర్నాకులం, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కొల్లాం జిల్లాల పసుపు రైతులకు మేలు జరిగిందని శ్రిమతి కవిత ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. బోర్డు ఏర్పాటు వల్ల కేరళకు చెందిన అల్లెప్పీ రకం పసుపు ఎగుమతులు పెరుగుతాయని శ్రీమతి కవిత గుర్తు చేసారు.
కేరళ సీయెం శ్రీ ఊమెన్ చాందీ స్పందిస్తూ పసుపు పంటకు మద్దతు ధరను సాధించడం వల్ల తమ రాష్ట్ర రైతులకు కూడా ప్రయోజనం ఉన్నందున అందుకు కేంద్రం పై సమిష్టిగా వత్తిడి తేవల్సిన అవసరం ఉందన్నారు. దాంతోపాటు పసుపు బోర్డు ఏర్పాటు కోరుతూ తమ రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రాన్ని కోరుతామని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమాల శాఖా మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ లను కూడా అనేకమార్లు కలిసిన శ్రీమతి కవిత పసుపు బోర్డు ఏర్పాటు మరియు పసుపు కనీస మద్దతు ధర కోరిన సంగతి తెలిసిందే. దేశంలో పసుపు పండించే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి కేంద్రం పై ఒత్తిడి పెంచే కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే మహరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారిని కూడా ఎమ్మెల్యేలతో సహా కలిసి కోరడం జరిగింది. అదే సమయంలో పసుపు పండించే రాష్ట్రాల ఎంపీలతో కలిసి పసుపు బోర్డు కోసం, పసుపు కనీస మద్దతు ధర కోసం పార్లమెంటు వేదికగా కేంద్రం పై ఒత్తిడి తేవడం జరుగుతూ ఉంది.


Connect with us

Latest Updates