Nizamabad MP

వ‌రంగ‌ల్‌లో పాస్ పోర్టు సేవా కేంద్రం

ఎంపి క‌విత విజ్ఞ‌ప్తి మేర‌కు కేంద్రం మంజూరు

వ‌రంగ‌ల్ లో పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖ‌త వ్య‌క్తం చేసింది. నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత విజ్ఙ‌ప్తి మేర‌కు విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి సుష్మాస్వ‌రాజ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ఎంపి క‌విత‌కు లేఖ రాశారు సుష్మ‌.వ‌రంగ‌ల్‌లో పాస్ పార్టు సేవా కేంద్రం అవ‌స‌రాన్ని తెలియ‌జేస్తూ క‌విత ఇటీవ‌ల సుష్మాస్వారాజ్ కు లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా క‌విత సుష్మకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌ధాన పోస్టాఫీసు లో ఈ సేవా కేంద్రం ప‌నిచేయ‌నుంది. ఎంపి లేఖ వ‌ల్ల ఇతర‌ రాష్ట్రాల‌లో కూడా త‌పాల శాఖ‌తో క‌లిసి పాస్‌పోర్టు సేవా కేంద్రాల‌ను కేంద్రం ఏర్పాటు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంది. పోస్టాఫీసు పాస్ పోర్టు కే్ంద్రాలుగా వీటిని పిలుస్తారు.


Connect with us

Latest Updates