Nizamabad MP

నిజాం షుగర్స్‌ను రైతులు నడిపితే ఓకే

-కోఆపరేటివ్ పద్ధతిలో నిర్వహిస్తామంటే అండగా ఉంటాం
-జేఏసీ నేతలు రైతులను మభ్యపెట్టాలని చూడొద్దు
-ఎంపీ కల్వకుంట్ల కవిత

Kalvakuntla-Kavitha-press-meet

నిజాం షుగర్స్ ఫ్యాక్టరీకి త్వరలోనే పూర్వవైభవం వస్తుందని, రైతులందరూ కలిసి కో ఆపరేటివ్ పద్ధతిలో నడుపుకుంటామంటే తామంతా అండగా ఉంటామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నిజాం షుగర్స్ పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు. గురువారం తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో దీనిని భ్రష్టుపట్టించారని, నష్టాలు చూపించి నాశనం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటినుంచి నేటివరకు రూ.66కోట్లు వెచ్చించామని, నిజామాబాద్‌లో జేఏసీ నేతలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై మీటింగ్ పెట్టి తమను పిలువకుండా, విమర్శలు చేసే వారిని పిలువడం.. రైతులను మభ్యపెట్టాలని చూడటం మంచిది కాదన్నారు. నిజాం షుగర్స్‌ను 1937, ఏప్రిల్ 17న ప్రారంభించారు. 98శాతం నిజాం ప్రభుత్వ పరిధిలో ఉంటే, 2 శాతం మాత్రమే ప్రైవేటు వారి చేతిలో ఉండే ది. చెరుకు తోటల్లోకి రైలు పట్టాలు వేసుకున్న నిజాం షుగర్స్ ఎంతో వైభవంగా వెలిగిపోయింది. దీనిని తెలంగాణ జాతి వారసత్వ సంపదగా చూస్తాం.

2002లో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు దీనిని డెల్టా పేపర్స్‌తో జాయింట్ వెంచర్‌గా మార్చి ప్రైవేటుపరం చేశారు. 51శాతం ప్రైవేటుదైతే, 49శాతం ప్రభుత్వషేర్‌గా ఉంచారు. 2003లో రూ.1.73లక్షల లాస్ చూపించారు. 2004-05లో రూ.12కోట్లలాభం, 2007-08లో నాలుగు కోట్ల లాభం, 2008-09లో 37కోట్ల నష్టం చూపారు. లాభాలొచ్చినా ఉద్యోగులకు వేతనాలు పెంచలేదు. రైతులకు బకాయిలు సరైన సమయానికి ఇవ్వలేదు. 2006లో అసెంబ్లీలో ఉద్యమిస్తే హౌజ్‌కమిటీ వేశారు. 2012వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడిన తర్వాత డిసెంబర్‌లో క్రషింగ్ ప్రారంభం అయింది. రైతులకు టన్నుకు రూ.340 ఇస్తామని ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే సీఎం చెప్పారు. ఆ మేరకు రూ.11.26 కోట్లు చెల్లించారు. చక్కర అమ్మితే వచ్చిన డబ్బుల్లోనుంచి రూ.27కోట్లు రైతులకు ఇప్పించాం. మరో రూ.27కోట్లు ప్రభుత్వం ఇచ్చింది అని వెల్లడించారు.

మహారాష్ట్ర పర్యటనకు రైతుల బృందం:
నిజాం షుగర్స్ పరిధిలోని రైతుల బృందం 2015 జనవరిలో సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడే.. ఆయన స్పష్టమైన ప్రతిపాదన చేశారని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వమేఫ్యాక్టరీ నడిపితే మళ్లీ పాతకథే అవుతుంది… ఫ్యాక్టరీని మీరే నడుపుకుంటారా…? అని అడిగారని గుర్తు చేశారు. మహారాష్ట్రలో రైతులే షుగర్‌ఫ్యాక్టరీని నడుపుతున్నారు అక్కడికి వెళ్లి పరిశీలించాలని చెప్పారని, 2015 ఫిబ్రవరి 15న మూడు బస్సుల్లో మంత్రి పోచారం ఆధ్వర్యం లో రైతులు మహారాష్ట్రకు వెళ్లారని, ఇంతలోనే నిజాం షుగర్స్ ఉద్యోగులను సంస్థ తొలగించిందని చెప్పారు.


Connect with us

Latest Updates