Nizamabad MP

నిరంత‌ర విద్యుత్ స‌ర‌ప‌రాలో కార్మికుల కృషి ఎన‌లేనిది -ఎంపి క‌విత‌

టిఆర్‌వికెఎస్ డైరీ, క్యాలెండ‌ర్ ఆవిష్క‌రించిన క‌విత

నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌డంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మికుల కృషి ఎంతో ఉంద‌న్నారు నిజామాబాద్ ఎంపి, టిఆర్‌వికెఎస్ రాష్ట్ర గౌర‌వాధ్య‌క్షురాలు శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత‌ గారు. సోమ‌వారం హైద‌రాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం డైరీ, కేలండ‌ర్‌ను ఆమె రిలీజ్ చేశారు. అనంత‌రం కార్మికుల‌ను ఉద్దేశించి క‌విత మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో అలుపెర‌గ‌ని పోరాటం చేశార‌న్నారు. బంగారు తెలంగాణ సాధ‌న కోసం అదే స్పూర్తితో ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు.

Kalvakuntla kavithaవిద్యుత్ కార్మికుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డితో తాను కార్మికుల స‌మ‌స్య‌ల గురించి మాట్లాడాన‌న్నారు. రెప్ప‌పాటు కూడా క‌రెంటు పోనివ్వ‌ని ప‌రిస్తితి ఇప్పుడు తెలంగాణలో ఉంద‌ని, ఇదంతా సిఎం కేసిఆర్ గారి విజ‌న్ అన్నారు. ఆయ‌న క‌ల‌ను సాకారం చేస్తున్నందుకు యావ‌త్ తెలంగాణ స‌మాజం మీవెంటే ఉంటుంద‌న్నారు. ఈకార్య‌క్ర‌మంలో టిఆర్‌వికెఎస్ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోడూరి ప్ర‌కాశ్ తో పాటు సంఘం అధ్య‌క్షుడు కె. స‌త్య‌నారాయ‌ణ రావు, అద‌న‌పు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.వి జాన్స‌న్‌, ఎన్‌.పి.డి.సిఎల్ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు జి. ఉదయ‌భాస్క‌ర్‌, డి. ప్ర‌భాక‌ర్‌, ఎస్‌పిడిసిఎల్ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు భాస్క‌ర్‌, శ్రీనివాస్‌, టిఎస్ జెన్‌కో బాధ్యులు డోలి శ్రీనివాస్‌, మునీంద‌ర్‌, మారుతి, ప్ర‌కాశ్, విలాసై్‌, భూమ‌న్న‌, క‌రెంటురావు, విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి, శివాజీ, సుద‌ర్శ‌న్‌, రాజేంద‌ర్‌, కెటిపిపి బాధ్యులు కుమార‌స్వామి, కిర‌ణ్‌, ర‌ఘు, పాల్వంచ బాధ్యులు సార‌య్య‌, వెంక‌ట‌య్య‌, నారాయ‌ణ‌, స‌హ‌దేవ్‌, శ్రీను, యూసుఫ్‌, ర‌మేశ్‌, శంక‌ర్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు


Connect with us

Latest Updates