Nizamabad MP

న‌వీన గ్రామీణ‌ భార‌తావ‌నిని ఆవిష్క‌రిద్దాం

స్థానిక సంస్థ‌ల ప్రజా ప్ర‌తినిధుల‌కు ఎంపి కవిత పిలుపు

ముఖ్య‌మంత్రి కేసిఆర్ క‌ల‌లు గ‌న్న బంగారు తెలంగాణ సాధించి న‌వీన గ్రామీణ భార‌తావ‌నిని ఆవిష్క‌రిద్దామ‌ని నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల‌కు పిలుపునిచ్చారు. శ‌నివారం నిజామాబాద్‌లో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో స‌ర్చంచ్‌లు, ఎంపిటీసీలు, జ‌డ్పీటీసీలు, ఎంపిపిల‌కు ప్ర‌భుత్వ కార్య‌క్రమాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే కార్య‌క్ర‌మం జ‌రిగింది. జిల్లా క‌లెక్ట‌ర్ యోగితా రాణా అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఎంపి క‌విత ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. సిసి రోడ్లు లేని గ్రామం ఉండొద్ద‌న్న లక్ష్యంతో తాను ప‌నిచేస్తున్నాన‌ని, దానికి మీ చేయూత‌ కావాల‌న్నారు క‌విత‌. క‌లెక్ట‌ర్ యోగితారాణా జిల్లా స‌మ‌గ్రాభివృద్ధికి ప్ర‌ణాళిక‌ను రూపొందించార‌ని ప్ర‌శంసించారు. ప్ర‌భుత్వం నుంచి అధిక నిధులు తెచ్చుకునేందుకు తాము ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు చెప్పారు.

Kalvakuntla-Kavitha takes part in Awareness program to Local body representatives

గ‌తేడాది ఎన్ఆర్జిఎస్ కింద మ‌న జిల్లా నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింద‌న్నారు. ఈ సారి కూడా ఆ స్థాయిలో ప‌నులు చేయాల‌ని కోరారు. ఈ స్కీం కింద జిల్లాకు రూ. 150 కోట్లు వచ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. స‌ర్పంచ్‌లు, ఎంపిటీసీలు ప‌ట్టుప‌డితే 150 కాదు 200 కోట్లు తీసుకొచ్చుకుందాం. మే లోపు సిసి రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. లేబ‌ర్ కాంపోనెంట్‌తో పాటు మెటీరియ‌ల్ కాంపొనెంట్స్ పెంచాల‌న్నారు.
గ్రామాల్లో స‌ర్పంచ్‌లు, ఎంపిటీసీలు, జ‌డ్పీటీసీల‌కు ఏం ప‌నులు చేస్తున్నారో స‌రిగా తెలియ‌ని ప‌రిస్థితి ఉంద‌న్నారు. ఎన్ఆర్‌జిఎస్ కింద 70 ప‌నులు చేసుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. మీ ప్ర‌పోజ‌ల్స్‌ను పంపండి. అవ‌స‌ర‌మైన చోట ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను ఉప‌యోగించుకోండి. వారు స‌హ‌క‌రించ‌కపోతే అధికారుల‌కు ఫిర్యాదు చేయాల‌ని సూచించారు. వ‌చ్చే రెండేళ్ల త‌ర‌వాత ప్ర‌జ‌ల్లోకి వెళ్తాల్సింది స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు త‌ప్ప ఫీల్డ్ అసిస్టెంట్లు కార‌న్నారు. ప్ర‌తి స‌ర్పంచ్ కింద 27 మంది ప్ర‌భుత్వ ఉద్యోగులున్నార‌ని, వారిచేత ప‌ని చేయించుకోవాల‌ని ఉద్భోధించారు. బాధ్య‌త‌ను ప్ర‌జాప్ర‌తినిధులుగా భుజానికెత్తుకోవాల‌న్నారు. గ‌త ఏడాది 39 కోట్లు ఎన్ ఆర్ జిఎస్ కింద‌ వ‌చ్చాయ‌ని, ఈ సారి ఎక్కువ నిధులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. శాస‌న స‌భ్యుల‌తో సమన్వయం చేసుకోవాల‌ని ఎంపి క‌విత సూచించారు. మిష‌న్ కాక‌తీయ ప‌థ‌కం కింద ఇంకా ప్రారంభం కాని ప‌నుల‌ను త్వ‌రగా చేప‌ట్టేలా ఇరిగేష‌న్ అధికారుల‌కు లేఖ‌లు రాయాల‌ని కోరారు. మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల‌పైనా దృష్టిసారించాల‌ని కోరారు.

రుణ‌మాఫీ, పంట‌ల భీమా ప‌రిహారం స‌రిగా అంద‌డం లేద‌ని ప‌లువురు త‌న దృష్టికి తీసుకువ‌చ్చార‌ని క‌విత తెలిపారు. ఈ విష‌యంపై స‌ర్పంచ్‌లు దృష్టిసారించాల‌ని సూచించారు. వ్య‌వ‌సాయ అధికారులు ఆశించిన స్థాయిలో ప‌నిచేయ‌డం లేద‌ని..క‌లెక్ట‌ర్ ఈ విష‌యాన్ని ప‌రిశీలించాల‌న్నారు 95 మంది ఎఈఓల‌నుప్ర‌భుత్వం జిల్లాకు నియ‌మించింద‌ని, వారి చేత అసైన్డ్ లాండ్స్ సాగులోకి వ‌చ్చేలా చూడాల్సిన బాధ్య త స‌ర్పంచ్‌ల‌దేన‌ని క‌విత స్పష్టం చేశారు. మ‌రో వైపు స‌ర్పంచ్ ప‌రిధిలో ప‌నిచేసే 27 మంది సిబ్బంది చేత ప‌నిచేయించుకోవాల‌న్నారు. మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ ప‌నుల‌తో పాటు సిసి రోడ్ల నిర్మాణం మే క‌ల్లా పూర్త‌య్యేలా చూడాల‌ని స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు ఈ విష‌యంలో చొర‌వ చూపాల‌ని కోరారు ఎంపి క‌విత‌. ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ ర‌వీంద‌ర్ రెడ్డి, మేయ‌ర్ సుజాత జ‌డ్పీ వైస్ ఛైర్మ‌న్ సుమ‌నారెడ్డి, డిసిసిబి ఛైర్మ‌న్ గంగాధ‌ర్ రావు ప‌ట్వారీ పాల్గొన్నారు.


Connect with us

Latest Updates