Nizamabad MP

అసెంబ్లీలో చీర‌లు కొన్న ఎంపి క‌విత‌

అసెంబ్లీలో లాబీ హాల్‌లో ఏర్పాటు చేసిన చేనేత వ‌స్త్రాల స్టాల్‌ను సంద‌ర్శించారు నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

mp-kalvakuntla-kavitha-purchased-handloom-sarees-in-telangana-assembly

డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మాదేవెంద‌ర్ రెడ్డికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపేందుకు అసెంబ్లీకి వెళ్లిన ఆమె డిప్యూటీ స్పీక‌ర్‌, క‌రీంన‌గ‌ర్ జ‌డ్పీ ఛైర్మ‌న్ తుల ఉమ‌, ఎమ్మెల్యేలు బొడిగె శోభ‌, గీతారెడ్డి, డి.కె అరుణ‌, మాజీ ఎమ్మెల్యే స‌త్య‌వ‌తి రాథోడ్‌ల‌ను స్టాల్‌కు తీసుకువెళ్లారు. మ‌దిని దోచే రంగుల్లో గ‌ద్వాల‌, పోచంప‌ల్లి చీర‌ల‌ను సూచి వారంతా త‌న్మ‌యుల‌య్యారు. ప‌ద్మాదేవెంద‌ర్ రెడ్డికి ఇష్ట‌మైన చిల‌క‌ప‌చ్చ రంగు చీర‌ను ఎంపి క‌విత జ‌న్మ‌దిన కానుక‌గా చీర‌ను బ‌హూక‌రించారు. అలాగే బొడిగే శోభ‌, స‌త్య‌వ‌తి రాథోడ్‌, తులా ఉమ‌ల‌కూ చీర‌ల‌ను కొనిచ్చారు. త‌న‌తో పాటూ త‌న మాతృమూర్తి శోభ‌మ్మ‌కూ చీర‌ల‌ను కొనుగోలు చేశారు ఎంపి క‌విత‌. ఎంపి క‌విత అసెంబ్లీకి వ‌చ్చిన విష‌యం తెలిసి ప‌లువురు ఎమ్మెల్యేలు క‌విత‌ను క‌ల‌సి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. అలాగే జ‌ర్న‌లిస్టుల‌కూ క‌విత నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. చీర‌లు కొనుగోలు త‌ర్వాత డెబిట్ కార్డును పిఓఎస్ మిష‌న్ ద్వారా స్వైపింగ్ చేసి డ‌బ్బు చెల్లించారు.


Connect with us

Latest Updates