Nizamabad MP

విలేజ్ పోలీస్ డైరీ ఆవిష్క‌రించిన ఎంపి క‌విత‌

జ‌గిత్యాల పోలీసులు రూపొందించిన విలేజ్ పోలీస్ డైరీని ఆవిష్క‌రించారు నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసులంటే మ‌న మిత్రులేనన్న భావ‌న క‌ల‌గాల‌ని కోరుకున్న‌ సిఎం కేసిఆర్ క‌ల‌ల‌ను సాకారం చేస్తున్న జ‌గిత్యాల పోలీసుల‌ను అభినందనీయులన్నారు.

mp-kalvakuntla-kavitha-launched-village-level-police-diary

తెలంగాణ‌లో పోలీసులంటేనే ఒక భ‌యం ఉంటుందని, ఉద్య‌మ‌కాలంలోనూ పోలీసుల‌తోనే క్లాష్ ప‌డిన సంద‌ర్భాలున్నాయ‌న్నారు. .. పోలీసులంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితి నుంచి ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట‌ప‌డేయ‌డం అనుకున్నంత‌ ఈజీ కాద‌న్నారు. జగిత్యాల పోలీసులు విలేజ్ డైరీని తీసుకురావ‌డం మంచి ప‌రిణామామం అన్నారు. అయితే ఈ డేటా కంప్యూట‌రైజ్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పోలీసులంటే ఉండే భ‌యాన్ని పాజిటివ్ ఫోర్స్‌గా ఉప‌యోగించుకుని ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యేందుకు పోలీసులు కృషి చేయాల‌ని సూచించారు ఎంపి క‌విత‌.. రెవిన్యూ, పోలీసు శాఖ‌లు స‌మ‌ష్టిగా పనిచేస్తేనే ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయ‌న్నారు ఈ కార్య‌క్ర‌మంలో జ‌డ్పీ ఛైర్ ప‌ర్స‌న్ తులా ఉమ‌, టిఆర్ ఎస్ నియోజ‌క వ‌ర్గ ఇంఛార్జి డాక్ట‌ర్ సంజ‌య్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates