జగిత్యాల మండలం పొలాసలో రూ 11 కోట్లతో వ్యవసాయ క్షేత్ర కళాశాల భవన నిర్మాణానికి ఎంపీ కవిత శంకుస్దాపన చేశారు. కళాశాల ఆవరణంలో 7 కోట్ల బడ్జెట్ తో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి కృషి చేస్తామని ఆమె అన్నారు. వ్యవసాయ పరిశోధన కేంద్రం సమీప గ్రామాలలో రైతులకు విత్తనాలు, ఎరువులు,పురుగుల మందుల ఎంపికకు సహకారం అందిస్తామని తెలపారు.
వ్యవసాయ డిప్లమా విద్యార్దులకు అగ్రికల్చర్ బీఎస్సీలో 15 నుంచి 25 శాతానికి సీట్లు పెంచేందుకు రిజిస్ట్రార్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. జగిత్యాలలో మామిడి సాగు అధికంగా ఉన్నందున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఈ సందర్బంగా చెప్పారు. పొలాసలో పవులేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముస్లిం సోదరులకు జగిత్యాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కవిత ముఖ్య ఆతథిగా హాజరయ్యారు.