Nizamabad MP

డ‌యాల‌సిస్ సెంట‌ర్‌ను ప్రారంభించిన ఎంపి క‌విత‌

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలోని గురుద్వారా మెడిక‌ల్ సెంట‌ర్‌లో డ‌యాలిసిస్ సెంట‌ర్‌ను నిజామాబాద్ ఎంపి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత ప్రారంభించారు. సికింద్రాబాద్ గురుద్వారా ప్ర‌బంధ‌క్ క‌మిటీ, హైద‌రాబాద్ ద‌క్క‌న్ రోట‌రీ క్ల‌బ్‌, భ‌గ‌వాన్ మ‌హావీర్ ఛారిటీ ట్ర‌స్ట్ లు సంయుక్తంగా ఈ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశాయి. 12 ప‌డ‌క‌లు క‌లిగిన ఈ డ‌యాలిసిస్ సెంట‌ర్‌లో నెల‌కు 1000 మందికి పైగా కిడ్నీ పేషంట్‌లు డ‌యాలిసిస్ చేసుకునే స‌దుపాయం ఉంది.

resized_DSC_1771

ఈ సందర్భంగా ఎంపి క‌విత మాట్లాడుతూ మాన‌వ సేవ‌యే మాధ‌వ సేవ అన్నారు. డ‌యాలిసిస్ సెంట‌ర్‌కు గురుద్వారా ప్లేస్‌ను కేటాయించింద‌ని, రోట‌రీ క్ల‌బ్ డ‌యాలిసిస్ ప‌రిక‌రాల‌ను స‌మ‌కూర్చార‌ని, రోజువారీ డ‌యాలిసిస్ ప్ర‌క్రియ‌ను మ‌హావీర్ ట్ర‌స్టు చేయ‌నుంది ఎంపి క‌విత తెలిపారు. ఈ సంద‌ర్భంగా మూడు ఛారిటీ సంస్థ‌ల‌ను ఆమె అభినందించారు. ఆరోగ్య తెలంగాణ కోసం ప్ర‌భుత్వం ముందుకు సాగుతున్న‌ద‌ని, ప్ర‌భుత్వేత‌ర సంస్థ‌లు కూడా ఇందులో భాగ‌స్వాములువుతుండ‌టం మంచి ప‌రిణామమ‌న్నారు. అంత‌కు ముందు గురుద్వారాలో క‌విత ప్రార్థ‌న‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయ‌న్న‌, కార్పొరేట‌ర్ లాస్య నందిని, వైద్య ఆరోగ్య -కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ రాజేశ్వ‌ర్ తివారీ, గజ్జెల న‌గేశ్‌, రోట‌రీ క్ల‌బ్ అధ్య‌క్షులు సునీల్ కుమార్ జైన్‌, కార్య‌ద‌ర్శి గుమిడిల్లి శైలేశ్‌, భ‌ర‌త్ మలాని, బ్రిజ్‌మోహ‌న్ సోని, మ‌హావీర్ ట్ర‌స్టు బాధ్యులు ప్ర‌శాంత్ సీమ‌ల్‌, ఇంద‌ర్ చోర్డియా, గురుద్వారా ప్ర‌బంధ‌క్ క‌మిటీ బాధ్యులు స‌ర్దార్ బ‌ల్దేవ్ సింగ్, అవ‌తార్ సింగ్‌, జ‌స్వింద‌ర్ సింగ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates