Nizamabad MP

ద‌ళితుల‌కు భూమి పంపిణీ చేసిన ఎంపి క‌విత‌

క‌రీంన‌గ‌ర్ జిల్లా సారంగాపూర్‌లో ద‌ళితుల‌కు భూమి ప‌ట్టాలు అందజేశారు నిజామాబాద్ ఎంపి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శ‌నివారం క‌రీంన‌గ‌ర్ జిల్లా సారంగాపూర్ లోని క‌స్తూరిబా గాంధీ బాలిక‌ల గురుకుల విద్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో తాళ్ల ధ‌ర్మారం, క‌మ్మనూరు గ్రామాల‌కు చెందిన 37 మంది ద‌ళితుల‌కు 68 ఎక‌రాల 8 గుంట‌ల భూమి ప‌ట్టాల‌ను మ‌హిళా ల‌బ్దిదారుల‌కు అంద‌జేశారు.

Kalvakutla-Kavitha-distributed-land-pattas-to-Dalits

ప‌ట్టా కాగితాల‌ను తీసుకుంటున్న సమ‌యంలో మ‌హిళ‌ల క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగాయి.కాంగ్రెస్ ప్రభుత్వం భూమినిస్తామ‌ని చెప్పి ఇవ్వలేద‌ని, అడ‌గ‌కుండానే సిఎం కేసిఆర్ ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమిని ఇస్తామ‌ని, ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నార‌న్నారు. మాకిప్పుడు ఆనందంగా ఉంద‌న్నారు. గుంటెడు భూమిలేని మాకు ఇప్పుడు భూమి ఉంద‌ని గ‌ర్వ‌ప‌డుతున్నామ‌న్నారు. ఈ సందర్భంగా ఎంపి క‌విత మాట్లాడుతూ అంద‌రిలాగే ద‌ళితులు బాగుండాల‌నేదే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం అన్నారు. రాళ్లు, ర‌ప్ప‌లుండే ప‌నికి రాని భూముల‌ను గ‌త ప్ర‌భుత్వాలు ఇచ్చాయ‌ని ప‌లు చోట్ల ద‌ళితులు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వ‌చ్చార‌ని తెలిపారు. సాగుకు యోగ్యంగా లేని భూముల‌ను ఇవ్వ‌వ‌ద్ద‌ని సిఎం కేసిఆర్ గారు అధికారుల‌కు ఆదేశించార‌ని, ప్రైవేటు వ్య‌క్తుల నుండి భూమిని కొనుగోలు చేసి మ‌రీ భూమిని ద‌ళితుల‌కు ఇస్తున్నామ‌ని క‌విత వివ‌రించారు.భూమిని ఇచ్చి చేతులు దులుపుకోకుండా ఇత‌ర స‌దుపాయాలు కూడా క‌ల్పిస్తున్నామ‌ని, ఇందు కోసం ఒక్కో ల‌బ్దిదారుకు 16వేల రూపాయ‌ల‌ను ఇస్తున్నామ‌న్నారు. వీటితో విత్త‌నాలు, ఎరువులు, పురుగు మందులు, వాటిని పిచికారీ చేసే ప‌రిక‌రాలను ప్ర‌భుత్వం స‌మూర్చుతున్న‌ద‌ని క‌విత వివ‌రించారు.
ఒక్క క‌రీంన‌గ‌ర్ జిల్లాలోనే ఇప్ప‌టి వ‌ర‌కు 35 ల‌క్ష‌ల‌ను ఖర్చు చేశార‌ని క‌విత తెలిపారు.ద‌ళితుల మొహంలో చిరున‌వ్వు చూడాల‌న్న‌దే మా ఆకాంక్ష అన్నారు. స్థానిక జ‌డ్పీటీసి భూక్య స‌ర‌ళ గిరిజ‌నుల‌కూ ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప చేయాల‌ని కోరారు. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ‌తాన్నారు క‌విత‌. అనంత‌రం ల‌బ్దిదారులైన మ‌హిళ‌లతో క‌లిసి స‌హ‌పంక్తి భోజ‌నం చేశారు, ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ నీతూకుమారి ప్ర‌సాద్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ శ‌శాంక‌, టిఆర్ఎస్ జ‌గిత్యాల నియోజ‌క వ‌ర్గం ఇంఛార్జి డాక్ట‌ర్ సంజ‌య్‌, ఎంపిపి కొలుముల శార‌ద, జ‌డ్పీటిసి భూక్య స‌ర‌ళ ప‌లువురు స‌ర్పంచ్లులు పాల్గొన్నారు.

 

 


Connect with us

Latest Updates