Nizamabad MP

మైనార్టీల స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేయాలి

అసెంబ్లీ మైనారిటీ వెల్ఫేర్ క‌మిటీ స‌మావేశంలో ఎంపి క‌విత‌
అన్ని రంగాల్లో మైనార్టీలు స‌మ‌గ్రాభివృద్ధి చెందేలా చూడాల‌ని అసెంబ్లీ మైనార్టీ వెల్ఫేర్ క‌మిటీని కోరారు నిజామాబాద్ ఎం.పి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శుక్ర‌వారం అసెంబ్లీ క‌మిటీ హాలులో అసెంబ్లీ మైనార్టీ వెల్ఫేర్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా బోధ‌న్ ఎమ్మెల్యే మ‌హ‌మ్మ‌ద్ ష‌కీల్ అమిర్‌ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో శాస‌న స‌భ స్పీక‌ర్ మ‌ధుసూనాచారి, శాస‌న మండ‌లి ఛైర్మ‌న్ స్వామిగౌడ్‌, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి,ఎంపి క‌విత ష‌కీల్‌ను అభినందించారు.

Kalvakuntla-Kavitha-in-Minority-Welfare-committee-meetin-held-in-assembly

 

మైనార్టీల అభివృద్ధి కోసం ఈ బ‌డ్జెట్‌లో 1200 కోట్లును ప్ర‌భుత్వం క‌టాయించింద‌ని క‌విత తెలిపారు. ఈ నిధులు అర్హుల‌కు చేరుతున్నాయో…లేదో చూడాల్సిన బాధ్య‌త క‌మిటీపై ఉంద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వాలు మైనార్టీల అభివృద్ధిని సీరియ‌స్‌గా ప‌ట్టించుకోలేద‌న్నారు. అభివృద్ధికి మాత్ర‌మే ప‌రిమితం కాకుండా….మైనార్టీల జీవ‌న విధానం, వారి ఆచార వ్య‌వ‌హారాలు, సంస్కృతీ, సంప్ర‌దాయాల‌ను కూడా ప‌రిర‌క్షించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఆసియాలోనే పేరొందిన మెద‌క్ చ‌ర్చి, జామా మ‌సీదు, ఇండియా-ఇరాన్ దేశాల సౌహార్ధ సంబంధాల‌కు ప్ర‌తీక‌గా నిలిచే పార్శీలు త‌దితరాల‌నూ క‌మిటీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని ఎంపి క‌విత సూచించారు. ముఖ్య‌మంత్రి కేసిఆర్ మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నార‌ని, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు ప్ర‌చారం చేస్తూనే…అమ‌లు తీరునూ ప‌ర్య‌వేక్షించాల‌ని వెల్ఫేర్ క‌మిటీని కోరారు. ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల్లో 35 శాతంగా ఉండే మైనార్టీల సంఖ్య నేడు అతి త‌క్కువ శాతంగా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు క‌విత‌.
స్పీక‌ర్ మ‌ధుసూనాచారి మాట్లాడుతూ 50 ఏళ్ల కింద‌ట క‌నిపించిన ముస్లింల కుటుంబాలు ఇప్పుడు క‌నిపించ‌డం లేద‌ని, వివిధ కార‌ణాల‌తో మైగ్రేట్ అయ్యార‌న్నారు. గ‌తంలో పండుగ‌లు వ‌స్తే…ఖ‌ర్చు కోసం ర‌క్తాన్ని అమ్ముకునే దుస్థితి ఉండేద‌ని ఆవేద‌న‌గా చెప్పారు. విజ‌న్ ఉన్న నాయ‌కుడు కేసిఆర్ ముఖ్య‌మంత్రిగా మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నార‌న్నారు. ప్ర‌తి నిర్ణ‌యం వెనుక నిర్ధేశిత ల‌క్ష్యం ఉండాల‌ని, అప్పుడే గ‌మ్యం చేరుతామ‌ని ఉద్భోదించారు. శాస‌న మండ‌లి ఛైర్మ‌న్ స్వామిగౌడ్ మాట్లాడుతూ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు మైనార్టీల‌కు చేరుతున్నాయో…లేదో చూడాల్సిన బాధ్య‌త క‌మిటీపై ఉంద‌న్నారు. మంత్రి పోచారం శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ షాదీముబార‌క్ ప‌థ‌కంలోనూ అక్ర‌మాలు వెలుగు చూస్తున్నాయ‌ని, అర్హుల‌కు ప్ర‌భుత్వ ఫ‌లాలు అందేలా చూడాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్‌, మ‌హ్మ‌ద్ స‌లీం,ఎమ్మెల్యే స్టీవెన్స‌న్‌, భువ‌న‌గిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖ‌ర్ రెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ , వ‌క్ఫ్ త‌దిత‌ర శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates