Nizamabad MP

Manifesto

నిజామాబాదు పార్లమెంట్ నియోజకవర్గ మానిఫెస్టో – 2014
-కల్వకుంట్ల కవిత, తెలంగాణ రాష్ట్ర సమితి

1. నిజామాబాదు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటికై కృషి.

2. జిల్లా ప్రజల రవాణా సౌకర్యం కోసం, మన పంటల దేశ వ్యాప్త మార్కెట్ తో అనుసంధానించే ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ రైల్వేలైన్ మరియు బోధన్-బాన్సువాడ-బీదర్ రైల్వేలైన్ ల నిర్మాణానికి కృషి.

3. నిజామాబాద్ జిల్లా మరియు కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు. ఇందుకై పక్కా ప్రణాళికల అమలు.

4. గల్ఫ్ భాదితుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ. భాదితులకు పునరావాసం, సబ్సిడీ రుణాలు.

5. పసుపు బోర్డు ఏర్పాటు. వేల్పూర్ మండలం మోతె లో పసుపు శుద్ది కేంద్రం ఏర్పాటు. ప్రస్తుతం రూ.లు 4000 ఉన్న పసుపు మద్దతు ధరను 10,000కు పెంచేలా కృషి.

6. ఎర్రజొన్నలకు మద్దతు ధర. రైతులకు బకాయిల చెల్లింపుకై కృషి.

7. బోధన్ లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరం చేయడానికి కృషి. చెరుకు మద్దతు ధర కు తోడ్పాటు.

8. బీడి కార్మికులందరికి ఇళ్లు. వైద్య సదుపాయాలు. పర్మనెంటు కార్డులకు కృషి.

9. మూతబడిన సారంగాపూర్ లోని NCSF పునరుద్ధరణ.

10. తెలంగాణ యూనివర్సిటీకి నిధుల కేటాయింపు, కొత్త కోర్సుల కోసం కృషి.

11. ప్రభుత్వ వైద్య కళాశాలకు నిధుల విడుదల, సదుపాయాల కల్పనకు కృషి.

12. జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బీఈడీ కళాశాల ఏర్పాటుకు కృషి.

13. జిల్లా కేంద్ర ఆసుపత్రికి సదుపాయాల కల్పన. సిబ్బంది నియామకానికి తోడ్పాటు.

14. జగిత్యాల నియోజకవర్గం లో బోర్నపల్లి దగ్గర గోదావరి పై బ్రిడ్జి నిర్మాణం, రాయికల్ లో మామిడిపండ్ల ప్రాసెసింగ్ యునిట్ ఏర్పాటు

Connect with us

Latest Updates