Nizamabad MP

మ‌న కాలం మ‌హానీయుడు బాపూజీ

కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ విగ్ర‌హావిష్క‌ర‌ణ స‌భ‌లో ఎంపి క‌విత‌

తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు, బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ మన కాల‌పు మహానీయుడ‌న్నారు నిజామాబాద్ ఎంపి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. మంగ‌ళ‌వారం నిజామాబాద్‌లో కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ 101వ జయంత్యుత్సవాలు ఘ‌నంగా జ‌రిగాయి. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో క‌లిసి కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీకి నివాళులు అర్పించారు. అనంత‌రం వినాయ‌క న‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ విగ్ర‌హాన్ని క‌విత ఆవిష్క‌రించారు. అనంత‌రం రాపెల్లి గురుచ‌ర‌ణ్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌భ‌లో ఆమె మాట్లాడుతూ ఎవ‌రు మ‌రిచి పోయినా టిఆర్ఎస్ పార్టీ క‌ల‌కాలం బాపూజీని గుండెల్లో పెట్టుకుంటుంద‌న్నారు.

kalvakuntla-kavitha-paricipated-in-konda-laxman-bapuji-jayanthi-01

2001లో టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు కోసం త‌న ఇంటిని ఇచ్చిన గొప్ప‌వాడ‌ని కొనియాడారు. తెలంగాణ ఉద్య‌మంలో అన్ని వ‌ర్గాల‌తో క‌లిసి ప‌నిచేసిన ఆయ‌న సేవ‌లు భావి త‌రాల‌కు స్పూర్తినిచ్చేందుకు తెలంగాణ‌లోనే మొద‌టి విగ్ర‌హం నిజామాబాద్‌లో ఆవిష్క‌రించుకున్నామ‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ల‌క్ష్మ‌ణ్ బాపూజీ జయంతి ఉత్స‌వాల‌ను అధికారికంగా నిర్వ‌హిస్తుండ‌టం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు.

కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ విగ్ర‌హాన్ని ఏర్పాటుకు కృషి చేసిన అర్భ‌న్ ఎమ్మెల్యే బిగాల గ‌ణేశ్ గుప్తాను క‌విత అభినందించారు. గాంధీ మ‌హాత్మునికి బాపూ ఘాట్ పెట్టుకున్న‌ట్లే కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ విగ్ర‌హం ప్రాంతానికీ పేరును పెట్టాల్సిందిగా కోరారు. మహాత్మా జ్యోతిభాపూలే, బాపూజీ, చాక‌లి ఐల‌మ్మ‌, స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న వంటి మ‌హానీయుల త్యాగాలు, వారు అనుస‌రించిన చూపిన మార్గం భావి త‌రాల‌కు స్పూర్తినిచ్చేలా విగ్ర‌హాల ప్రాంతాలు ఉండేలా చూడాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంద‌న్నారు క‌విత‌.

kalvakuntla-kavitha-participated-in-konda-laxman-bapuji-jayanthi
ప‌ద్మ‌శాలిల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం స‌మ‌ష్టిగా కృషి చేద్దామ‌ని పిలుపునిచ్చారు. ద‌క్షిణాది రాష్టాల‌కు హాండ్‌లూమ్‌, టెక్స్‌టైల్స్ క్ల‌స్ట‌ర్స్ వ‌చ్చాయ‌ని మ‌న‌కూ వ‌చ్చేలా చూడాల‌ని నిజామాబాద్ అర్భ‌న్ ఎమ్మెల్యే ఎంపి క‌విత‌ను కోరారు. శాయ‌శ‌క్తులా కృషి చేస్తాన‌ని క‌విత హామీనిచ్చారు. ప‌ద్మ‌శాలీల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి రావాల‌సిన నిధుల కోసం కృషి చేస్తాన‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నిజామాబాద్ అర్భ‌న్, రూర‌ల్ ఎమ్మెల్యేలు బిగాల గ‌ణేశ్ గుప్తా, టిఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్య‌క్షుడు ఈగ గంగారెడ్డి, ఎమ్మెల్సీ విజి గౌడ్‌, ప‌ద్మ‌శాలీ సంఘం జాతీయ నాయ‌కులు డాక్ట‌ర్ వ‌నం దేవీదాస్‌, గంగాదాస్‌, రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు పులుగం హ‌న్మాండ్లు,జిల్లా నాయ‌కులు నార‌ద కుమార్‌, వెంక‌ట‌న‌ర్స‌య్య‌, న‌రాల‌ సుధాక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates