Nizamabad MP

మ‌హిళా ఉద్యోగుల‌కు ఇన్‌కం టాక్స్ ప‌రిమితిని రూ. 6 ల‌క్ష‌ల‌కు పెంచండి

కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని కోరిన ఎం.పి క‌విత‌
దేశంలోని అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వ‌ మ‌హిళా ఉద్యోగుల‌కు ఆదాయ ప‌రిమితిని పెంచాల‌ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని నిజామాబాద్ ఎం.పి శ్రీమతి క‌ల్వ‌కుంట్ల క‌విత గారు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు ఆయ‌న‌కు విజ్ఞాప‌న ప‌త్రం అంద‌జేశారు. మ‌హిళా ఉద్యోగుల‌కు ఏడాదికి 6 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఆదాయ ప‌న్ను మిన‌హాయింపును ఇవ్వాల‌ని, దీని వ‌ల్ల దేశ వ్యాప్తంగా పెద్ద‌ సంఖ్యలో ఉన్న మ‌హిళా ఉద్యోగుల‌కు ఊర‌ట క‌లుగుతుంద‌న్నారు. త‌ద్వారా సేవింగ్స్ రూపంలో ప్ర‌భుత్వానికి ఉప‌యోగ‌డుతుంద‌ని, గృహ అవ‌స‌రాల‌ను మ‌హిళ‌లు సంతోషంగా తీర్చుకోగ‌లుగుతార‌ని క‌విత జైట్లీకి వివ‌రించారు. వుమెన్ ప్రెండ్లీ బ‌డ్జెట్ కోసం మ‌హిళ‌లు ఎదురు చూస్తున్నార‌ని ఈ సంద‌ర్భంగా జైట్లీతో చెప్పారు.


Connect with us

Latest Updates