Nizamabad MP

మహాయజ్ఞంలా హరితహారం

అడవుల పరిరక్షణలో ప్రపంచంలో ఆస్ట్రేలియా తొలిస్థానంలో, చైనా రెండో స్థానంలో ఉండగా, భారత దేశంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉన్నదని ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు.

Kalvakuntla-Kavitha-participated-in-Haritha-Haram-programe-at-Nizamabad

సోమవారం నిజామాబాద్ నగరంలో కాలూర్, బైపాస్ రోడ్డులో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ఎంపీ మొక్కలు నాటారు. శ్రద్ధానంద్‌గంజ్‌లో మర్చంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. నర్సింగ్‌పల్లి పరిధిలోని కాస్‌బాగ్‌తండాలో తీజ్ వేడుకలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం మహాయజ్ఞంలా సాగుతున్నదని చెప్పారు. మొక్కలు నాటడమే కాకుండా, వాటి పరిరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు.
.


Connect with us

Latest Updates