Nizamabad MP

కోరుట్ల‌లో తాగు నీటి స‌మ‌స్య రాకుండా చూడండి – ఎంపి క‌విత‌

కోరుట్ల మున్సిపాల్టీ ప‌రిధిలోని ప్ర‌జ‌ల‌కు తాగు నీటి స‌మ‌స్య ఏర్ప‌డ‌కుండా చూడాల‌ని కోరుట్ల మున్సిప‌ల్ చైర్మ‌న్ శీలం వేణుగోపాల్‌కు సూచించారు నిజామాబాద్ ఎం.పి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ప్ర‌స్తుతం మూడు రోజుల‌కు ఒక‌సారి న‌ళ్లానీరిస్తున్నామ‌ని, అవ‌స‌ర‌మున్న చోట ట్యాంకర్ల ద్వారా నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని వివ‌రించారు వేణుగోపాల్‌.

Kalvakuntla-Kavitha

ఇప్ప‌టికే ప‌ది బోరు బావుల‌ను రైతుల‌నుండి అద్దెకు తీసుకున్నామ‌ని, 5 బోర్ల‌ను మున్సిపాల్టీ వేసింద‌ని తెలిపారు. ప‌ట్ట‌ణానికి తాగు నీరందించే రిజ‌ర్వాయ‌ర్‌లు పాల‌మాకుల‌, రాయిని చెరువుల‌లో ఎస్సారెస్పీ నీటిని నిల్వ చేశారు. ఈ నీరు 45 రోజుల వ‌ర‌కు వ‌స్తుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. తాగునీటి ఎద్ద‌డి ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని మున్సిప‌ల్ ఛైర్మ‌న్ వేణుగోపాల్‌కు చెప్పిన ఎంపి క‌విత అవ‌స‌ర‌మైన నిధుల‌ను ప్ర‌భుత్వంచే మంజూరీ చేయిస్తాన‌ని హామీనిచ్చారు.
ప‌లువురు మెట్‌ప‌ల్లి నేత‌లు కూడా ఎంపి క‌విత‌ను క‌లిసి తాగు నీటి ఎద్ద‌డి ఏర్ప‌డ‌కుండా ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఎంపికి వివ‌రించారు.


Connect with us

Latest Updates