Nizamabad MP

కేంద్ర సాయంపై చ‌ర్చ‌కు సిద్దం

బిజెపి నేత‌ల‌కు ఎంపి క‌విత స‌వాల్‌
రెండేళ్ల‌లో 1500 కోట్లే ఇచ్చారు
బిజెపి ….ప్ర‌చార ప్ర‌భుత్వమే

Kalvakuntla-Kavitha-press-meet-in-Assembly
వేల కోట్ల నిధులు తెలంగాణ‌కు ఇచ్చామ‌న్న బిజెపి జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వ్యాఖ్య‌ల‌ను ఖండించారు నిజామాబాద్ ఎం.పి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత‌.
కేంద్రం ఇచ్చిందంటున్న నిధుల‌పై ఎక్క‌డ‌యినా చ‌ర్చ‌కు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి హ‌క్కు భుక్తంగా, రాజ్యాంగ బ‌ద్దంగా రావాల్సిన నిధులు మిన‌హా…కేవ‌లం 1500 కోట్లు మాత్ర‌మే ఇచ్చార‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం అసెంబ్లీ వెల్ఫేర్ క‌మిటీల స‌మావేశంలో పాల్గొన‌డానికి అసెంబ్లీకి వ‌చ్చిన క‌విత‌ మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర‌కు ఇచ్చిన దాంట్లో స‌గం నిధుల‌ను కూడా తెలంగాణ‌కు ఇవ్వ‌కుండా కేంద్రం వివ‌క్ష చూపుతోంద‌ని క‌విత ఆరోపించారు. కేంద్రం 700 కోట్లు క‌రువు కోసం, బిఆర్‌జిఎఫ్ కింద 450 గ్రాంట్‌గా ఇచ్చారు. మిగ‌తా చిన్న చిన్న స్కీంల కింద ఇచ్చారని తెలిపారు.

తెలంగాణ ప్ర‌భుత్వం కేంద్రానికి స‌పోర్ట్ ఇవ్వ‌డం లేద‌నడం హాస్యాస్ప‌దమ‌న్నారు.ఎయిమ్స్‌, ఐటిఐఆర్‌…ప్ర‌తి అంశంలోనూ మేం డిమాండ్ చేస్తున్నాం..వంద‌ల సంఖ్య‌లో లాయ‌ర్లు దీక్ష చేస్తున్నా …కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. పైపెచ్చు బ‌ట్ట‌కాల్చి మీదేసే ప్ర‌య‌త్నం బిజెపి ప్ర‌భుత్వం చేస్తున్న‌దన్నారు. గ‌డ్క‌రీ హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేశార‌ని, జిహెచ్ ఎంసి ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు గ‌డ్క‌రీకి త‌గిన బుద్ది చెప్పారన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని బ‌ద‌నాం చేసే ఆలోచ‌న మాని ఆంధ్రాకు ఎన్ని నిధులు వ‌స్తున్నాయో…తెలంగాణ‌కూ అంతే మొత్తం తేవాల‌ని బిజెపి నేత‌ల‌ను డిమాండ్ చేశారు క‌విత‌.

దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌గా తెలంగాణ ప్ర‌భుత్వం నిలుస్తోంద‌ని, యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్‌ను అంద‌రిక‌న్నా ముందు ఇస్త‌న్న రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మే…కేంద్రం నుంచి వ‌చ్చే ప్ర‌తిపైసా ఖ‌ర్చుపెడుతున్నం…అని వివ‌రించారు. 30 ప్రాజెక్టుల‌ను కేసిఆర్ గారే డిజైన్ చేశార‌ని, ఐటిఐఆర్ డిపిఆర్‌ ఎప్పుడో స‌బ్మిట్ చేశారని తెలిపారు. ఐటిఐఆర్‌పై వాళ్ల‌కే క్లారిటీ లేదు. ఇంకెక్క‌డయినా ఐటిఐఆర్ ఇచ్చారో చెప్పాల‌న్నారు. ఐటిపై ఫోక‌స్‌గా ప‌నిచేసే ప్ర‌భుత్వం మాది…కేవ‌లం ప్ర‌చారం కోస‌మే ప‌నిచేసే ప్ర‌భుత్వం బిజెపి ప్ర‌భుత్వ‌మ‌న్నారు క‌విత‌.

కాంగ్రెస్‌ది క‌మిష‌న్ల క‌ల్చ‌ర్‌
కాంట్రాక్టులు, క‌మిష‌న్ల కోస‌మే కాంగ్రెస్ నేత‌లు టిఆర్ఎస్‌లో చేరుతున్నార‌ని దిగ్విజ‌య్ సింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించారు క‌విత‌. క‌మిష‌న్ల క‌ల్చ‌ర్ కాంగ్రెస్‌దేన‌న్నారు. టిఆర్ఎస్ నాయ‌కులు ఎవ‌రూ క‌మిష‌న్ల‌కు క‌క్కుర్తి ప‌డ‌ర‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్ ప‌రిస్థితి నానాటికీ దిగ‌జారుతోంద‌ని, ముందు స్వంత పార్టీని చ‌క్క‌దిద్దుకోవాల‌ని క‌విత స‌ల‌హా ఇచ్చారు. కాంగ్రెస్‌లో నాయ‌క‌త్వలోపం ఉంద‌ని, అందువ‌ల్లే ఒక్కొక్క‌రుగా కాంగ్రెస్‌ను నేత‌లు వీడుతున్న విష‌యాన్ని దిగ్విజ‌య్‌సింగ్ తెలుసుకోవాల‌న్నారు. మా డైన‌మిక్ సిఎం కేసిఆర్ విజ‌న్‌ న‌చ్చే టిఆర్ఎస్‌లో చేరుతున్నారు. ఆ విజ‌న్‌ను చూసే డిఎస్‌, గుత్తాలు కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. ప‌చ్చ‌కామెర్లు వ‌చ్చినోడికి లోక‌మంతా ప‌చ్చ‌గానే క‌న‌ప‌డుతుంద‌న్నట్లుగా దిగ్విజ‌య్ సింగ్ వ్యాఖ్య‌లున్నాయ‌న్నారు. ఆంధ్రా వాళ్ల‌కు దిగ్విజ‌య్ అమ్ముడు పోయిన విష‌యం పోల‌వ‌రం క‌లుపుకున్న‌ప్పుడు, 10 మంది ఎమ్మెల్యేల‌ను చేర్చుకున్న‌ప్పుడే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెలిసింద‌న్నారు. క‌ర‌ప్ష‌న్ ఫ్రీ రాష్ట్రం కోసం ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు క‌విత‌. టిఆర్ఎస్‌లో ఎవ‌రు చేరుతామ‌న్నా చేర్చుకుంటామ‌న్న క‌విత అవి చేరిక‌లు కావ‌ని, రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ అని స్ప‌ష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల‌పై ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఎంత వ‌ర‌కు వ‌చ్చిందో…కాంగ్రెస్ నేత‌లు చెప్పాలన్నారు క‌విత‌.


Connect with us

Latest Updates