Nizamabad MP

కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం: కవిత

నిజామాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు జిల్లాలో పెద్దనేతలైన నీళ్ల మంత్రి సుదర్శన్‌రెడ్డి, డీ శ్రీనివాస్, షబ్బీర్‌అలీ, సురేష్‌రెడ్డిలాంటి మహాయోధులు ఉన్నప్పటికీ సోనియా ముందు ఏనాడూ జై తెలంగాణ అన్న పాపానపోలేదని విమర్శించారు. ఏనాడూ తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించని వీరు తెలంగాణను తామే ఇచ్చామని చెప్పడం సిగ్గుచేటన్నారు. బీజేపీ తాము మద్దతు ఇవ్వకుంటే తెలంగాణ వచ్చేదికాదని చెప్పడం అవహేళన చేసినట్లేనన్నారు. తెలంగాణను సాధించడంలో టీఆర్‌ఎస్, కేసీఆర్ పాత్ర పెద్దన్నలాంటిదని వివరించారు. తెలంగాణ పునర్నిర్మాణంసైతం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు.


Connect with us

Latest Updates