Nizamabad MP

జ‌య‌శంక‌ర్ సార్ మ‌న‌తోనే ఉన్న‌రు

జ‌య‌శంక‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ స‌భ‌లో ఎంపి క‌విత‌

ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్ మ‌న మ‌ధ్య భౌతికంగా లేక‌పోయినా…త‌న ఆశ‌యాల‌తో మ‌న‌తోనే ఉన్నార‌న్నారు నిజామాబాద్ ఎంపి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. మంగ‌ళ‌వారం క‌రీంగ‌న‌ర్ జిల్లా మల్లాపూర్ మండ‌ల కేంద్రంలో జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హాన్ని స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారితో క‌లిసి ఆమె ప్రారంభించారు. మ‌ల్లాపూర్ విశ్వభ్రాహ్మ‌ణ సంఘం నిర్వ‌హించిన స‌భ‌లో క‌విత మాట్లాడుతూ ఇత్త‌గ‌యినా పుత్త‌డ‌యినా..క‌ల‌ప అయినా..ఇనుమ‌యినా.. అద్భుత‌మైన విశ్వ‌బ్రాహ్మ‌ణ కులుస్తుడు జ‌య‌శంక‌ర్ గారు కేసిఆర్ గారిని
సాన‌బ‌ట్టి తెలంగాణ వ‌జ్రాయుధాన్ని త‌యారు చేశారని ప్ర‌శంసించారు. పుట్టిన వారిలో కొంద‌రి విగ్ర‌హాల‌నే పెట్టుకుంటామ‌ని వారి విగ్ర‌హాల‌ను చూసిన‌ప్పుడ‌ల్లా వారి గొప్ప‌తనం మ‌న‌కూ, మ‌న పిల్ల‌ల‌కూ స్పూర్తిని ఇవ్వాల‌ని కోరుకుంటామ‌న్నారు.

kalvakuntla-kavitha-unveiled-the-statue-of-prof-jayashankar-sir
తెలంగాణ‌ను ఏపిలో క‌లిపిన త‌ర‌వాత ఎలా అన్యాయం జ‌రిగిందో చిత్ర‌గుప్తునిలా చిట్టా రాసిపెట్టుకున్నారు. అందుకే లెక్క‌ల‌తో స‌హా కొట్లాడినమ‌న్నారు. కేసిఆర్ ప‌దునైన వాగ్ధాటికి కార‌ణం జ‌య‌శంక‌ర్ రాసిన విష‌యాలే. మా కుటుంబంలో స‌భ్యుడు జ‌య‌శంక‌ర్ స‌ర్ అన్నారు. ఒక సంద‌ర్భంలో నీటి విష‌యంలో మాట్లాడుతున్న‌ప్పుడు…త‌న చొక్కా జేబులో నుంచి క‌ర‌ప‌త్రాన్ని తీసి చేతిలో పెట్టారు. అలాంటి ఆయ‌న ఒక‌ వెయ్యి ప‌త్రిక‌లు పంచార‌ట‌. కాని ఒక‌టి దాచి పెట్టుకుని నాకు ఇచ్చారు చ‌ద‌వ‌మ‌ని. చిన్న‌ప్పుడు 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్య‌మం కంటిన్యూ చేశారు. ఒక్క సారి డిసైడ్ అయితే వెన‌క్కి చూడ‌కూడ‌ద‌నే వారు ఎప్పుడూ అని గుర్తుకు చేసుకున్నారు.
మ‌హానుభావుల‌తో క‌లిసి పనిచేయ‌డం, ఆలోచ‌న‌లు పంచుకోవ‌డం అంద‌రికి సాధ్యం కాదు. ఉద‌యం మా ఇంటికి వ‌స్తే మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ ఉండే వారని చెప్పారు. ఆయ‌న సిక్ అయిన‌ప్పుడు మా అమ్మ జ‌య‌శంక‌ర్ సార్ ను చూడ‌డానికి వెళ్లిన‌ప్పుడు…అమ్మా మీ చేత్తో ఎన్నో సార్లు భోజ‌నం పెట్టారు. మ‌ళ్లీ తింటానో లేదో…అన్నార‌ట‌. ఈ విష‌యం మా అమ్మ నాకు చెప్తూ క‌న్నీళ్ల ప‌ర్యంతం అయింద‌ని క‌విత తెలిపారు. ఆ మ‌హానుభావుడు భావిత‌రాల‌కు స్పూర్తినివ్వాల‌ని క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, న‌ల్గొండ జిల్లాల్లో విగ్ర‌హాలు పెట్టినమ‌న్నారు. అలాగే .తెలంగాణ జాగృతి పదేళ్ల వార్షికోత్స‌వాల‌ను ఆయ‌న పుట్టిన రోజునే న‌ల్గొండ‌లో నిర్వ‌హించుకున్నామ‌ని క‌విత తెలిపారు.


Connect with us

Latest Updates