Nizamabad MP

Interview with Namasthe Telangana

జన జాతరయ్యింది

బతుకమ్మ.. అంటే ఈ నేల ప్రకృతి. బతుకమ్మ అంటే ఈ గడ్డ సంస్కృతి. బతుకమ్మ అంటే మహిళా జాగృతి. బతుకమ్మ అంటే గౌరమ్మ అందమైన ఆకృతి.. బతుకమ్మ పండుగ గాయపడిన గుండెలను కలిపే పూలతీగై పెనవేసుకుపోయింది. తలుపు చాటున బిడియంగా చూస్తున్న మహిళ మనసును పూలబాణమై తాకింది. నిండైన జనప్రవాహమై ఉద్యమానికి పట్టు పరిమళం తెచ్చింది. నవరాష్ర్టంలో అందమైన ఆచారమై, మన భాష, మన ఊరు, మన ఊపిరై గుబాళిస్తోంది. మన చరిత్రలో తరాలు మారినా, కరువొచ్చినా, కష్టమొచ్చినా, పాలకులు మారినా బతుకమ్మ బతికింది. మన నేలను బతికించింది.

Kalvakuntla-Kavitha-012

ఇంతకీ ఈ అమ్మ పోసింది మరెవరో కాదు. ఈ తల్లి గొప్పదనాన్ని గొంతెత్తి చాటింది ఇంకెవరో కాదు. సాక్షాత్తూ మన తెలంగాణ ఆడపడుచు, ఈ నేలను సంస్కృతితో జాగృతి చేస్తూ, సంస్కారంతో, మమకారంతో ఇప్పుడు అధికారంతో తండ్రికి తగ్గ తనయగా కోట్ల గుండెలకు చేరువైన బంగారుతల్లి.. కల్వకుంట్ల కవితమ్మ. నవ తెలంగాణలో తొలి బతుకమ్మ జరుపుకుంటున్న శుభతరుణంలో ఆ పండుగ విశేషాలు, ఆశయాలను తెలుసుకునేందుకు ఇలా పలకరించాం.

ప్ర:తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం తరువాత జరుగుతున్న ఈ మొదటి బతుకమ్మ ప్రత్యేకత..?
జ:ప్రతిసారి కంటే ఈసారి చాలా వైభవంగా జరుగుతున్నది. ప్రభుత్వం తరుపున పది కోట్ల రూపాయలు ఖర్చు చేసున్నారు. కానీ ఇంతటితో సరిపోదు. రహదారులు, ఉత్సవాలకు చేరుకునే మార్గాలు, చెరువుల పరిరక్షణ, లైట్స్ ఇలా చాలా అంశాల మీద దృష్టి పెట్టాలి. పండుగప్పుడు మాత్రమే ఖర్చు చేస్తామంటే కుదరదు.

ప్ర:బతుకమ్మ ఉత్సవాల వెనుక ఉండే అసలైన చరిత్ర ఏమిటి..?
జ:బతుకమ్మ పండుగ అంటే అందరినీ ఒక దగ్గరికి కలిపే పండుగ. పాతకాలంలో సరైన నీటి సదుపాయం లేనప్పుడు చెరువులను కాపాడుకునే అవసరం ఉండేది. అది ఏ ఒక్కరితో అయ్యే పనికాదు కనుక ఊరంతా సమష్టి బాధ్యత తీసుకుని చేయాల్సివచ్చేది. వర్షాలు పడిన తరువాత నీరంతా చేరుకుని నిలువ ఉన్నప్పుడు ఆ నీటిని పరిశుభ్రపరుచుకుని వాడుకోవడానికనుకూలంగా చేసుకునేవారు. అందుకోసమే చెరువుల్లో అందరూ గుమ్మడాకు, బంతి, తంగేడు పూలు వీటిల్లో నీటిని శుద్ధి చేసే గుణాలుంటాయి. అందుకే ఈ తొమ్మిది రోజులు వాటిని నీటిలో కలిపి అంటురోగాలు రాకుండా శుభ్రపరిచేవారు. వీటితో పాటు పాటలు పాడటం, అందరూ ఒక్కదగ్గరికి చేరి పండుగ జరుపుకోవడం చాలా మంచిగనిపిస్తది.

మామూలుగా ఏ శక్తి స్వరూపిణిని పండుగైనా చాలా పురాతనమైన పండుగగా భావించాలి. ఆ కాలంలో ప్రజలు నిప్పును కొలిచేవారు. అంటే ప్రకృతిలోని అంశం. అలాగే ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారిని కొలవడం మొదలుపెట్టారు. ఇందులో తెలంగాణ ప్రత్యేకత ఏమిటంటే, మట్టికి దగ్గరగా ఉండే సంసృ్కతి కావడం వల్ల పూలను కొలవడం, అది వెదురుతోనే చేసిన పాత్రల్లో పేర్చడం వంటి సంప్రదాయాల వల్ల బతుకమ్మనుప్రకృతికి దగ్గరగా ఉండే పండుగగా నేను భావిస్తాను. రానురాను మహిళల పాత్ర పెరగడం వల్ల ఈ పండుగను బతుకమ్మ.. గౌరమ్మ అని ఇప్పుడు చేసుకుంటారు.

ప్ర:దీని వెనుక కథపై అనేక అభిప్రాయబేధాలున్నాయి కదా..!
జ:అవును. బతుకమ్మ మీద ఇంకా పరిశోధనలు జరగాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రోత్సహించాలి. బతుకమ్మ వెనుక కథ కాదు, మన సంస్కృతిలో పాడే పాటలు, మన భాష వీటిపై కూడా దృష్టి పెట్టాలి. ఈసారి ఉత్సవాల ఆఖరి రోజున హైదరాబాద్‌ను మునుపెన్నడూ లేనివిధంగా అలంకరించాలని సంకల్పించాం. ప్రపంచంలోనే ఇదొక కనువిందు చేసే దృశ్యం ప్రభుత్వం పెట్టే ఖర్చంతా దీనికే సరిపోతుంది. విషయమేమిటంటే ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలతో గ్రామాల అభివృద్ధి ప్రజల జీవితాలు ముడిపడి ఉన్నాయి. ఎప్పుడైతే చెరువులు, మార్గాల ఏర్పాట్లు.. సంబరాల్లో భాగం అవుతాయో, అప్పుడు సహజంగానే గ్రామాల ముఖచిత్రం మారిపోతుంది. ఈ ఉత్సవాలకు మరింత సార్ధకత వస్తుంది.

ప్ర:మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారు కదా..?
జ:మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాం. చాలాసార్లు మాకు అనుమతి దొరికేది కాదు. అసలు అనుమతెందుకో అర్ధమయ్యేది కాదు. మేమేమైనా బాంబులు పెడతామా? మొదట్లో ఏ మీడియా సహకరించలేదు, ఒకటి రెండు మినహా. నాకున్న అమెరికా అనుభవంతో మెల్లిమెల్లిగా బతుకమ్మకు ప్రాచుర్యం తీసుకొచ్చాను. ఈ రోజు ప్రపంచంలోనే బతుకమ్మ ఒక ప్రత్యేక పండుగగా తయారైంది. మన ఆడపడుచులు లంగాఓణీలు వేసుకుని ముద్దుగా ముచ్చటగా తయారై ట్యాంక్‌బండ్‌పై ఉత్సవాల్లో పాల్లొన్నప్పుడు చాలా బాగనిపిస్తది. మొదట జనం వస్తారా, రాకుంటే పరువు పోతుందేమోనన్న పరిస్థితి. ఆ బస్తీలలో అందరూ ముందుకొచ్చి పండుగ చేసుకోవడం మొదలుపెట్టారు. మొదటి రెండేళ్ల తరువాత ఇక్కడ తంగేడు పూల బుట్టలు రోడ్లపై అమ్మడం మొదలుపెట్టారు. రైతులు చుట్టుపక్కల వీటిని పండించడం మొదలుపెట్టారు. కాబట్టి ఇది ఒక్క కృషి మాత్రమే కాదు, అందరూ కలిసొచ్చారు.

ప్ర:దేశవిదేశాల్లో తెలంగాణ ప్రజలకోసం ప్రత్యేక ఏర్పాట్లేమిటి..?
జ:తెలంగాణ ఎన్నారైల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సందేశాన్ని వెబ్‌కాస్ట్ చేస్తున్నాం. దాదాపు అరవై నాలుగు దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ జరుగుతున్న పండుగ ఉత్సవాలన్నీ వెబ్ ద్వారా అందరికీ చూపుతాం. ఇంత ప్రాచుర్యం వచ్చిందంటే కేవలం నేనేదో చేస్తున్నట్టు నాపై విమర్శ వచ్చింది. కానీ ఖచ్చితంగా ఈ తరం వాళ్లం అంటే మనమే ఈ ఆచారాలను మానేశాం, కనుక ఏదో ఒకటి చేయాలి అనే విషయంలో మాత్రం జాగృతి సక్సెస్ అయిందని చెప్పాలి.

ప్ర: బతుకమ్మ మాత్రమే కాకుండా, తెలంగాణ కళలు, ఆటపాటల్ని అభివృద్ది చేయడానికి ఏం చేయబోతున్నారు..?
జ: తెలంగాణ కళలు అనగానే గొంగడి కప్పుకుని, జానపదాలు పాడటం అనే మూసలోంచి బయటపడాలి. మనకుండే సహజ సంపదైన కళలను ఇళ్లల్లో ప్రవేశపెట్టడానికి కూడా బతుకమ్మలాంటి పండుగలది పెద్ద పాత్ర. మా ఊళ్లో ఆడపిల్ల పుట్టగానే వెండి కోలలు పెడతారు. అలాగే ఇంట్లో పెద్దలు పిల్లలకు అన్నీ నేర్పేవారు. మా తాత నాకు పద్యాలు నేర్పారు. కానీ ఇప్పుడు కుటుంబ వ్వవస్థ మారిపోయింది. మనకెవరు నేర్పుతారు అన్న ప్రశ్న వచ్చిందంటేనే ఆలోచించాలి. మళ్లీ ఈ విషయంలో ప్రభుత్వాలే పూనుకోవాలి. ఇటువంటి అంశాలకు ప్రసార మాధ్యమాల్లోనూ ఇంకా మార్పు రావాలి. గతంలో కొన్ని కార్యక్రమాలను తెలంగాణ ప్రత్యేకంగా రూపుదిద్దారు ఇంకా చేయాల్సింది చాలా

ప్ర:తెలంగాణ సంస్కృతి అంటే కవితగారు మాత్రమేనా.. మిగిలిన మహిళలు తెరపైకి ఎందుకు రారు..?
జ: నిజమే.. మహిళలు ముందుకు రావాలి. మహిళల హక్కులు అనగానే మనోళ్లందరూ తెలివిగా మహిళా విభాగం పెట్టేస్తారు. కానీ నేనెప్పుడూ ఒకటే అంటాను. అన్నా, మహిళా విభాగంలో మేమే ఉంటాం. కానీ మెయిన్ వింగ్‌లో మా పాత్ర ఏంటి. (చప్పట్లు) ఎంతోమందికి ఎన్నో వేదికలపై విషయం చెప్పాను. అలాగే మా జాగృతిలో నాతో పాటు మహిళలే అనేక విభాగాల్లో నాయకులు. ఈ రోజు దురదృష్టమేమిటంటే నేనొక్కదాన్నే తెలంగాణ నుండి మహిళా ప్రతినిధిగా పార్లమెంట్‌లో ఉన్నాను. ఏ పార్టీ మహిళలకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఆలోచనా దృక్పధం మారాలి. అన్ని టిఆర్‌ఎస్ సహా. ఉదంతం తరువాత నేను స్పందించలేదనే విమర్శలు నాపై వచ్చాయి. కానీ నేను స్పందించకపోవడం కాదు, స్త్రీల అంశాలపై స్పందించి నా పరిధిని పరిమితం చేసుకోదలుచుకోలేదు. అన్ని మాట్లాడాలి, కశ్మీర్ నుండి పోలవరం దాకా. కేవలం మహిళల సమస్యలు మహిళలే మాట్లాడాలనే దృష్టి మారాలి.

ప్ర:మీరు చేసిన వ్యాఖ్యల వల్ల చాలా వివాదాల్లో చిక్కుకుంటుంటారు. ఎప్పుడూ వెనుకాడలేదా..?
జ:నా అభిప్రాయాలపై స్పష్టత ఉన్నంతకాలం ఇక ఎవరో ఏదో అన్నారన్న జంకెందుకు. నేను నమ్మిన సిద్దాంతాలకే కట్టుబడి ఉంటాను. తెలంగాణ నాకు నేర్పిన పాఠమిది. పదిహేనేళ్లలో కేసీఆర్ గారిని, నన్ను, మా కుటుంబాన్ని మాటలన్నారు. అయినా పడ్డాం, కట్టుబడి ఉన్నాం, సాధించాం. వారసత్వ రాజకీయాలంటారు, కానీ వారసత్వం నాకిచ్చింది తొలి అవకాశం మాత్రమే. ఆపై కృషి చేసి సాధించాల్సిన బాధ్యత నాపైనే ఉంది. ఐదేళ్లు పనిచేయకుంటే అవతల పడేస్తారు. కనుక వారసత్వం ప్రాతిపదిక కాకూడదు. గతంలో ఎన్నికైన ఎంతోమంది మహిళా నాయకులు ఢిల్లీ నుండి ఇక్కడి దాకా ఏం మాట్లాడలేదు, చేయలేదు. కనుక ప్రజలు నాకిచ్చిన బాధ్యతను వదులుకోకుండా నెరవేరుస్తాను.

Kalvakuntla-Kavitha-03ప్ర: ఎన్ని గంటలు పనిచేస్తారు, అలిసిపోరా..?
జ: లెక్కలేదు. నా కుటుంబం కోసం సమయం కేటాయిస్తాను. వీలున్నప్పుడు పిల్లలను ఊర్లకు ఎప్పుడైతే మహిళకు ఇంట్లో మద్దతు, గౌరవం లభిస్తాయో ఆమె అద్భుతాలు చేయగలుగుతుంది. నేను అదృష్టవంతురాలిని. నేను కట్టే ప్రతి చీర, నా బొట్టు ఇదిగో నా చెవుల జుంకీలు అన్నీ నా ఆడబిడ్డ కొని పెట్టినవే. అలాగే నా బంధుమిత్రులు. ఉదాహరణకు మంత్రి హరీష్ భార్య చాలా సహాయం చేస్తుంటారు. మహిళలు గోడలు కట్టుకోకుండా అమ్మను, అత్తను కలుపుకుపోతే వారికే మంచిది (చిరునవ్వుతో..)

ప్ర: ఇంత బిజీలో పాటలు, సినిమాలకు సమయం దొరుకుతుందా?
జ: పొద్దునే నాలుగున్నరకి నిద్ర లేస్తాను. వ్యాయామం చేస్తాను. అది నా సమయం. తీరిక దొరికినప్పుడల్లా చదువుతూ ఉంటాను. రోజంతా బిజీ అయితే రాత్రి ఒక పది నిమిషాలైనా చదువుతూ ఉంటాను. మా ఆయన తిడుతూ వుంటారు. పాటలంటే చాలా చాలా ఇష్టం. కిషోర్ కుమార్ అభిమానిని. బాధ, విరహగీతాలు ఎక్కువగా వింటాను. మన తెలుగు పాటల్లో ఎస్.పి. గారి పాటలంటే చాలా ఇష్టం. దివిలో విరిసిన పారిజాతమో.. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు.

ప్ర: ఆపుకోలేని ప్రశ్న.. వంట చేస్తారా..?
జ: ఓ.. యా.. ఆయన కోసం వంట చేస్తుంటాను. బాగా వండుతానని అందరూ అంటారు. పిల్లలకి లంచ్ డబ్బా కట్టిస్తే వాళ్లకు చాలా ఇష్టం. అమ్మ, అత్త వండినంత బాగా నాకు రాదుగానీ మా ఆయనకు చాలా ఇష్టం. అప్పుడప్పుడూ అందరం కలిసి వంట చేసుకుంటూ ఉంటాం. ఆ మజా వేరు.

ప్ర:కొనేళ్లుగా మీరు తెలంగాణ సంస్కృతిపై పెడుతున్న దృష్టి ఎంతవరకు ఫలితాన్నిచ్చింది..?
జ:ఈ విషయంలో చాలా గర్వపడుతున్నాను. 2006లో బతుకమ్మ మొదలుపెట్టినపుడు నాపై చాలా విమర్శలొచ్చాయి. దళిత సంఘాలేమో.. మాపై తన ఆలోచనలు రుద్దుతుందన్నరు. ఇంకొంతమంది ఇది మా పండుగ, ఈమె గుంజుకుంటుందన్నరు. నేను పట్టించుకోకుండా నా పని చేస్తూ పోయాను. అసలు మొదలుపెట్టింది మహిళల్లో ఉండే బిడియాన్ని అప్పట్లో పూలు దొరకవనో, మరో కారణంతోనో మహిళలు పండుగ చేసుకోవడానికి మెల్లిగా ఈ పద్ధతి గ్రామాల్లో పాకడం కూడా అప్పుడు నాకనిపించింది, ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం వల్ల రెండు ప్రయోజనాలుంటాయి. మొదటిది, టిఆర్‌ఎస్/రాజకీయాలకతీతంగా ప్రజలకు చేరువవ్వొచ్చు. రెండు, ఒక సంసృ్కతి ద్వారా ప్రజలను ఒక్క దగ్గరికి చేర్చడం వల్ల వారిలో ఉద్యమ భావం, మన గడ్డపై మమకారం తీసుకురావడం సులభం. అందువల్ల ఈ ఉత్సవాల పాత్ర ఈ ఉద్యమంలో, రాష్ర్ట ఏర్పాటులో కీలకమైంది. ఈ విషయంలో నాకు స్ఫూర్తి బాలగంగాధర్ తిలక్. ఎలాగైతే గణేష్ ఉత్సవాల ద్వారా ప్రజలను చేర్చి సమరయోధులుగా మార్చారో, అలాగే మహిళలను, అక్కచెల్లెళ్లను ఒక్క దగ్గరికి చేర్చి వాళ్లను నిజమైన శక్తి స్వరూపిణులుగా మార్చగలిగాము.

ప్ర:మీరు పాడతారా, నేర్చుకున్నారా?
జ:నేర్చుకోలేదు. పాడుతూ ఉంటాను. పాడుకుంటే ఒత్తిడంతా పోతుంది. హెచ్చు స్ధాయిలో పాడలేను కానీ ప్రయత్నిస్తాను. బాత్‌రూం సింగర్‌ను మాత్రమే! లతామంగేష్కర్ గారి ఆప్‌కీ నజరోనే పాట పాడాలని ట్రై రికాలో ఇంగ్లీష్ రాక్ కూడా వినేదాన్ని.


Connect with us

Latest Updates