Nizamabad MP

ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటడం అల‌వ‌ర్చుకోవాలి

చిన్న‌నాటినుండే మొక్క‌లు నాట‌డాన్ని అల‌వాటు చేసుకోవాల‌ని విద్యార్థుల‌కు ఉధ్బోధించారు నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శ‌నివారం జ‌గిత్యాల జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాయిక‌ల్ మండ‌లం ఉప్పుమ‌డుగు గ్రామంలోని ఒక్క‌రూ మొక్క‌లు నాట‌డాన్ని అల‌వాటు చేసుకోవాల‌ని విద్యార్థుల‌కు క‌స్తూర్బా గాంధీ బాలిక‌ల స్కూల్‌లో ఆమె మొక్క‌లు నాటారు.

Haritha Haram program at upmadugu village of jagtial constituency‬ Haritha Haram program at upmadugu village of jagtial constituency‬-1జిల్లా ఎస్పీ అనంత శ‌ర్మ కూడా ఒక మొక్క నాటారు. ప్ర‌కృతి స‌మ‌తుల్య‌త కాపాడుకునే బాధ్య‌త మ‌నంద‌రిని అని ఈ సంద‌ర్భంగా ఎంపి క‌విత అన్నారు. అనంత‌రం విద్యార్థుల‌తో ఎంపి క‌విత గ్రూప్ ఫోటో దిగారు. క‌విత‌కు బ‌తుక‌మ్మ‌ల‌తో స్వాగతం ప‌లికారు క‌స్తూర్భా స్కూల్ విద్యార్థినులు. ఈ కార్య‌క్ర‌మంలో జగిత్యాల టిఆర్ ఎస్ ఇంఛార్జి డాక్ట‌ర్ సంజ‌య్ కుమార్ తో పాటు స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

——————

గొర్రెల పంపిణీ

రాయిక‌ల్ ఎంపిపి కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో గొల్ల, కురుమ‌ల‌కు గొర్రెల‌ను పంపిణీ చేశారు. అనంత‌రం మండ‌ల ప్ర‌జాప‌రిషత్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

‪Distribution of sheep units to shepherd families at Raikal of Jagtial constituency‬-1

 

‪Mp Kavitha Attended MPP General body meeting at raikal of Jagtial constituency ‬

హ‌రిత హారం, గొర్రెల పంపిణీ, అంటు వ్యాధులుపై తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్‌, డిఆర్‌డిఓ అరుణ‌శ్రీ, డిపిఓ రాజ‌న్న‌,ఎంపిడిఓ బాలె శివాజి, ఎమ్మార్వో చంద్ర‌ప్ర‌కాశ్‌, ఎంపిపి ప‌డాల పూర్ణిమ హాజ‌ర‌య్యారు.

——————————

జ‌డ్పీటీసిని ప‌రామ‌ర్శించిన ఎంపి క‌విత‌

Mp Kavitha Jagtial ZPTC

జ‌గిత్యాల జ‌డ్పీటీసి పెండెం నాగ‌ల‌క్ష్మి కుటుంబ స‌భ్యుల‌ను నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత ప‌రామ‌ర్శించారు. శ‌నివారం జ‌గిత్యాల జిల్లాలో ఆమె విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఇటీవ‌ల జ‌గిత్యాల జ‌డ్పీటీసి తండ్రి మృతి చెందారు. రాయిక‌ల్ మండ‌ల స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో పాల్గొనేందుకు వెల్తూ చ‌ల‌గ‌ల్‌లో జ‌డ్పీటీసి నాగ‌ల‌క్ష్మి ఇంటికి వెళ్లారు.


Connect with us

Latest Updates