Nizamabad MP

గ్రామాల అభ్యున్నతే దేశ ప్రగతికి మూలం – ఎంపీ కవిత

కార్యక్రమంలో భాగంగా బోధన్ నియోజకవర్గంలోని బినోల, నాళేశ్వర్ లలో కవిత పర్యటన, నాళేశ్వర్ లో రాత్రి బస
గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన విన్నూత్న కార్యక్రమానికి విశేష స్పందన

Kalvakuntla Kavitha in Mana Ooru Mana MP in Bodhan Constituency (11)

నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని బోధన్ నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో పర్యటించారు. శ్రీమతి కవిత గ్రామాల అభివృద్ది నినాదంతో కొనసాగిస్తున్న “మన ఊరు – మన ఎంపీలో భాగంగా నేడు బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నవీపేట్ మండలం లోని బినోల, నాళేశ్వర్ గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించి అక్కడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన గ్రామ సభల్లో కూడా స్థానిక సమస్యలను ఎంపీ కవిత దృష్టికి తెచ్చారు. వాటన్నిటికి సంబందిత అధికారులతో అక్కడే మాట్లాడారు శ్రీమతి కవిత. నేటీ ఈ కార్యక్రమం అనంతరం నాళేశ్వరం గ్రామంలోనే శ్రీమతి కవిత బస చేసారు. నియోజకవర్గంలో మన ఊరు మన ఎంపీ కార్యక్రమం 6 నుండి 8 వరకు మూడు రోజులు కొనసాగనుంది. బినోల గ్రామంలోని కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే శ్రీ షకీల్ అహ్మద్ గారు కూడా పాల్గొన్నారు.

బినోల గ్రామంలో పాదయాత్ర నిర్వహించిన ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గ్రామస్థుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న నీటి కొరత సమస్యను ప్రధానంగా ఎంపీ కవిత గారి దృష్టికి తెచ్చారు. స్పందించిన శ్రీమతి కవిత త్వరలోనే అది తీరుస్తానని చెప్పారు. అదె విధంగా బైపాస్ రోడ్ అవసరాన్ని కూడా గ్రామస్తులు కవిత గారి దృష్టికి తెచ్చారు. ఇది ఖర్చుతో కూడుకొన్నది ఐనప్పటికి అధికారులతో మాట్లాడి త్వరగా అది జరిగేలా చూస్తానని శ్రీమతి కవిత అన్నారు. అదే విధంగా గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని శ్రీమతి కవిత ప్రారంభించారు.

నాళేశ్వరం గ్రామంలోని కార్యక్రమంలో భాగంగా గ్రామం మొత్తం పాదయాత్రలో పాల్ఘొన్నారు. ఈ సందర్భంగా అనేక సమస్యల్ని గ్రామస్తులు ఎంపీ శ్రీమతి కవిత గారి దృష్టికి తెచ్చారు. ఇందులో భాగంగా గ్రామ సమస్యలతో పాటు, వ్యక్తిగతంగా అందవలసిన ప్రభుత్వ పథకాల గురించి వారు ఎంపీ గారికి విన్నవించారు. వీటన్నింటిపై చివరలో మాట్లాడిన ఎంపీ కవిత అనేక అంశాలపై ప్రభుత్వ అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి పరిష్కరించారు. వివిధ ప్రభుత్వ పథకాలు, పెన్షన్ల విశయమై వచ్చిన ఫిర్యాదుల విషయమై కూడా అధికారులతో మాట్లాడించారు. గతంతో పోలిస్తే ఇప్పటికి పెరిగిన పెన్షన్ల డబ్బులపై కూడా ప్రజలు శ్రీమతి కవిత వద్ద హర్షం వ్యక్తం చేసారు. జోగినీ పెన్షన్ల పై కొందరు అడిగిన ప్రశ్నలకు జవాబుగా గతంలో జోగినీలను వితంతువుగా పరిగణించి పెన్షన్ ఇచ్చేవారని, అలా కాకుండా జోగినీలకే ప్రత్యక్షంగా పెన్షన్ ఇచ్చేలా తమ ప్రభుత్వం కార్యాచరణ జరుపుతుందని, త్వరలోనే పరిష్కారమవుతుందని శ్రీమతి కవిత తెలిపారు.

నాళేశ్వర్ లో యువకులు స్వచ్చందంగా నిర్వహిస్తున్న గ్రాంథాలయాన్ని పాదయాత్రలో భాగంగా శ్రీమతి కవిత దర్శించారు. చదువుకున్న యువకులు పూనుకుంటే ఊరు బాగుపడడం కష్టం కాదనడానికి ఇది తార్కాణం అన్నారు. ఈ గ్రంథాలయానికి తప్పకుండా నిదులు మంజూరయ్యేలా చూస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. నాళేశ్వర్ లో రాత్రి 9 వరకు జరిగిన కార్యక్రమంలో గ్రామ సమస్యలపై, తీసుకోవాల్సిన చర్యలపై శ్రీమతి కవిత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్దయెత్తున హాజరయ్యారు.

 


Connect with us

Latest Updates