Nizamabad MP

ఏడాది కాలంలో చేసిన పనులు

అందరికి నమస్తే.
తెలంగాణ జాగృతి కవిత గానే తెలిసిన నన్ను నామీద నమ్మకముంచి తెలంగాణ రాష్ట్రం నుండి తొలి మహిళా ఎంపీగా ఎన్నుకొని పార్లమెంటుకు పంపిన ఇందూరు ప్రజలకు ప్రథమంగా కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ తొలి ఎంపీగా నేను ఈ ఏడాది కాలంలో చేసిన పనులు గురించి నన్ను ఎన్నుకున్న మీకు చెప్పవలసిన భాద్యత నా పైన ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైనది.

ఎంపీ గా ప్రథమ వార్షిక ప్రగతి నివేధిక – నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha press meet

 

శ్రీమతి కల్వకుంట్ల కవిత ఎన్నికల హామీలు – కరెంట్ స్టేటస్
——————————————————————

1) నిజామాబాదు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటికై కృషి.

2) పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ రైల్వే లైన్ కు 143 కోట్ల నిధుల కేటాయింపు. ఇది కాక మరో 40 కోట్లు చిన్న కల్వర్టుల మరియు, బ్రిడ్జిల నిర్మాణానికి మంజూరైనవి.

3) నిజామాబాద్ జిల్లా మరియు కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు. ఇందుకై పక్కా ప్రణాళికల అమలు.

తెలంగాణ ఉద్యమానికి మూల కారణమే నీళ్లలో వాటా కోసం. స్వరాష్ట్రంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి సారథ్యంలోని తొలి ప్రభుత్వం మిషన్ కాకతీయ అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు జిల్లాలోని 651 చెరువులను గుర్తించడం జరిగింది. ఇందులో ఇప్పటివరకు 284 మంజూరైనాయి. టెండర్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతలలో భాగంగా ఆయకట్టు అవతలి చివరి గ్రామాలను (బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ లోని గ్రామాలు) మరి కొన్నిటిని కూడా ఆయకట్టులో కలపడం జరిగింది.

4) గల్ఫ్ భాదితుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ. భాదితులకు పునరావాసం, సబ్సిడీ ఋణాలు.

మనం సుష్మాస్వరాజ్ గారిని అనేక సార్లు కలిసిన మీదటే ఈ పని కదిలింది. దీనివల్ల గల్ఫ్ మృతుల వివరాలను ఆన్ లైన్ చేయడం ప్రారంభించబడింది. స్వయంగా విదేశాంగ మంత్రి ప్రతిరోజు ఈ వెబ్ సైట్ ను చూడడం, మృతుల చేరవేతలో జాప్యం ఉన్నట్టైతే విచారించడం జరుగుతుంది. ఇందులో ఉన్న చిన్న చిన్న లోపాల గురించి కూడా మంత్రి గారికి నివేదించడం జరిగింది.

ఇదే కాక అవసరమైన ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అధ్యనం కొనసాగుతుంది. ఇప్పటికి 78 గల్ఫ్ నుండి మృతదేహాలను తెలంగాణ ప్రభుత్వం – ఎన్నారై సెల్ తీసుకువచ్చింది. దీంతో పాటు హెల్ప్ లైన్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.
నా వ్యక్తిగత స్థాయిలో కూడా ఈ ఏడాది కాలంలో గల్ఫ్ లో చనిపోయిన కొందరు జిల్లావాసుల మృతదేహాలను వారి స్వగ్రామాలకు చేర్చడం జరిగింది. భవిష్యత్తులో అసలు దుబాయి లాంటి దేశాలకు వలస వెళ్లే అవసరమే లేని రోజుల కోసం వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కృషి చేస్తాను.

 5) పసుపు బోర్డు ఏర్పాటు. వేల్పూర్ మండలం మోతె లో పసుపు శుద్ది కేంద్రం ఏర్పాటు. ప్రస్తుతం రూ.లు 4000 ఉన్న పసుపు మద్దతు ధరను 10,000కు పెంచేలా కృషి.

ఇది నిజామాబాద్ రూరల్ నుండి జగిత్యాల వరకు ఉన్న పసుపు రైతుల ధీర్ఘ కాల డిమాండ్. పసుపు పంటను ఇంతకాలం జాతీయ స్థాయిలో స్పైసెస్ బోర్డ్ ప్రస్తుతం పర్యవేక్షిస్తుంది. పసుపు ప్రాధాన్యత దృష్ట్యా ప్రత్యేకంగా పసుపు కోసమే బోర్డు ఏర్పాటు చేయాల్ని మన డిమాండ్. ఇప్పటికే అనేకసార్లు కేంద్ర మంత్రి ని కలిసి కోరాం. అదే కాక పార్లమెంటులో బలంగా పసుపు రైతులకోసం గళమెత్తాం. ఇదే విషయమై కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతరామన్ గారిని అనేక సార్లు కలిసి విన్నవించడం జరిగింది. ఇప్పటికి ఇప్పుడు అందులో ఇబ్బందులు ఉన్నాయని వారు తెలియజేసిన మీదట తాత్కాలికంగా ఐనా కనీసం జాతీయ స్థాయిలో ఇప్పటికే ఉన్న స్పైసెస్ బోర్డ్ కు సంబందించిన ఒక యునిట్ ను బాల్కొండ లో ఎర్పాటు చేయాలని కోరి ఒప్పించడమైనది. ఈ యునిట్ వల్ల జిల్లా రైతులకు ప్రత్యక్షంగా లబ్ది చేకూరనుంది. అదే విధంగా పసుపు బోర్డు కోసం ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. పసుపు విరివిగా పండిస్తున్న ఇతర రాష్ట్రాల మద్దతు కూడా తీసుకుంటున్నం. పసుపు బోర్డు కోసం తమిళనాడు ఎంపీల మద్దతు కూడా కూడగడుతున్నాము. ఇందుకు తమిళనాడు సిఎం జయలలిత లేఖ కూడా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. దీంతోపాటు మహారాష్ట్ర అస్సాం ఎంపీల మద్దతు కూడగట్టి కేంద్రం పై ఒత్తిడి పెంచుతాం.

6) ఎర్రజొన్న రైతుల బకాయిల చెల్లింపు

ఇప్పటికే చాలాకాలంగా బాకాయిలుగా ఉన్న 11 కోట్ల పూర్తి మొత్తాన్ని రైతులకు చెల్లించడం జరిగింది.

7) బోధన్ లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరం చేయడానికి కృషి. చెరుకు మద్దతు ధర కు  తోడ్పాటు. ఇందులోభాగంగా గతంలో ఎప్పూడూ లేనటువంటి విధంగా ప్రైవేటు రంగంలో ఉన్న చక్కెర  కార్మాగారాలకు చెరుకు పంపిన రైతులకు కూడా గిట్టుబాటు ధర దక్కాలనే ఉద్దేశంతో టన్నుకు 340 రూ.లను  ప్రభుత్వం రైతులకు చెల్లించింది. ఇది ప్రవేటు కంపెనీ సదరు రైతుకు చెల్లించిన ధరకు అదనం. దీనికి గాను బోధన్  ప్రాంత చెరుకు రైతులకు 3 కోట్ల 80 లక్షలు, కోరుట్ల ప్రాంత చెరుకు రైతులకు 4 కోట్ల 17 లక్షలను ప్రభుత్వం  చెల్లించింది. ఇదే కాకుండా కంపెనీ పరిరక్షనకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు ఇప్పటికే కమిటీ  వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ రాగానే సంస్థను ఆధునీకరించి ప్రభుత్వమే నడుపుతుంది.

 8) బీడి కార్మికులకు అదనపు వెయ్యి రూపాయల భృతి, ఇళ్లు. వైద్య సదుపాయాలు. పర్మనెంటు కార్డులకు కృషి. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఉన్న బీడీ పరిశ్రమ లోని కార్మికులకు అదనపు వెయ్యి రూపాయల భృతి అంశాన్ని గతంలోనే తెరాస అధ్యక్షుల దృష్టికి తీసుకువెళ్లి మ్యానిఫెస్టోలో పెట్టించడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలోని మన ప్రభుత్వం దాన్ని సాకారం చేసింది. ప్రతి నెల నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతినెలా 13 కోట్ల రూపాయలు బీడి కార్మికులకు పెన్షన్ గా అందుతుంది.

 9) ప్రభుత్వ వైద్య కళాశాలకు నిధుల విడుదల, సదుపాయాల కల్పనకు కృషి.

మెడికల్ కాలేజి వారి కోరిక మేరకు 2.3 ఎకరాల స్థలం రోడ్లు మరియు భవనాల శాఖ మరియు అటవీ శాఖనుండి కళాశాలకు మార్పిడీ చేయడం జరిగింది. ఎంసీఐ అనుమతి మంజూరు అయ్యింది.. జిల్లా కేంద్ర ఆసుపత్రి డరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు బదలాయింపు జరిగింది. దీనివల్ల వైద్యుల సంఖ్య చాలా పెరగనుంది. అదేకాక మెడికల్ కాలేజీకి కూడా ఇతర అనుమతుల కోసం ఇది అవసరం. విద్యార్థులకు, ఇటు జిల్లా ప్రజలకు మేలు జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మిగతా మెడికల్ కాలేజీలకన్నా ఎక్కువ నిధులను సాధించాం. ఇప్పటికి 92 కోట్ల రూపాయలను పొందడం జరిగింది. గతంలో లాగా కాకుండా అనుమతులు రాకుండా ఉన్న పరిస్తితి నుండి చాలా సౌకర్యాలు మెరుగు పరిచాం. ఈ సారి ఏంసీఐ అనుమతి సాధించాం.

10) జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బీఈడీ కళాశాల ఏర్పాటుకు కృషి.  యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ కోసం దరఖాస్తు చేయవలసిందిగా యూనివర్సిటీ అధికారులకు సూచించడమైనది.

11) తెలంగాణ యూనివర్సిటీ
చికాగో స్టేట్ యూనివర్సిటి – తెలంగాణ యూనివర్సిటీ మధ్య ఒప్పందం (Memorandum of Understanding [MOU]).  చికాగో స్టేట్ యూనివర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరిపిన నేను తెలంగాణ యూనివర్సిటీ తరపున ఈ ఒప్పందంపై సంతకం చేసాను. ఈ ఒప్పందం ద్వారా రెండు యూనివర్సిటిల మేథోవనరుల్ని, విద్యార్థుల్ని మార్పిడీ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కంప్యూటర్ సైన్స్ మరియు ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్లలో ఇది కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఇరు యూనివర్సిటిల విద్యార్థుల్ని, కరిక్యులంని, ప్రొఫెసర్లనీ, బోధనా పద్దతుల్ని, పరిశొధక విద్యార్థుల్ని రెండు యూనివర్సిటీలు మార్చుకోవచ్చు. ఈ ఒప్పందం వల్ల మన దగ్గర చేరిన విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు రెండో సంవత్సరం చికాగో యూనివర్సిటీలో విద్యను కొనసాగించవచ్చు. అదే విధంగా వారి సిలబస్, బోధనా పద్దతులు, ప్రొఫెసర్లు మనకు అందుబాటులోకి వస్తారు.

ఇంకా యూనివర్సిటీలకు భారీ నిధులు మంజూరు కానందున ఎదురు చూస్తున్నాము. ఒకవేళ అది జరిగితే తెలంగాణ యూనివర్సిటీకి మంచి వాటానే దక్కగలదని భావిస్తున్నను.
ఇతర శాఖల వారీగా మనం సాధించుకున్న భారీ నిధులు
(అనుమతులు మంజూరై జీవో లు వచ్చినవి) (జూన్ 2 నుండి ఇప్పటివరకు)
—————————————————————–

నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో మొత్తంగా చూస్తే

ఎంపీ ల్యాడ్స్
ఆసరా పెన్షన్లు
బీడీ కార్మికుల అదనపు పెన్షన్లు
చేనేత కార్మికుల పెన్షన్లు
కల్లు గీత కార్మికుల పెన్షన్లు
కళ్యాణ లక్ష్మి
షాదీ ముబారక్
అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక చేయూత
పంట నష్టం (ఇన్ పుట్ సబ్సిడీ)
ఎర్రజొన్న రైతులకు పరిహారం
ఆర్ డబ్ల్యూ ఎస్ కింద త్రాగునీటి కి
గోదావరి పుష్కరాలు
మిషన్ కాకతీయ కింద అనుమతులు విడుదల
పంచాయత్ రాజ్ రోడ్లు
ఆర్&బీ రోడ్లు
రుణమాఫీ
నిజామాబాదుకు సిఎం గారి హామీలు

ఆర్మూర్ లోని 30 పడకల దవాఖానాను 100 పడకలుగా మార్చడానికి
లక్ష్మాపూర్ నుండి అంకాపూర్ రోడ్డునిర్మాణం
పాఠశాల విద్య (కొత్త పనులకు)
ఐకేపీ స్వయం సహాయక బృందాలకు
చెరుకు రైతులకు (టన్నుకురూ.లు 340 ప్రభుత్వం అదనపు చెల్లింపు)

కేవలం ఈ విభాగాల్లో మాత్రమే 2571 కోట్లు మంజూరయ్యాయి.

 

 


Connect with us

Latest Updates