Nizamabad MP

దేశం వీడినా మూడు తరాలుగా మలేసియాలో తెలుగు సంస్కృతిని కాపాడుకోవడం అభినందనీయం

 

తెలుగులోని క‌స్తూరి వాస‌న చ‌క్క‌ర పాకం…
ఆర‌వ బాషలోని అమృత రాశి..
క‌న్న‌డంలోని క‌స్తూరి వాస‌న
క‌లిసిపోయే తేట తెలుగునందు అంటారు. అన్నింటిలో క‌లిసిపోయే మంచి గుణాలు తెలుగు భాష‌లో ఉన్నాయి…ఆ గొప్ప‌ద‌నం తెలుగు భాష‌లోనే ఉంది అన్నారు నిజామాబాద్ ఎంపి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

Kalvakuntla-Kavitha-addressed-in-Ugadi-Open-House-in-Malaysia

శ‌నివారం మ‌లేసియాలోని కౌలాలంపూర్ లో మ‌లేసియా తెలుగు సంఘం ఉగాది సంబురాలను ఘ‌నంగా నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌యిన ఆమె తెలుగు భాష గొప్ప‌త‌నాన్ని, విశిష్ట‌త‌ను ఇలా క‌విత రూపంలో వినిపించారు. మ‌లేసియాలో ఉన్న తెలుగు వారంద‌రికీ దుర్మిఖి నామ సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు.తెలిపారు. సంపూర్ణ సుఖ సంతోషాలు క‌ల‌గాల‌ని క‌విత ఆకాంక్షించారు.
ఉగాది ఉంటే ఒక యుగాన్ని ప్రారంబించిన రోజుగా…బ్ర‌హ్మ దేవుడు సృష్టిని ప్రారంభించిన ప‌విత్ర‌మైన రోజు అని చెప్పారు. ప్ర‌పంచంలో
మ‌న తెలుగు వాళ్లు ఎక్క‌డ ఉన్నా ఉగాది పండుగ రోజు రెండు విష‌యాల‌ను మ‌ర‌చిపోర‌న్నారు. ఉగాది ప‌చ్చ‌డిని త‌యారు చేసి..ఆ పచ్చ‌డిని ప్ర‌సాదంగా స్వీక‌రించ‌డం మొద‌టి విష‌యం కాగా , మ‌న భ‌విష్య‌త్తు, దేశ భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు పంచాంగ ప‌ఠ‌నం చేయ‌డం రెండోది అన్నారు. జీవితంలో అన్ని ర‌కాల అంశాల‌ను బిడ్డ‌ల‌కు చెప్పేందుకు ఉగాది పండుగ‌ను ఉప‌యోగించుకుంటార‌ని క‌విత వివ‌రించారు.
మ‌లేసియాలో ఏ కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా…ముందు నుంచి ఉన్న తెలుగు వారితో పాటు .గ‌త 15 ఏళ్లుగా చాలా మంది వ‌చ్చిన వారినీ క‌లుపుకుపోవాల‌ని క‌విత కోరారు. వారు ఇక్క‌డికి వ‌చ్చాక అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కుంటున్నార‌ని చెప్పారు. మ‌లేసియాలో తెలుగు కార్మికుల వారి స్థితిగ‌తుల‌ను అధ్య‌య‌నం చేసేందుకు హోం మంత్రి ఇక్క‌డికి వ‌చ్చార‌ని వారికి బ‌రోసా ఇచ్చారు. తెలుగు రాప్ర్టం విడిపోయినా…రెండు రాస్ట్రాల‌లో విజ‌న్ ఉన్న ముఖ్య‌మంత్రులు ఉన్నార‌ని, వారి స‌హ‌కారంతో తెలుగు త‌నాన్ని కాపాడుకుందామ‌న్నారు. మ‌లేసియా ప్ర‌భుత్వం చొర‌వ చూపి తెలుగు వారి పండుగ‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌డం చారిత్రాత్మ‌కం అన్నారు. మ‌లేసియా ప్ర‌దానికి ద‌న్య‌వాదాలు తెలిపారు.

తెలుగు సినిమాల్లో విలువ‌లు ప‌డిపోతున్నాయ‌ని, ఇంగ్లీష్ ప‌దాలు ఎక్కువ‌గా వాడుతున్నార‌ని ఆవేద‌న చెందుతుంటాన‌న్నారు. కాని మ‌లేసియాలోని తెలుగు వారు తెలుగు సినిమాల‌ను చూసి తెలుగుభా|ష‌ను నేర్చుకుంటుండ‌టం నిజంగా గ‌ర్వ‌కార‌ణం అంటూ, తెలుగు సినిమాలు వ‌ర్దిల్లాలి అన్నారు.

మలేసియాలో తెలుగు వారి స్తితి గ‌తులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నా…150 ఏల్ల కింద వ‌చ్చిన వారు చ‌దువుకున్న వారు కాని డ‌బ్బు తెచ్చుకున్న వారు కాని కాదన్నారు. ఎవ‌రికి వారు చిన్న‌ సంఘాలు పెట్టుకుని, భజ‌న‌లు,కీర్త‌న‌లు చెప్పుకుని , పాట‌లు పాడుకుంటూ, బ‌డులు పెట్టుకుని, మ‌న బాష‌ను బ‌తికించుకున్నాని క‌విత పొడిగారు. తెలుగు ఆడ‌ప‌చుల‌కు శిర‌సు వంచి న‌మ‌స్క‌రించిన క‌విత మ‌గ‌వాళ్లు ప‌నుల‌కు వెళ్లినా… చిన్న గుడారాల‌లో బిడ్డ‌ల‌ను పెంచి పెద్ద‌చేయ‌డం మామూలు విస‌యం కాదు. క‌రెంటు లేదు. హాస్పిట‌ల్స్ లేవు..రోడ్డు సౌక‌ర్యమూ లేని రోజుల్లో పిల్ల‌ల‌ను పెంచి పెద్దచేశార‌ని స‌మావేశానికి వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌లేసియా ప్ర‌దాని ద‌తో శ్రీ మ‌హ్మ‌ద్ న‌జీబ్ తున్ హ‌జీ అబ్దుల్ ర‌జాక్, మండ‌లి బుద్ద ప్ర‌సాద్, సుధాక‌ర‌న్, మ‌లేసియా తెలుగు సంఘం అధ్య‌క్షుడు డాక్ట‌ర్ అచ్చెయ్య ప్ర‌సాద్ రావు , వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేట‌ర్ దాస్యం విజ‌య‌భాస్క‌ర్, , వి. బాలాజీ సింగ్, ఎంఎస్ ఐఎప్ టి రాస్ట్ర అధ్య‌క్షుడు ర‌హీం పాల్గొన్నారు.


Connect with us

Latest Updates