Nizamabad MP

చిత్తశుద్ధితో పనిచేస్తాం

-మన ఊరు-మన ఎంపీలో ఎంపీ కవిత
-సారంగాపూర్, జగిత్యాల, రాయికల్ మండలాల్లో ముగిసిన పాదయాత్ర
మన ఊరు- మన ఎంపీ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన ప్రతి దరఖాస్తుకూ పరిష్కారం చూపడమే తమ ధ్యేయమనీ, ప్రతి సమస్యకూ 90రోజుల వ్యవధిలో పరిష్కార మార్గం చూపుతామని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నాలుగో రోజు గురువారం సారంగాపూర్ మండలం బీర్‌పూర్, నర్సింహులపల్లి, తుంగూరు, కండ్లపల్లి, జగిత్యాల మండలం చెల్‌గల్, రాయికల్ మండలం అలూరు, ధర్మాజిపేట, తాట్లవాయి, వస్తాపూర్, రామాజీపేట, రాయికల్‌లో ఆమె పాదయాత్ర చేశారు. బుధవారం రాత్రి సారంగాపూర్ మండలం బీర్‌పూర్ చేరుకున్న ఆమె గురువారం ఉదయం లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించారు.

Kalvakuntla Kavita visit to Jagtial Constituency as part of Mana Ooru Mana MP programme (5)

బీర్‌పూర్ అనుబంధ గ్రామమైన నాయకపుగూడెం గిరిజన తండాకు ఆమె చేరుకోగా, గిరిజనులు సంప్రదాయ పద్ధతిలో గుస్సాడీ నృత్యంతో స్వాగతం పలికారు. పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి కవిత నృత్యం చేశారు. అనంతరం బీర్‌పూర్ చేరుకున్న ఎంపీ కవిత సింగిల్ విండో గోదాంకు భూమిపూజ చేశారు. అనంతరం జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. నర్సింహులపల్లిలో టీఆర్‌ఎస్ పతాకాన్ని ఆవిష్కరించారు. మహిళలతో ముచ్చటించి, వారినుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం తుంగూర్ చేరుకుని జిల్లా పరిషత్ పాఠశాలను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాల సమస్యలను విద్యార్థులనడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం తయారీని పరిశీలించి, సన్న బియ్యం వినియోగిస్తున్నారా? లేదా? అని ఆరా తీశారు. ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడి, భోజనానికి వినియోగిస్తున్న బియ్యాన్ని పరిశీలించారు. మరుగుదొడ్డి సౌకర్యంపైనా అడిగి తెలుసుకున్నారు. అదనపు తరగతి గదిని ప్రారంభించారు. గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

రోళ్లవాగును ఆధునీకరిస్తాం..
తుంగూరు చేరుకున్న ఎంపీ కవితకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు, మహిళలు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. మహిళలు, యువకులు, విద్యార్థులతో కలిసి కవిత గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. సమస్యల పరిశీలన అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలోని జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలో ఏర్పా టు చేసిన సభలో పాల్గొన్నారు. ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, ఇద్దరు రైతులు తమ సమస్యలను సభా ముఖంగా తెలియజేయాలనీ, సొంత సమస్యలతో పాటు, గ్రామ సమస్యలను కూడా ప్రస్తావించాలని సూచించారు. పిప్పళ్ల రాధ మాట్లాడుతూ, సాగునీరు లేక గ్రామంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్ర చెరువుకు నీరు రాకపోవడంతో పంటపొలాలు బీళ్లుగా మారాయనీ, పదేళ్లుగా ఎవరు పట్టించుకోవడం విన్నవించారు.

పంటల కోసం చేసిన అప్పులు అలాగే ఉన్నాయనీ, ఎలా బతకాలో తెలియడం లేదని వాపోయారు. రైతులు మాట్లాడుతూ, రోళ్ల వాగు నుంచి ఎర్ర చెరువుకు గతంలో ఫీడర్ చానల్‌గా కాలువ ఉండేదనీ, గత పాలకుల పట్టింపు లేనితనంతో ఆనవాళ్లు కోల్పోయిందనీ, దీంతో ఎర్రచెరువు నిండడం గగనంగా మారిందన్నారు. ఎస్సీ కాలనీకి చెందిన మహిళ మాట్లాడు తూ కాలనీలో రోడ్లు, మురుగు కాలువలు లేవని వాపోయింది. మహిళ సంఘం అధ్యక్షురాలు మాట్లాడుతూ, గ్రామంలో 60 దాకా మహిళా సంఘాలున్నాయనీ, సమావేశాల కోసం భవనం లేక ఇబ్బందులు పడుతున్నామనీ, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. పాఠశాలల్లో సరైన గదులు లేవనీ, మైదానం లేకక్రీడల్లో రాణించలేకపోతున్నామనీ, వర్షం కురిస్తే పాఠశాలకు వెళ్లే రోడ్లు బురదమయంగా మారుతున్నాయని విద్యార్థులు తెలియజేశారు. బండారి తిరుపతి మాట్లాడుతూ గ్రామంలో తాగేందుకు నీరు లేని పరిస్థితి ఉందన్నారు. గ్రామ శివారులో ఆలయానికి వెళ్లేందుకు రోడ్డు సరిగా లేదని పేర్కొన్నారు. పలువురు మహిళలు తమకు పింఛన్లు రా వడం లేదనీ, ఇళ్లు లేక ఇబ్బందిపడుతున్నామని పేర్కొన్నారు. అనంతరం కవిత స్పందిస్తూ టీఆర్‌ఎస్‌ది చేతల ప్రభుత్వమనీ, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే మనఊరు – మన ఎంపీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఇచ్చిన ప్రతి దరఖాస్తుకూ పరిష్కారం చూపుతామనీ, మూడు నెలల వ్యవధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సారంగాపూర్, ధర్మపురి మండలాలకు వర ప్రదాయిని లాంటి రోళ్లవాగు ఆధునీకరణ జరిగితే సాగు, తాగునీటి సమస్య పరిష్కా రమవుతుందన్నారు.

త్వరలోనే ఆధునీకరణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని రెండు టీఎంసీలకు పెంచుతామన్నారు. ఎర్రవాగుకు రోళ్లవాగు ప్రాజెక్టు నుంచి గతంలో ఉన్న ఫీడర్ చానల్‌ను పునరుద్ధరించేందుకు ప్రణాళికలు రూపొందించి, ప్రతిపాదించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థులకు కోడిగుడ్లు పెట్టడం లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందనీ, గ్రామస్తులు బాధ్యతా యుతంగా వ్యవహరించి ఈ విషయంపై పరిశీలన జరపాలన్నారు. ఆరోగ్య కేంద్రం, మహిళ సంఘ భవన నిర్మాణానికి స్థలం చూపెడితే నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. పంచాయతీ భవనానికి కూడా నిధులు వచ్చేలా చూస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఒడ్డెర కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం, మురుగు కాలువల నిర్మాణానికి సీఎం నుంచి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తామని చెప్పారు. బీర్‌పూర్ నుంచి దొంతాపూర్ దాకా రహదారి నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. బీడీ, వృద్ధాప్య, వితంతు పింఛన్లు అర్హులందరికీ అందేలా చూ స్తానని స్పష్టం చేశారు.

ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఎంపీ కవిత అన్నారు. సారంగాపూర్ మండలంలో కార్యక్రమాన్ని ముగించిన అనంతరం గురువారం రాత్రి రాయికల్ మండలానికి చేరుకున్నారు. ఆమెకు ఆలూరు క్రాస్ రోడ్డు వద్ద కార్యకర్తలు, మహిళలు, యువకులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో రూ. 30 లక్షలతో ఆర్‌ఎస్‌ఎం పథకం కింద నిర్మించిన అదనపు తరగతి గదులను ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు కీలక పాత్ర పోషించారనీ, ఉద్యోగులతో ఎప్పుడూ ప్ర భుత్వం స్నేహపూర్వకంగా ఉంటుందని చెప్పారు. విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులను కల్పిస్తుందన్నారు. అనంతరం వీరాపూర్‌లో మహిళలతో మాట్లాడారు. పలువురు మహిళలు ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం తాట్లవాయికి చేరుకుని అనుబంధ తండా అయిన శివనాయక్ తండాలో పాదయాత్ర చేశారు. వృద్ధులతో ముచ్చటించారు. మురుగు కాలువలు ఇబ్బందికరంగా ఉన్నాయనీ, పింఛన్లు రావడం లేదని పలువురు పేర్కొనడంతో వెంటనే వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తాట్లవాయిలో పాదయాత్ర చేసి పాఠశాల ఆవరణలో సభ నిర్వహించారు.

వలసలు అరికట్టడమే ధ్యేయం పనుల్లేక గల్ఫ్ దేశాలకు వలస వెళ్లకుండా అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యమని కవిత అన్నారు. తాట్లవాయిలో గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో నిర్వహించిన సభలో ఆమె మాట్లా డారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తా ట్లవాయి సర్పంచ్ మహేశ్ మాట్లాడుతూ, తమ గ్రామంతో పాటు, ఐదు తండాలు, ఓ అనుబంధ గ్రామం ఉందనీ, ఇక్కడ తీవ్రమైన లోవోల్టోజీ సమస్యతో సతమతమవుతున్నామని పేర్కొన్నారు. గుట్టపై ఉన్న రామాలయానికి రోడ్డు సౌకర్యం లేదని తెలిపారు. ఆరోగ్య ఉప కేంద్రం మంజూరు చేయాలని కోరారు. తండాలకు గ్రామాల నుంచి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదనీ, మంచినీటి సౌకర్యం లేదని మొరపెట్టుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ 60 ఏళ్లుగా తెలంగాణ పల్లెల్లో అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయనీ వాటిని పరిష్కరించేందుకే ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని గుర్తు చేశారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడం బాధకరమనీ, దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాటర్‌గ్రిడ్ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. త్వరలోనే కోరుట్ల నియోజకవర్గంలోని డబ్బా గ్రామం నుంచి ప్రతి పల్లెకూ తాగునీటి సౌకర్యం కలగుతుందని భరోసా ఇచ్చారు. ఇన్నాళ్లూ వట్టిపోయిన చెరువులకు తిరిగి జలకళ తెప్పించేందుకే మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించామన్నారు. ఐదేళ్లలో అన్ని చెరువులనూ పునరుద్ధరిస్తామన్నారు. వచ్చే మూడేళ్లలో తెలంగాణను మిగులు విద్యుత్ గల రాష్ట్రంగా మార్చేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. అసలు వలసలే లేని ప్రాంతంగా జిల్లాలను మార్చడమే తమ ధ్యేయమన్నారు. ఎంపీగా ఎన్నికైన అనంతరం ఈ పద్నాలుగు మా సాల కాలంలో కేంద్రంలో ప్రతి మంత్రినీ కలిసి నియోజకవర్గానికి నిధులు, పనులు తెచ్చేందుకు కృషి చేస్తున్నాననీ, తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రధానమంత్రి సడక్ యోజన పథకాన్ని వినియోగించుకుంటామనీ, త్వరలోనే తం డాలకు ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. రమేశ్ అనే అంధుడు ఎంపీని కలిసి కిరాణం దుకాణంతో జీవితం గడుపుతున్నానీ, సరకులు కొనుగోలు చేసుకునేందుకు రుణం ఇప్పించాలని కోరగా ఎంపీ తప్పకుండా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

వస్తాపూర్ నుంచి కట్కాపూర్ దాకా రూ. 1.84 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం మొక్కలు నాటారు. రాయికల్ మండల కేంద్రంలో మార్కెట్‌యార్డులో రూ.1.50 కోట్లతో 2500 మెట్రిక్ టన్నుల గోదాం పనులకు భూమి పూజ చేశారు. ఒడ్డెలింగాపూర్‌లో ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం రాయికల్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి, మాజీ మంత్రి రాజేశం గౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే శికారి విశ్వనాథం, పార్టీ మండలాధ్యక్షుడు ముక్క వెంకటేశ్ యాదవ్, బీర్‌ఫూర్ సింగిల్ విండో చైర్మన్ ముప్పాల రాంచందర్ రావు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అనిత, నీరజ, లావణ్య రాథోడ్, జగన్, తాటి లక్ష్మి, మంజుల, ఆనం ద్, బైరి మల్లేశ్, చెరుకూరి నీరజ, ముక్క సుగుణ, ముక్క శంకర్, నాయకులు గర్శకుర్తి రమేశ్, సుభాష్, నర్సయ్య, ఎంపీడీవో మల్హోత్రా, తహసీల్దార్ రమేశ్ బాబు, రాయికల్ ఎంపీపీ పడాల పూర్ణిమ, జడ్పీటీసీ గోపి మాధవి, టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మోర హన్మాండ్లు, జాగృతి నాయకులు, కార్యకర్తలు ఆయా శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates