Nizamabad MP

చెరుకు రైతులకు అండగా ఉంటాం

చెక్కర కర్మాగారం పునరుద్ధరణపై వారంలో నిర్ణ‌యం
- నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత
చెరుకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.. నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల‌కు చెందిన చెరుకు రైతులతో బుధవారం హైదరాబాద్‌లో ఆమె సమావేశమయ్యారు. చెరుకు సాగు విస్తీర్ణం, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చెక్కర కర్మాగారాలు మూతపడి రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు.

kalvakuntla-kavitha-meet-with-sugracane-farmers

టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చ‌క్కెర క‌ర్మాగారాలు, రైతుల బకాయిలపై దృష్టి సారించిందని తెలిపారు. బ‌కాయిల‌ను విడుదల చేసి రైతులను ఆదుకున్న విష‌యం మీకంద‌రికీ తెలుసు అన్నారు. మూత పడిన చెక్కర కర్మాగారాలు తెరిపించేందుకు ప్రభుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని, రైతుల భాగసామ్యంతో నడిపిస్తే బాగుంటుందన్నారు.. రైతులు సహకార సంఘంగా ఏర్పడి చెక్కర ప్యాక్టరీలు నడిపించేందుకు ముందుకు వస్తే ప్ర‌భుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని క‌విత వివ‌రించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ప్యాక్టరీ నడిపించే విషయమై రైతులు ఆలోచించుకోవాలని కోరారు. రైతులు ఏ నిర్ణయం తీసుకున్నా.. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందన్నారు. రైతులకు ఇబ్బంది కలుగకూడదనే అన్ని విధాల ఆలోచిస్తున్నామన్నామ‌ని, ఇక్కడ ఉత్పత్తయ్యే చెక్కరను తెలంగాణ ప్రాంతంలోని రేషన్‌ దుకాణాల ద్వారా వినియోగదారులకు అందించే ఏర్పాటు చేస్తమన్నారు. దీని ద్వారా చెరుకు సాగు విస్తీర్ణం పెరిగి రైతులకు లాభం జరుగుతుందని కవిత అన్నారు.. మరోసారి సమావేశమై అన్ని విషయాలు చర్చించుకుందామ‌ని, అవ‌స‌ర‌మ‌యితే ముఖ్యమంత్రిని కలుద్దామన్నారు. స‌మావేశంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు , టిఆర్ఎస్ నిజమాబాద్‌ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి,చెరుకు రైతు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.


Connect with us

Latest Updates