Nizamabad MP

బ్రాహ్మ‌ణుల స‌మాజ సేవ గొప్ప‌ది

బ్రాహ్మ‌ణ కార్తీక వ‌న‌స‌మారాధనోత్స‌వాల్లో ఎంపి క‌విత‌

బ్రాహ్మ‌ణుల స‌మాజ సేవ గొప్ప‌ద‌న్నారు నిజామాబాద్ ఎంపి శ్రీమతి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివారం బాచుప‌ల్లిలోని కొల‌ను హ‌న్మంత‌రెడ్డి గార్డెన్‌లో బ్రాహ్మ‌ణ సేవా సంఘం నిర్వ‌హించిన కార్తీక వ‌న‌స‌మారాధ‌నోత్స‌వాలు ఘ‌నంగా జ‌రిగాయి.

kalvakuntla-kavitha-takes-part-in-bhramana-meeting

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌యిన ఆమె మాట్లాడుతూ మ‌న దేశంలో సంస్కృతి, సంప్ర‌దాయాలు కొన‌సాగ‌డానికి బ్రాహ్మ‌ణులే కార‌ణ‌మ‌న్నారు. భ‌గ‌వంతునికి భ‌క్తునికి అనుసంధానం చేసే బ్రాహ్మ‌ణుల్లో క‌డుపేద‌లు కూడా ఉన్నార‌న్నారు. వారి అభివృద్ధికి సిఎం కేసిఆర్ కృషి చేస్తున్నార‌ని తెలిపారు. బ్రాహ్మ‌ణుల కోసం రూ. 100 కోట్లను బ‌డ్జెట్ లో కేటాయించిన ఘ‌న‌త టిఆర్ఎస్ ప్ర‌భుత్వానిదేన్నారు. బ్రాహ్మ‌ణుల‌కు త‌మ కుటుంబానికి విడ‌దీయ‌రాని అనుబంధం ఉంద‌న్నారు. 1985లో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడే కేసిఆర్ గారు సిద్దిపేట‌లో బ్రాహ్మ‌ణ క‌మ్యూనిటీ హాల్‌ను నిర్మించార‌ని క‌విత తెలిపారు. హైద‌రాబాద్‌లో బ్రాహ్మ‌ణ స‌ద‌న్ నిర్మాణానికి స్థ‌ల సేక‌ర‌ణ జ‌రుగుతున్న‌ద‌ని చెప్పారు. అక్క‌డే బ్రాహ్మ‌ణ విద్యార్థుల‌కు హాస్ట‌ల్ సౌక‌ర్యం కూడా ఏర్పాటు చేస్తార‌ని తెలిపారు. దేశంలోని పీఠాధిప‌తులు, పండితులు హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ప్పుడు బ్రాహ్మ‌ణ స‌ద‌న్‌లో బ‌స చేసేలా సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. బ్రాహ్మ‌ణ విద్యార్థులు విదేశీ విద్య‌న‌భ్య‌సించేందుకు టిఆర్ఎస్ ప్ర‌భుత్వం స్కాల‌ర్‌షిప్ సౌక‌ర్యాన్ని కూడా ఏర్పాటు చేయ‌నుంద‌ని చెప్పారు క‌విత‌. బ్రాహ్మ‌ణుల‌కు రాజకీయపరంగా ఇప్పటికే ప్రాధాన్యం ఇచ్చామని గుర్తు చేశారు. బ్రాహ్మణులకు ఇస్తున్న ప్రాధాన్యమే అన్ని మతాల వారికి ఉంటుందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపి మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యేలు అరిక‌పూడి గాంధీ, కెపి వివేకానంద‌, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, రామచంద్రయ్య, డిల్లీలో ప్ర‌భుత్వ ప్ర‌తినిధి సముద్రాల వేణుగోపాలచారి, టిఆర్ఎస్ గ్రేటర్‌ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు, సర్పంచి ఆగం పాండు, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఐవీఆర్‌ కృష్ణారావు, సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్‌రావు, ఎం.వి.శాస్త్రి, సోమయాజులు, మల్లాది శాస్త్రి, గీతామూర్తి తదితరులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates