Nizamabad MP

భార‌త్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆస్తుల ర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు

ఈసి స‌మావేశంలో ఎంపి క‌విత‌
జిల్లాల్లో ఉన్న‌  ఆస్తుల‌ను ప‌రిర‌క్షించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌నుంది భార‌త్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర సంఘం. వ‌నివారం హైద‌రాబాద్‌లోని సంఘం ప్ర‌ధాన కార్యాల‌యంలో ఈసీ స‌మావేశం జ‌రిగింది. భార‌త్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర ఛీఫ్ క‌మిష‌న‌ర్, ఎంపి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.
Kalvakuntla-Kavitha-in-Ececutive-Committee-meeting-of-Bharath-Scouts-&-Guides01
వివిధ జిల్లాల నుంచి బాధ్యులు త‌మ రిపోర్టును చ‌దివి వినిపించారు. భార‌త్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ను బ‌లోపేతం చేసేందుకు తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌ను చ‌ర్చించారు. ఆస్తుల రక్ష‌ణ‌కు క‌మిటీలు వేయాల‌ని నిర్ణ‌యించారు.ప‌రిపాల‌న సౌల‌భ్యం కూడా ఈ క‌మిటీల నియామ‌కం వల్ల క‌లుగుతుంద‌ని స‌భ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు. స‌మావేశంలో బిఎస్జి రాష్ట్ర కార్య‌ద‌ర్శి చంద్ర‌శేఖ‌ర్‌, కోశాధికారి ఎం. రాజ‌గోపాల్, స్కౌట్స్ రాష్ట్ర ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ ప‌ర‌మేశ్వ‌ర్, స్కౌట్స్ విభాగం ట్ర‌యినింగ్ క‌మిష‌న‌ర్ భ‌గ‌వంత‌రావు, గైడ్స్ విభాగం ట్ర‌యినింగ్ క‌మిష‌న‌ర్ ఎ. సుగుణా రాజేంద్రం, అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ ఈ. జాన్ సామ్యూయేల్‌ పాల్గొన్నారు.

Connect with us

Latest Updates