Nizamabad MP

బీడీ కట్తలమిధ పుర్రె గుర్తులోద్ద్జు

-లోక్‌సభలో ఎంపీ కవిత ఆరోగ్యమంత్రికి వినతిపత్రం
బీడీ కట్టల మీద కూడా పుర్రె గుర్తు ముద్రించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ద్వారా లక్షలాదిమంది బీడీ కార్మికుల జీవనోపాధి దెబ్బతింటుందని టీఆర్‌ఎస్ ఎంపీ కే కవిత ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ నుంచి బీడీలను మినహాయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో మంగళవారం జీరో అవర్‌లో ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో అనేక గ్రామాల్లో బీడీల తయారీ కుటీర పరిశ్రమగా కొనసాగుతున్నదని, లక్షల మంది మహిళా కార్మికులు ఈ పరిశ్రమపై ఆధారపడి కుటుంబాలను నెట్టుకొస్తున్నారని తెలిపారు. సిగరెట్లను, బీడీలను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఒకే గాటన కట్టిందని అన్నారు. లక్షల మంది మహిళల ఉపాధిని దృష్టిలో పెట్టుకొని ఈ నోటిఫికేషన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

Kavitha Kalvakuntla addressing in Loksabha

ఆరోగ్యమంత్రికి విజ్ఞాపనపత్రం:
బీడీ కట్టలపై పుర్రె గుర్తును ముద్రించకుండా మినహాయింపునివ్వాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు ఎంపీ కవిత వినతిపత్రాన్ని అందజేశారు. ఆరోగ్య శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రధానంగా సిగరెట్, గుట్కా ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకుని చేసిందని, కానీ బీడీ పరిశ్రమను భిన్నమైన కోణం నుంచి చూడాలని కవిత కోరారు. కేంద్ర కార్మిక శాఖ లెక్కల ప్రకారమే సుమారు 53 లక్షల మంది కార్మికులు బీడీ పరిశ్రమలో పని చేస్తున్నారని, లెక్కల్లోకి రాని వారు మరో 30 లక్షలు ఉంటారని తెలిపారు. తెలంగాణలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులున్నారని తెలిపారు. ఎక్కువగా మహిళలు బీడీలుచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే రాత్రికి రాత్రే నకిలీ సంస్థలు పుట్టుకొచ్చి దీనిపై ఆధారపడి బతుకుతున్న నిజమైన కూలీలకు ఉపాధి లేకుండా చేసే పరిస్థితులు కూడా ఉత్పన్నం కావచ్చని హెచ్చరించారు. ఈ పరిశ్రమపై పరోక్షంగా పొగాకు పండించే రైతులు, రవాణా కార్మికులు, కూలీలు, పాన్ దుకాణాలవారు, చిల్లర వర్తకులు, హోల్‌సేల్ వ్యాపారులు, మొత్తంగా కోటి మంది వరకు ఉపాధి పొందుతున్నారని ఆమె గుర్తు చేశారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొన్న అంశాన్ని కూడా కవిత తన వినతిపత్రంలో ప్రస్తావించారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ కారణంగా వినియోగం కూడా తగ్గుతోందని, అయితే ఈ ప్రభావం బీడీ పరిశ్రమపై పడుతోంది కాబట్టి దీనిలో పనిచేసే కార్మికులకు జీవనోపాధి దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉన్నదని ఆమె పేర్కొన్నారు.


Connect with us

Latest Updates