Nizamabad MP

బంగారు తెలంగాణ‌లో జ‌గిత్యాల జిల్లా ఆద‌ర్శంగా నిల‌వాలి

బీర్‌పూర్‌లో ఎంపి క‌విత‌

బంగారు తెలంగాణ‌లో కొత్త‌గా ఏర్ప‌డిన జ‌గిత్యాల జిల్లా ఆద‌ర్శంగా నిలవాల‌ని ఆకాంక్షించారు నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. బుధ‌వారం జ‌గిత్యాల జిల్లాలో ఆమె ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా బీర్‌పూర్ మండ‌లంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆమె మాట్లాడుతూ జ‌న‌వ‌రి 26 వ‌ర‌కు బాత్రూం లేని ఇల్లు ఉండ‌వ‌ద్ద‌నే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప‌నిచేస్తున్న‌ద‌న్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ 36 గంట‌ల్లో 820 టాయిలెట్ల‌ను నిర్మిస్తున్నారని క‌విత ప్ర‌శంసించారు.

mp-kalvakuntla-kavitha-visit-to-birpur-mandal-of-jagtial-distric-01t

డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు కోసం ఎదురు చూస్తున్నార‌ని, ఇళ్ల నిర్మాణంలో కొన్ని సమ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వ‌డం వ‌ల్ల అనుకున్నంత వేగంగా నిర్మాణం పూర్త‌వ‌డం లేద‌న్నారు. అర్హులంద‌రికీ డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు వ‌స్తాయ‌న్నారు.ఈ విష‌యంలో భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌న్నారు. గ‌తంలో ప్ర‌భుత్వం ఇచ్చే ఇండ్లు ఎవ‌రికి వ‌స్త‌యో తెలిసేది కాదన్నారు. కాని ఇప్పుడు గ్రామంలో మీటింగ్ పెట్టి…ద‌ర‌ఖాస్తులు తీసుకుంటున్న తీరు ఇండ్లు వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం క‌లిగించిందని చాలా మంది త‌న‌తో చెప్పార‌ని క‌విత తెలిపారు. ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూమిని కొనుగోలు చేస్తున్నామ‌ని, బీర్‌పూర్‌లో కూడా ఆ కార్య‌క్ర‌మం సాగుతున్న‌ద‌ని చెప్పారు. విదేశాల్లో ఉన్న‌ బీర్‌పూర్ గ్రామ‌స్తులు వారి భూమిని ఇచ్చేందుకు ముందుకు వ‌స్తే లాండ్ ప‌ర్చేస్ స్కీం కింద ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌డ్పీ ఛైర్మ‌న్ తుల ఉమ‌, జ‌గిత్యాల నియోజ‌క వ‌ర్గ టిఆర్ ఎస్ ఇంఛార్జి డాక్ట‌ర్ సంజ‌య్ కుమార్ తో పాటు ప‌లువురు స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates