Nizamabad MP

బాలిక‌లు చ‌దువుతో పాటు క్రీడ‌ల్లోనూ రాణించాలి

సాంఘిక సంక్షేమ ఆశ్ర‌మ విద్యాసంస్థ‌ల ఒలింపిక్స్ ప్రారంభ స‌మావేశంలో ఎంపి క‌విత‌

చ‌దువుతో పాటు క్రీడ‌ల్లోనూ బాలికలు రాణించాల‌ని ఆకాంక్షిచారు నిజామాబాద్ ఎంపి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివారం మేడ్చల్ జిల్లా కిష్టాపూర్‌లోని సాంఘిక సంక్షేమ ఆశ్ర‌మ పాఠ‌శాల‌, కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు జ‌రిగే ఆశ్ర‌మ పాఠ‌శాల‌ల గేమ్స్‌, స్పోర్ట్స్ మీట్ ప్రారంభ స‌మావేశానికి ఆమె హాజరై క్రీడాజ్యోతిని వెలిగించారు. ర‌వాణా మంత్రి పి.మ‌హేంద‌ర్ రెడ్డితో క‌లిసి క‌విత బెలూన్ల‌ను గాలిలోకి వ‌దిలి లాంచ‌నంగా ఒలింపిక్స్‌ను ప్రారంభించారు. అంతకు మందు క్రీడాకారుల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు.

kalvakuntla-kavitha-launched-social-welfare-shcool-olympic-games

ఈ సంద‌ర్భంగా బాలిక‌లు బ‌తుక‌మ్మ ఆటా-పాట‌కు ఆక‌ట్టుకుంది. ఎంపి క‌విత వేదిక‌పై నుంచి దిగి బాలిక‌ల‌తో క‌లిసి బ‌తుక‌మ్మ ఆడారు. అనంత‌రం క‌విత మాట్లాడుతూ బాలిక‌లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆశ్ర‌మ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో చ‌దువుతున్న బాలిక‌లు ఒలింపిక్ పోటీల కోసం ఇక్క‌డకు రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని అధిరోహించిన మాలోత్ పూర్ణ‌ను ఆద‌ర్శంగా ప్ర‌తి బాలిక తీసుకో్వాల‌న్నారు. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు చ‌దువు ఒక్క‌టే చాల‌నుకునే ఆల‌చోన నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని కోరారు. డాక్ట‌ర్ ఆర్‌.ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సాంఘిక సంక్షేమ ఆశ్ర‌మ విద్యాసంస్థ‌ల సొసైటీ కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందుతున్న‌ద‌ని క‌విత ప్ర‌శంసించారు.ఆశ్ర‌మ కాలేజీలలో చ‌దివిన 40 మంది విద్యార్థులు ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకులు సాధించి మెడిసిన్‌లో చేరడం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ప్ర‌వీణ్ కుమార్ చూపే చొర‌వ‌, అంకిత భావంతో సాంఘిక సంక్షేమ విద్యాసంస్థ‌ల బ‌లోపేత‌మ‌వుతున్నాయ‌ని ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు గారు గ‌తేడాది 600 కోట్లున్న బ‌డ్జెట్‌ను ఈ ఏడాది 1300 కోట్ల‌కు పెంచార‌ని క‌విత చెప్పారు. ప‌దేళ్ల త‌ర‌వాత సాంఘిక సంక్షేమ హాస్ట‌ల్స్ అంటూ విడిగా ఉండ‌ని వ్య‌వ‌స్థ ఏర్పాటుకావాల‌న్నారు. అంద‌రూ క‌ల‌సి చ‌దువుకునే విధంగా ఏర్పాట్లు ఉండాల‌న్నారు. పేద కుటుంబాల‌పై భారం ప‌డ‌కుండా సిఎం కేసిఆర్ క‌ల్పిస్తున్న అవ‌కాశాల‌ను ప్ర‌తి త‌ల్లిదండ్రి ఉప‌యోగించుకుని బాలిక‌ల‌ను ఉన్న‌త చ‌ద‌వులు చ‌దివించాల‌ని కోరారు. తెలంగాణ క్రీడాపాల‌సీ స‌త్ఫ‌లితాల‌ను ఇస్తున్న‌ద‌న్నారు. సానియామీర్జా, పి.వి సింధులు అంత‌ర్జాతీయ క్రీడాపోటీల్లో త‌మ స‌త్తా చాటుతున్న విష‌యం మనందరికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తికి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ ఛైర్మ‌న్ స‌త్య‌నారాయ‌ణ , సాంఘిక సంక్షేమ ఆశ్ర‌మ విద్యాసంస్థ‌ల సొసైటీ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్. ఆర్‌. ఎస్ ప్ర‌వీణ్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates