Nizamabad MP

ఆరోగ్య తెలంగాణ ల‌క్ష్యం

స‌న్‌షైన్ గాస్ట్రోఎంట‌రాల‌జీ, లివ‌ర్ డిసీజెస్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభోత్స‌వంలో ఎంపి క‌విత‌

ఆరోగ్య తెలంగాణ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని నిజామాబాద్ ఎం.పి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత తెలిపారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మోడ‌ల్ కావాల‌ని కోరారు. స‌మ‌ష్టి కృషితో ఈ ల‌క్ష్యాన్ని సాధిద్దామ‌ని పిలుపునిచ్చారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని స‌న్‌షైన్ ఆసుప‌త్రిలో గాస్ట్రో ఎంట‌రాల‌జీ, లివ‌ర్ డిసీజెస్ ఇనిస్టిట్యూట్‌ను క‌విత‌ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పోరేట‌ర్ హాస్పిట‌ల్స్ వ‌ల్ల హైద‌రాబాద్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొస్తోందన్నారు. ఆసియాలోనే నంబ‌ర్‌వ‌న్ అయిన స‌న్‌షైన్ ఆసుప‌త్రి మోకాళ్ల మార్పిడి, హార్ట్ స‌ర్జ‌రీల‌కు పెట్టింది పేర‌న్నారు. కొత్త‌గా గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ. లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ విభాగంలో ఎంట‌ర్ అయిన స‌న్‌షైన్ కొత్త ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్ర‌యివేటు రంగం ఎద‌గాల‌ని ఆకాంక్షించారు. అయితే ప్ర‌భుత్వ ఆసుప‌త్రులూ ప్ర‌యివేటుకు ధీటుగా ఎద‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ దిశ‌గా ప్ర‌భుత్వం కృషి చేస్తున్న‌ద‌ని తెలిపారు. పేద‌ల‌కు, ధ‌నికుల‌కు తేడా లేకుండా మెరుగైన వైద్య‌సేవ‌లు అందాల‌నేది ప్ర‌భుత్వ అభిమ‌త‌మ‌ని చెప్పారు క‌విత‌.

Kalvakuntla Kavitha launched liver disease institute in Sunshine Hospital
ఉస్మానియా గాంధీ ఆసుప‌త్రుల‌తో పాటు హైద‌రాబాద్ న‌లుమూల‌లా 1000 ప‌డ‌క‌ల ఆసుప‌త్రుల ఏర్పాటు చేయాల‌ని సిఎం కేసిఆర్ ఆలోచిస్తున్నార‌ని తెలిపారు . జిల్లా కేంద్రాల్లో కూడా 1వేయి ప‌డ‌క‌ల ఆసుప‌త్రులు ఉండాల‌ని, అలాగే నియోజ‌క వ‌ర్గ కేంద్రంలో 100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి, మండ‌ల కేంద్రాల్లో 30 ప‌డ‌క‌ల ఆసుప‌త్రులు ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఆలోచ‌న అని చెప్పారు క‌విత‌. ఇందుకు అవ‌స‌ర‌మైన నిధుల‌ను కూడా విడుద‌ల చేస్తున్నార‌న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప‌నిచేసేందుకు డాక్ట‌ర్లు ఇష్ట‌ప‌డ‌డం లేదన్నారు. వారి పిల్ల‌ల చ‌ద‌వులు, వారి సామాజిక హోదాకు భంగం వాటిల్ల‌కుండా అవ‌స‌ర‌మ‌యాన సౌకర్యాల‌ను పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. .ఫ్రెండ్లీ వాతావర‌ణాన్ని క్రియేట్ చేసి..ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల చేత ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని సిఎం కేసిఆర్ గారు ప్ర‌యత్నిస్తున్నార‌ని వివ‌రించారు. ఆరోగ్యానికి తెలంగాణ ప్ర‌భుత్వం ప్రాధాన్యత‌. ఇస్తోంద‌ని, ఇందుకు అనుగుణంగా బ‌డ్జెట్ కూడా రిలీజ్ చేస్తున్న‌ద‌న్నారు. ..వ‌చ్చే రెండేళ్ల‌లో మంచి మార్పు ఉంటుంద‌న్నారు ఎంపి క‌విత‌. ఈ కార్య‌క్ర‌మంలో స‌న్‌షైన్ ఆసుప‌త్రి మేనేజింగ్ డైరెక్ట‌ర్‌ డాక్ట‌ర్ గురువారెడ్డి, సిఇఓ డాక్ట‌ర్ బ‌త్తిని నాగ‌రాజు, ఛీఫ్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్ డాక్ట‌ర్ యార్ల‌గ‌డ్డ నాగార్జున‌,ఛీఫ్ మెడిక‌ల్ గ్యాస్ట్రోఎంట‌రాల‌జిస్ట్ డాక్ట‌ర్ బి. ర‌వి శంక‌ర్‌, ఛీఫ్ స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రోఎంట‌రాల‌జిస్ట్ డాక్ట‌ర్ ఆనంద్‌కుమార్‌, గాక్ట‌ర్ గోపాల్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.


Connect with us

Latest Updates